గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

పోలీసుల ముందు సిగ్నల్ జంప్ అయితే, హెల్మెట్ లేకుండా కనబడితే.. ఒక్కటేమిటి వారికి దొరకాలేగానీ రోడ్డు మీద మనం చేసిన తప్పుల చిట్టా మొత్తం విప్పేస్తారు. ఆ తర్వాత ఏముంది. కేసు కట్టి ఛలాన్లు విధించి జన్మలో మరోమారు ట్రాఫిక్ రూల్స్ మీరకుండా చేస్తారు. నాణేనికి బొమ్మ-బొరుసు ఉన్నట్లు.. సమాజంలో కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లఘించే వారితో పాటు, ట్రాఫిక్ రూల్స్‌ను పొరబాటున కూడా తూ.చ. తప్పకుండా పాటిస్తారు.

గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

ట్రాఫిక్ రూల్స్ తప్పితే ఛలాన్లు, కేలుసు కొరడా ఝులిపించే పోలీసులు.. ట్రాఫిక్ రూల్స్ పాటించే వారిని సత్కరించాలనుకున్నారు. దేశంలోనే ఎన్నడూలేని విధంగా మన హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈ మహాత్కార్యానికి పూనుకున్నారు. వినడానికి కాస్త కొత్తగా ఉన్నప్పటికీ ఇది అక్షర సత్యం.. మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం రండి...

గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్ మహానగరంలో "ప్యాట్రోల్ ఫర్ హ్యాపీ డ్రైవింగ్" అనే ప్రోగ్రాంను రాచకొండ పోలీస్ కమీషనరేట్ గురువారం నాడు ప్రారంభించారు. ట్రాఫిక్ నియమాలను ప్రతినిత్యం తప్పకుండా పాటిస్తున్న ప్రజలను సత్కరించడమే దీని ముఖ్య ఉద్దేశం.

గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

రాచకొండ ట్రాఫిక్ కమీషనర్ మహేష్ ఎమ్ భగవత్ ప్రత్యేక చొరవతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా ట్రాఫిక్స్ రూల్స్ పద్దతిగా పాటిస్తున్న రైడర్లు మరియు డ్రైవర్లను గుర్తించి, వారందరినీ ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిపించి సిటీ పోలీస్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నారు.

గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

కమీషనర్ భగవత్ మాట్లాడుతూ, "ఇప్పటి వరకు ట్రాఫిక్ ఉల్లంఘనదారులను గుర్తించి, ఛలానాలు విధించి, వాహనాలను సీజ్ చేయడంతో పాటు ఇంకా ఎన్నో చేసేవారు. ట్రాఫిక్ రూల్స్ తప్పేవారు మాత్రమే కాదు... ప్రతి రోజు ట్రాఫిక్స్ రూల్స్ పాటించే వారిని గుర్తించి, వారిని అభినందించాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విభిన్న ఆలోచనతో సంతోకరమైన డ్రైవింగ్ కోసం ప్యాట్రోలింగ్ అనే కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు ప్రారంభించినట్లు" చెప్పుకొచ్చాడు.

గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

చట్టాన్ని ఉల్లంఘించేవారిని శిక్షించడమే కాదు చట్టాన్ని పాటించే వారిని అభినందించి సత్కరించడం కూడా అవసరమే అంటున్నారు. అలాంటి ప్రజలకు ప్రత్యేకంగా సర్టిఫికేట్లను అందించి సమాజంలో ఇతరులకు ఆదర్శవంతంగా నిలిచేందుకు కృషి చేయడం వీరి ముఖ్య ఉద్దేశ్యం. నిజాయితీ, నిబద్ధతత రూ5ల్స్ పాటించి మరియు సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన డ్రైవర్లకు చేసే ఈ సత్కారం ఎంతో మందిని మేలుకొలుపుతుందని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు.

గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉన్నపుడు తరచూ గమనించే సంఘటనల్లో హెల్మెట్ ధరించడం, సీట్-బెల్ట్ ఉపయోగించడం, టర్న్ ఇండికేటర్ లైట్ల వాడకం మరియు కదిలే వాహనాల మధ్య తగినంత దూరం పాటించడం వంటివి ప్రజలు పాటించడాన్ని పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

ఈ ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత కమీషనర్ భగవత్ స్వయంగా గమనించినపుడు లేడీ డాక్టర్, సీనియర్ సిటిజన్, ఆటో డ్రైవర్ మరియు కొంత మంది లారీ డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లు తెలిపాడు. ఇలాంటి ఎంతో మంది సేఫ్ డ్రైవర్లను సత్కరించి, వారి వాహనాల మీద సురక్షితమైన డ్రైవర్ అనే స్టిక్కర్ అంటించనున్నారు.

గుడ్‌న్యూస్: హైదరాబాదీలకు శుభవార్త ప్రకటించిన సిటీ ట్రాఫిక్ పోలీసులు

ఈ కార్యక్రమంలో మొత్తం 8,000 మంది సేఫ్ డ్రైవర్లను గుర్తించి వారికి సర్టిఫికేట్లను ప్రధానం చేయాలనే లక్ష్యం రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. చట్టాన్ని గౌరవించే వారిని అభినందించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కమీషనర్ తెలిపాడు.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్‌కు సంభందించిన కేసులు తగ్గించి, దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేంకు రాచకొండ పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి!

Most Read Articles

English summary
Traffic Police To Honour 8000 Citizens In Hyderabad — Catching The Good Guys. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X