రెండు కోట్ల ధరతో ఇండియా కు రాబోతున్న ఫోర్డ్ కార్...!
రానున్న నెలలు భారతదేశం లో ప్రారంభం కానున్న ఎంజి మరియు కియా వంటి బ్రాండ్లు యొక్క కార్లను మార్కెట్ లో చూస్తాము. ప్యుగోట్ వంటి అనేక ఇతర బ్రాండ్లు కూడా భారతీయ విడుదల అవ్వడానికి సిద్ధమయ్యాయి.

భారతదేశంలో ఫోర్డ్ షెల్బి పేరును ప్రవేశపెట్టేందుకు పుణెకు చెందిన ఏజేపి గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సమాచారం. ఎల్.జె.పి గ్రూప్ షెల్బి ఇండియాతో కలిసి భారతదేశంలో ఉన్నత స్థాయి ప్రదర్శన కార్లను చేయాలనీ చూస్తుంది.

షెల్బి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ట్యూనర్ సంస్థలలో ఒకటి మరియు కార్ల శ్రేణిని తయారుచేయడానికి షెల్బి, ఫోర్డ్ తో కలిసి పని చేస్తోంది. వారి అత్యంత ప్రజాదరణ పొందిన కార్లు ఫోర్డ్ ముస్టాంగ్ మరియు రాప్టర్ యొక్క అత్యంత ట్యూన్ చేసిన సంస్కరణలు ఆధారం గ ఈ ప్రాజెక్ట్ ను తాయారు చేస్తారు.

ఈ కంపెనీకి దాని వ్యవస్థాపకుడు కార్రోల్ షెల్బి అనే పేరు పెట్టారు, ఆయన అత్యుత్తమ ఆటోమోటివ్ ఇంజనీర్ గ పెప్రక్యాతి గాంచిన వారు గ ఉన్నారు. ఇది బహుశా కొత్తగా 2020 షెల్బి ముస్టాంగ్ జిటి500 ను ఆవిష్కరించాలని అనుకొంటున్నారు.

ఇది 5.2 లీటర్, సూపర్ఛార్జ్డ్ V8 ఇంజిన్ను కలిగి ఉంది, ఇది 700 BP కంటే ఎక్కువ శక్తి ని ఉత్పత్తి చేస్తుంది.ఈ ఏడాది తొలి సగం లో మొదటి కార్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం, ముందుగా పేర్కొన్న విధంగా, ఏజేపి గ్రూప్ ద్వారా స్థానికంగా ఏర్పాటు చేయబడుతుంది.

కానీ అదనంగా కొన్ని మార్పులను చేయవలసి ఉన్నది. ఈ స్పోర్టి బాడీ కలిగిన సామగ్రి మరియు కార్బన్ ఫైబర్ భాగాలను కలిగి ఉంటుంది. ఇంజిన్లు మరియు కార్ల మొత్తం పనితీరు కోసం ట్యూన్ చేయబడుతుంది.మానియాక్ జిటి 500 కాకుండా ఫోర్డ్ మస్టాంగ్ ఆధారంగా ప్రస్తుతం జిటి350 మరియు జిటి350R అనే రెండు ఇతర షెల్బి నమూనాలు ఉన్నాయి.

ఇవి 5.2 లీటర్, V8 ఇంజిన్తో శక్తితో పాటుగా 7,500rpm వద్ద 519bhp శక్తిని మరియు 4,750 rpm వద్ద 582Nm టార్క్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పవర్ ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ ద్వారా చక్రాలకు బదిలీ చేయబడుతాయి.

భారతదేశంలో షెల్బి ప్రారంభానికి దేశంలో ఒక కొత్త అధ్యాయాన్ని తీసుకురావచ్చు, ఎందుకంటే ప్రపంచంలోని కొన్ని అద్భుతమైన కార్లను తయారు చేయడానికి షెల్బి ట్యూనర్ సంస్థ ప్రసిద్ది చెందింది. భారతదేశంలో ఫోర్డ్ ముస్తాంగ్ యొక్క ప్రజాదరణ కారణంగా, షెల్బి సంస్థ ఇక్కడ విజయం సాధించగలరు.


Click it and Unblock the Notifications








