విపరీతంగా పెరుగుతున్న హోండా కార్ల ధరలు: ఏయే కారు మీద ఎంత..

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా విక్రయించే అన్ని మోడళ్ల మీద ధరలు పెంచుతున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేయడంతో, వాటిని అందిచడం ద్వారా పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో అన్ని మోడళ్ల ధరల పెంపు అనివార్యమవుతోంది.

విపరీతంగా పెరుగుతున్న హోండా కార్ల ధరలు: ఏయే కారు మీద ఎంత..

హోండా విక్రయిస్తున్న మొత్తం ఎనిమిది మోడళ్ల మీద 1.2 శాతం ధరల పెంచేందుకు నిర్ణయించుకుంది. ధరల పెంపు అనంతరం నూతన ధరలు జూలై 01, 2019 నుండి అమల్లోకి రానున్నాయి.

విపరీతంగా పెరుగుతున్న హోండా కార్ల ధరలు: ఏయే కారు మీద ఎంత..

ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దాదాపు అన్ని వేరియంట్ల మీద సుమారుగా రూ. 10,000 వరకు ధరల పెంపు చేపట్టింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ ఏడాదిలో ఇలా ధరలు పెంచడం ఇది రెండోసారి.

విపరీతంగా పెరుగుతున్న హోండా కార్ల ధరలు: ఏయే కారు మీద ఎంత..

హోండా విక్రయిస్తున్న అమేజ్ నుండి అకార్డ్ హైబ్రిడ్ కారు వరకు అన్నింటి 1.2 శాతం ధరలు పెరుగుతాయి. వీటి ధరల శ్రేణి రూ. 5.9 లక్షల నుండి రూ. 44.3 లక్షల మధ్య ఉంది. నూతన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని కార్లలో కొన్ని అదనపు సేఫ్టీ ఫీచర్లు అందివ్వడంతో ధరలు పెంచుతున్నట్లు తెలిసింది.

విపరీతంగా పెరుగుతున్న హోండా కార్ల ధరలు: ఏయే కారు మీద ఎంత..

హోండా మోటార్స్ ఇండియా విభాగం ప్రస్తుతం అమేజ్, సిటీ, డబ్ల్యూఆర్-వి, బిఆర్-వి, జాజ్, సివిక్, సీఆర్-వి మరియు అకార్డ్ మోడళ్లను విక్రయిస్తోంది. వీటన్నింటిలో కూడా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఇబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్స్ వంటి ఫీచర్లను తప్పనిసరిగా అందించడం జరిగింది.

విపరీతంగా పెరుగుతున్న హోండా కార్ల ధరలు: ఏయే కారు మీద ఎంత..

హోండా కార్స్ ఇండియా ఇటీవల తమ సరికొత్త హోండా అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారును ఏస్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో లభించే టాప్ ఎండ్ VX వేరియంట్ ఆధారంగా తీసుకొచ్చిన స్పెషల్ ఎడిషన్ రూ. 7.89 లక్షలు మరియు రూ. 9.72 లక్షల ధరల శ్రేణిలో లభిస్తోంది.

విపరీతంగా పెరుగుతున్న హోండా కార్ల ధరలు: ఏయే కారు మీద ఎంత..

హోండా అమేజ్ ఏస్ ఎడిషన్ మూడు విభిన్న రంగుల్లో లభిస్తోంది. అవి, రేడియంట్ రెడ్, లునార్ సిల్వర్ మరియు వైట్ ఆర్చిడ్ పర్ల్. ఇందులో ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్, ట్రంక్ స్పాయిలర్, బ్లాక్ డోర్ విజర్, డోర్ ఎడ్జ్ గార్నిష్ మరియు ఏస్ ఎడిషన్ గుర్తులున్న ఇంటీరియర్ సీట్ కవర్లు ఉన్నాయి.

విపరీతంగా పెరుగుతున్న హోండా కార్ల ధరలు: ఏయే కారు మీద ఎంత..

హోండా మోటార్స్ తమ తదుపరి ఉత్పత్తిగా హెచ్ఆర్-వి ఎస్‌యూవీని ఇండియన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న కియా సెల్టోస్, ఎంజీ హెక్టార్, టాటా హ్యారీయర్ వంటి మోడళ్లకు పోటీగా రూ. 12 నుండి 18 లక్షల ధరల శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, June 28, 2019, 17:51 [IST]
English summary
Honda Cars India is set to increase prices of their cars by 1.2 percent from July 2019. Read in Telugu.
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+