హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా విక్రయిస్తున్న మోడల్ "గ్రాండ్ ఐ10". థర్డ్ జనరేషన్ హ్యుందాయ్ గ్రాండ్ 10 కారును అత్యాధునిక ఫీచర్లు మరియు సరికొత్త డిజైన్‌తో ఈ మధ్య కాలంలోనే ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.

భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా గ్రాండ్ ఐ10 కారును బిఎస్6 వెర్షన్‌లో గ్రాండ్ ఐ20 నియోస్ పేరుతో గత ఆగష్టులో మళ్లీ లాంచ్ చేసింది. గ్రాండ్ ఐ0 మరియు గ్రాండ్ ఐ10 నియోస్ రెండు మోడళ్లు కూడా హ్యుందాయ్ షోరూముల్లో లభిస్తున్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనాలనుకుంటున్నారా..? అయితే గ్రాండ్ ఐ10 నియోస్ కారును కొనే ముందు తప్పక తెలుసుకోవాల్సిన 7 ముఖ్యమైన విషయాలు మీ కోసం...

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

1. ఎక్ట్సీరియర్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎక్ట్సీరియర్ డిజైన్ చూడటానికి అత్యంత ఖరీదైన మోడల్ తరహాలో ఉంటుంది. బయటి నుండి చూస్తే స్పోర్టివ్ అండ్ అగ్రెసివ్ డిజైన్ దీని సొంతం. ఫ్రంట్ డిజైన్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్యాస్కేడింగ్ గ్రిల్ మరియు కండలు తిరిగిన స్ట్రాంగ్ బంపర్ ఉన్నాయి. గ్రిల్‌కు ఇరువైపులా ఉన్న రెండు ఎల్‌ఈడీ లైట్లు కారుకు సరికొత్త రూపాన్ని తీసుకొచ్చాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

2. ఇంటీరియర్

హ్యుందాయ్ నియోస్ కారు ఇంటీరియర్ మీద ఎక్కుగానే దృష్టి పెట్టింది. లోపల ఉన్న అన్ని ఫీచర్లు లగ్జరీ మరియు సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది. మునుపటి తరం గ్రాండ్ ఐ10 కారులోని ఫీచర్లతో పోల్చుకుంటే నియోస్ లిస్ట్ చాలా పెద్దది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

ఇంటీరియర్‌లో ప్రతిఒక్కరినీ ఆకర్షించే అంశం డాష్‌‌బోర్డ్, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను సపోర్ట్ చేసే 8.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, నాలుగు స్పీకర్ల అర్కామిస్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. స్టీరింగ్ వెనుక 5.3-ఇంచుల డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ టాప్ ఎండ్ వేరియంట్లో లెథర్ ఫినిషింగ్ మరియు మీడియా కంట్రోల్ బటన్స్ గల స్టీరింగ్ వీల్, సెగ్మెంట్ ఫస్ట్ వైర్-లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, UCB ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రియర్ పార్కింగ్ కెమెరా, ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే సైడ్ మిర్రర్ల మరియు రియర్ వైపర్/వాషర్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

3. నియోస్ కొలతలు

కొలతల పరంగా చూసుకుంటే గ్రాండ్ ఐ10 నియోస్ పొడవు 3,085మిమీ, వెడల్పు 1,680మిమీ, ఎత్తు 1,520మిమీ, వీల్ బేస్ 2,450మీమీలలో ఉంది. మునుపటి తరం గ్రాండ్ ఐ10తో పోల్చుకుంటే నియోస్ మోడల్ 40మిమీ వరకు పొడవైనది, 20మిమీ వరకు విశాలమైనది మరియు వీల్‌బేస్ కూడా 25మిమీల వరకు పెరిగింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

4. ఇంజన్ వివరాలు

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారును పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. ఇందులోని 1.2-లీటర్ బిఎస్6 పెట్రోల్ ఇంజన్ 83బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, అదే విధంగా, నియోస్‌లోని 1.2-లీటర్ డీజల్ ఇంజన్ 75బిహెచ్‌‌పి-190ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్‌లను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

5. పోటీ

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ క్రిందకు వస్తుంది. ఇదే సెగ్మెంట్లో ఉన్న ఫోర్డ్ ఫిగో, మారుతి సుజుకి ఇగ్నిస్ మరియు స్విఫ్ట్ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. గ్రాండ్ ఐ10 నియోస్ మిగతా వాటికంటే చిన్నగానే ఉంటుంది, ఫోర్డ్ ఫిగో అన్నింటికంటే పొడవైనది మరియు మారుతి స్విఫ్ట్ వెడల్పు కాస్త ఎక్కువగా ఉంటుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

6. వేరియంట్లు మరియు కలర్ ఆప్షన్స్

కొత్తగా పరిచయమైన ఎరా మరియు ఆస్టా వేరియంట్లతో పాటు, గ్రాండ్ ఐ10 నియోస్.. అంతకు ముందు మార్కెట్లో ఉన్న గ్రాండ్ ఐ10 మోడల్‌ యొక్క అన్ని వేరియంట్లలో లభ్యమవుతోంది. నియోస్ కారును ఆరు విభిన్న సింగల్ టోన్ కలర్ ఆప్షన్లతో లభిస్తోంది. అవి, ఆల్ఫా బ్లూ, ఆక్వా టీల్, టైటాన్ గ్రే, పోలార్ లైట్, టైఫూన్ సిల్వర్ మరియు ఫైరీ రెడ్. సరికొత్త నియోస్ హ్యాచ్‌బ్యాక్ పోలార్ వైట్ (బ్లాక్ రూఫ్) మరియు ఆక్వా టీల్ (బ్లాక్ రూఫ్) రెండు డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‍‌‌లో కూడా లభిస్తోంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

7. మైలేజ్

హ్యుందాయ్ ప్రకారం, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ లీటర్‌కు 20.7కిలోమీటర్లు, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పెట్రోల్ వేరియంట్ మైలేజ్ 20.5కిమీలు. నియోస్ డీజల్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా లీటర్‌కు 26.2కిమీల మైలేజ్ ఇస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొంటున్నారా..? తప్పక తెలుసుకోవాల్సిన 7 విషయాలు!

కారు గురించి ఎలాంటి పరిజ్ఞానం లేకుండా కొత్త కారును ఎంచుకోవాలనుకునే పాఠకులకు కోసం.. కొత్త కారు కొనే ముందు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనే వివరాలను విశ్లేషిస్తూ ఈ కథనం తీసుకొచ్చాము.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మంచి సేల్స్ సాధిస్తోంది. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ విషయానికి వస్తే మారుతి స్విఫ్ట్ మొదటి స్థానంలో, నియోస్ రెండవ స్థానంలో ఉంది. విసృతమైన నెట్‌వర్క్ మరియు రీసేల్ వ్యాల్యూ అధికంగా ఉండటంతో చాలా మంది స్విఫ్ట్ కారుకే మొగ్గుచూపుతున్నారు. అరుదైన ఫీచర్లు మరియు సొసైటీలో కాస్త డిఫరెట్ంగా ఉండాలంటే హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ బెస్ట్ ఛాయిస్.

Most Read Articles

English summary
Hyundai Grand i10 Nios: 7 Things You Need To Know. Read in Telugu.
Story first published: Saturday, December 21, 2019, 14:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X