ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

మే నెలలో వెన్యూ కార్ ను విడుదల చేసిన హ్యుందాయ్, భారత మార్కెట్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఎందుకంటే ఇందులో కొత్త కొత్త ఫీచర్స్ లను తీసుకొచ్చింది, ఇది అత్యధికంగా అమ్ముడైన కార్ గా వార్తల్లో నిలిచింది. అయితే హ్యుందాయ్ భారత మార్కెట్లో తన విజయాన్ని కొనసాగించడానికి కొత్త ఫీచర్ ని మొదలు పెట్టింది. అది ఏమిటో చూద్దాం రండి...

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లో కొత్త కోన ఎలక్ట్రిక్ కార్ ప్రారంభం కానుంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ విషయానికి వస్తే ఫోర్ వీలర్ విభాగంలో ఇండియన్ మార్కెట్ ఇది మొదటిది అని చెప్పవచ్చు కాబట్టి, కొనుగోలుదారుల మనసుల్లో స్థానాన్ని సంపాదించడానికి హ్యుందాయ్ ఒక అడుగు ముందుకేసింది.

రాబోయే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్లో ఉన్న కొత్త ఫీచర్ ప్రస్తావిస్తూ వీడియోను అధికారికంగా విడుదల చేసింది, ఇది కస్టమర్లు స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడుతుంది. అది ఏమిటంటే ఈ వీడియోలో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ లో ఫాస్ట్ చార్జింగ్ ఉంటుందనే విషయాన్నీ వెల్లడిస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

అయితే, ఒక షరతు ఉంది. స్మార్ట్ ఫోన్ ని వేగంగా ఛార్జ్ చేయడం కొరకు, దానిని ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ కు ఫ్లగ్ ఇన్ చేయాలి. వేగవంతమైన ఛార్జింగ్ వ్యవస్థలు చాలా అధిక శక్తి వాటేజ్ వద్ద పనిచేస్తాయి.

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

ఇది బ్యాటరీ వేగంగా చార్జ్ అయ్యేందుకు స్మార్ట్ఫోన్ వలె వేగవంతంగా సహాయపడుతుంది. అయితే, హ్యుందాయ్ ఫాస్ట్ చార్జర్ ను పూర్తిగా ఉపయోగించి ఛార్జ్ చేయడానికి కారు ఎంత సమయం తీసుకుంటుందో అధికారికంగా వెల్లడించలేదు.

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

ఈ సీరీస్ లోని ఇతర వీడియోస్ లో కోన ఎలక్ట్రిక్ కార్ యొక్క శక్తివంతమైన పనితీరు, సౌకర్యవంతమైన ఛార్జింగ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, తక్కువ రన్నింగ్ కాస్ట్, హై సేఫ్టీ స్టాండర్డ్స్, ప్రీమియమ్ లుక్స్ మరియు ఫీచర్లు మరియు లాంగ్ డ్రైవింగ్ రేంజ్ గురించి ఉంటుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

ఈ సందర్భంగా, శ్రీ పునీత్ ఆనంద్, (సీనియర్ జిమ్ & గ్రూపు హెడ్-మార్కెటింగ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్) మాట్లాడుతూ, "హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కొత్త టెక్నాలజీ కి నాంది పలుకుతోంది. మేము కస్టమర్ సెంట్రిక్ సంస్థతో ఒక బ్రాండ్ గా ఉన్నాము కొత్త మార్గాలను మరియు అవకాశాలను అన్వేషించడం ద్వారా వినూత్న చలనశీలత పరిష్కారాలతో రాణించడానికి కృషి చేస్తున్నాం.

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

కోన ఎలక్ట్రిక్ తో, హ్యుందాయ్ ఇండియన్ ఆటోమొబైల్ కు కొత్త కోణాన్ని ఇస్తుంది, ఇది క్లీనర్, గ్రీనర్ మరియు స్థిరమైన చలనశీలతను కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై భారతీయ వినియోగదారులకు ఉన్న అనుమానాలు, అస్పష్టతలు, అపోహలను ఈ కోన ఎలక్ట్రిక్ కార్ ద్వారా తీరుతాయి అని చెప్పాడు".

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

హ్యుందాయ్ కోన అంతర్జాతీయ మార్కెట్లలో రెండు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. అయితే భారత మార్కెట్లో ఇప్పటికే ఇండియన్ రోడ్ల మీద టెస్టింగ్ చేస్తుండగా చిక్కిన ఈ కారుకు ఒక్క వేరియంట్ మాత్రమే వస్తుంది. ఇండియన్ వర్షన్ కోన కు సంబంధించిన ఖచ్చితమైన స్పెసిఫికేషన్స్ ఇంకా తెలియలేదు.

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

అంతర్జాతీయ మార్కెట్లలో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ ఆధారమైన 39.2 kWh బ్యాటరీతో సుమారు 300 కిలోమీటర్ల పరిధి ప్రయాణించవచ్చు. కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 134 బిహెచ్పి మరియు 335 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఇది కేవలం 9.3 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకోగలదు.

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

ఇందులో మరింత శక్తివంతమైన వెర్షన్ 64 kWh బ్యాటరీతో కూడా రానుంది. ఇది గరిష్టంగా 204 బిహెచ్పి మరియు 395 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెగ్యులర్ ఛార్జింగ్ ఆప్షన్ తో, కోన ఎలక్ట్రిక్ కార్ లో బ్యాటరీ స్థాయిని 80% కు తీసుకురావడానికి ఫాస్ట్ చార్జర్ ను ఉపయోగించి 54 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్తో వస్తున్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కార్

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

ప్రైవేట్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లు ఇప్పటి వరకు తక్కువ పనితీరు, పరిధి కలిగి ఉన్నాయి. అయితే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వేహికల్ మార్కెట్ లో విప్లవాత్మక మార్పును తీసుకురానుంది మరియు పెట్రోల్ లేదా డీజిల్ ఆధారిత కార్లపై దీని ప్రభావం ఎంతో ఉంటుంది.

Most Read Articles

English summary
Hyundai has revealed that its upcoming Kona SUV will feature fast-charging similar to a smartphone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X