ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

హ్యుందాయ్ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ హ్యుందాయ్ కోనా ( Hyundai Kona)ను విపణిలోకి ఇటీవల లాంచ్ చేసింది. విడుదలైన అనతి కాలంలోనే మార్కెట్లో దీనికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 25.30 లక్షలుగా ఉన్నప్పటికీ ధర విషయంలో ఏ మాత్రం వెనుకాడకుండా హాట్ కేకుల్లో కొనేస్తున్నారు.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి వచ్చిన కేవలం 10 రోజుల్లోనే అనూహ్యమైన ఫలితాలు నమోదు చేసుకుంది. అవును, ఈ బడ్జెట్ రేంజ్ ఉన్న కార్లకు ఇలాంటి డిమాండ్ రావడం చాలా అరుదు. కానీ హ్యుందాయ్ కోనా మోడల్ కంపెనీ సైతం ఊహించని ఫలితాలను సాధిస్తోంది.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

విడుదలైన 10 రోజుల వ్యవధిలో 120 మంది కస్టమర్లు హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకున్నారు. విక్రయించింది 120 కార్లే అయినప్పటికీ ధర పరంగా చూసుకుంటే 30 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

ఎలక్ట్రిక్ కార్లే భవిష్యత్తు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుమారు 20 ఏళ్ల క్రితమే రెవా అనే ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చినప్పుడు సేల్స్ మరియు లాభాల పరంగా ఎలాంటి వృద్ది లేదు. కానీ గ్రీన్ వెహికల్స్ (ఉద్గార రహిత) విప్లవం ఒక్కసారిగా ఊపందుకోవడంతో మార్కెట్లో వీటికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రెవా కంపెనీని కొనుగోలు చేసి మహీంద్రా ఎలక్ట్రిక్ సంస్థగా రూపాంతరం చేసింది. దేశీయ దిగ్గజ టాటా మోటార్స్ వాణిజ్య అవసరాలకు టిగోర్ ఎలక్ట్రిక్ కారును ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకా పలు అంకుర సంస్థలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పర్యావరణాన్ని కాపాడుకోవాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలకు అనుగుణంగా భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ కొంత పుంతలు తొక్కుతోంది.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదలయ్యేంత వరకు మార్కెట్లో ఎలాంటి కొత్త ఎలక్ట్రిక్ కార్లు రాలేదు. రూ. 25.30 లక్షల ధరతో వచ్చినప్పటికీ ఇతర పెట్రోల్ మరియు డీజల్ కార్లతో పాటు పలు అంతర్జాతీయ మోడళ్లతో పోల్చితే హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ధరకు తగ్గ విలువైన కారు అని నిరూపించుకుంది.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

ఏదేమైనప్పటికీ, ఇండియన్ కస్టమర్ల నుండి హ్యుందాయ్ కోనాకు అద్భుతమైన స్పందన లభించింది. కోనా ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేయాలని సుమారుగా 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. మరియు 120 మంది కోనా ఎస్‌యూవీని బుక్ చేసుకున్నారు.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

హ్యుందాయ్ కోనా పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇందులో ఇంజన్ వ్యవస్థ ఏ మాత్రం ఉండదు. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 452 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. హ్యుందాయ్ కోనాలోని బ్యాటరీ వ్యవస్థను 50kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 57 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం ఛార్జ్ చేయగలం.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

పర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్రోనష్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 136బిహెచ్‌పి పవర్ మరియు 395ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 9.7 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. సాంకేతిక అంశాలను పరిశీలిస్తే డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఉన్న కార్ల పనితీరుకు ఏ మాత్రం తగ్గదని చెప్పవచ్చు.

ఒక్కో కారు ధర 25 లక్షలు.. అయినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి: ఎందుకంత డిమాండ్?

భద్రత పరంగా హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీలో ఆరు అత్యాధునిక ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు కెమెరా వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 23, 2019, 12:28 [IST]
English summary
Hyundai Kona EV Gets 120 Bookings & Over 10,000 Test-Drive Requests In Just 10 Days. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+