సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

హ్యందాయ్ నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. ఫీచర్లు అదిరిపోయాయ్. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఏకంగా 452 కిలోమీటర్లు వెళ్లొచ్చు. బ్యాటరీ ఫుల్ కావడానికి 57 నిమిషాలు మాత్రమే చాలు. కారు లుక్ కూడా సూపర్గా ఉంది, మరి ఈ కార్ యొక్క ఫీచర్లూ, ధర వివరాలను తెలుసుకొందాం రండి..

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తాజాగా తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘కోన'ను దేశీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.25.30 లక్షలు. కోనా ఎలక్ట్రిక్ అనేది ' భారతదేశపు మొట్టమొదటి రియల్ ఎలక్ట్రిక్ ఎస్యువి ', మరియు ఒకే ఛార్జ్ (ఏఆర్ఏఐ సర్టిఫైడ్) లో 452 కిలోమీటర్ల రేంజ్ ను కలిగి ఉంది.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

హ్యుందాయ్ కోనా ఈ ఎస్‌యూవీ లైనప్ లో చేరింది, ఈ విభాగంలో వెన్యూ, క్రెటా, మరియు టక్సన్ లు ఉన్నాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల గురించి కొన్ని అపోహలు మరియు గందరగోళం ఉంది, అటువంటి వాటిని పరిష్కరించడం కొరకు హ్యుందాయ్ కోనా విడుదల చేసింది.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

హ్యందాయ్, అవసరమైన ఈవి మౌలిక సదుపాయాలు మరియు మద్దతుతో 11 నగరాల్లో 15 డీలర్ షిప్ లను ఎంచుకోవడం ద్వారా కోనా రిటైలింగ్ చేస్తుంది. అయితే డిమాండ్ ను చూసిన తర్వాత నంబర్లు పెంచవచ్చు.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ 39.2 కిలోవాట్ బ్యాటరీతో వస్తుంది, ఇది సింగిల్ ఛార్జ్ పై 452 కిలోమీటర్ల ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ రేంజ్ ను కలిగి ఉంది. కేవలం 52 నిమిషాల్లో 80 శాతం వరకు కోనా ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీల ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యాలను కూడా ఆఫర్ చేస్తుందని హ్యుందాయ్ ధృవీకరించింది.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

అయితే, రెగ్యులర్ చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వినియోగంతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ పూర్తి చార్జీ అవ్వడానికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల సమయం పడుతుంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ 100 కిలోవాట్ మోటార్ తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 131బిహెచ్పి మరియు 395ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

ఈ కారు 9.7 సెకన్లలో 0-100 కిమీ/గం సామర్థ్యాన్ని కలిగి ఉంది, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ స్టైలిష్ డిజైన్ ను కలిగి ఉంది. బ్రాండ్ యొక్క డిజైన్ లాంగ్వేజ్ ని ఇది అనుసరించింది, అయితే ఎలక్ట్రిక్ వేహికల్ కావడం వల్ల, ఇది నిర్ధిష్ట మార్పులను కలిగి ఉంటుంది.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

లోపల భాగంలో ట్రెడిషనల్ ఇంటీరియర్స్ కూడా వస్తాయి. ఇది అధిక సంఖ్యలో ఫీచర్లు మరియు ఎక్విప్ మెంట్ ని కలిగి ఉంది. కొన్ని ఫీచర్లల్లో 8 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, లెదర్ సీట్లు , లెదర్తో చుట్టిన స్టీరింగ్ వీల్ తో మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్,

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

10 విధాల పవర్ ఎడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్లు, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, 6-ఎయిర్ బ్యాగులు, ఈబిడి, ఎబిఎస్, ప్యాడెల్-షిప్టర్స్ ఫర్ అడ్జస్టబుల్ రీజనరేటివ్ బ్రేకింగ్, కోన ఎలక్ట్రిక్ కారులో నాలుగు డ్రైవ్ మోడ్ లను పొందుతుంది అవి ఎకో, ఎకో ప్లస్, కంఫర్ట్ మరియు స్పోర్ట్.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

హ్యుందాయ్ ఇండియా 3 సంవత్సరాలు/అపరిమిత కిమీలు వేహికల్ వారెంటీ మరియు 3 సంవత్సరాలు/160,000 కిలోమీటర్ల బ్యాటరీ వారెంటీ ఇస్తోంది. హ్యుందాయ్ అన్ని ఎలక్ట్రిక్ సెల్లింగ్ డీలర్ షిప్ ల్లో ఫాస్ట్ ఛార్జర్లను ఇన్ స్టాల్ చేస్తుంది. అత్యవసర ఛార్జింగ్ కోసం ఎంపిక చేసిన నగరాల్లో కోన ఎలక్ట్రిక్ సపోర్ట్ వెహికల్స్ ఉంటాయి.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

వెబ్ సైట్ మరియు యాప్ లో కోనా ఎలక్ట్రిక్ కార్ యొక్క కంపాటబుల్ ఛార్జింగ్ స్టేషన్లను ప్రదర్శించడానికి మ్యాప్ మై ఇండియాతో హ్యందాయ్ జత కట్టింది. భారతదేశం అంతటా పెట్రోల్ పంప్ ల వద్ద ఛార్జర్లను పెట్టడానికి హ్యుందాయ్ ఐఒసిఎల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

సంచలనం: ఊహించని ధరతో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కార్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ ఎస్యువి. ఈ కారు దేశీయంలో స్థానికంగా అసెంబుల్ అవుతుంది మరియు దేశంలో రాబోయే నిస్సాన్ లీఫ్, ఎంజి ఈజెడ్ఎస్ లకు పోటీగా నిలువనుంది. అయితే, భారతదేశం ఇంకా ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పై, వినియోగదారుల మధ్య ఆందోళనను హ్యుందాయ్ ఎలా పరిష్కరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది

Most Read Articles

English summary
New Hyundai Kona EV Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X