Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండూ కార్ల మినహాయింపుతో ధరలు పెంచుతున్న హ్యుందాయ్
దక్షిణ కొరియా ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తాము ఉత్పత్తి చేసే వాహనాల ధరలను పెంచుతున్నట్టుగా ప్రకటించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాహనాల ధరను గరిష్టంగా రూ.9,200 వరకు పెంచుతున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆటో మొబైల్ తయారీ వస్తువుల ధరలు పెరగడంతో తాము కార్ల ధరలను పెంచాల్సి వస్తోందని హ్యుందాయ్ వివరంగా తెలిపింది.

అయితే పెంచిన ధరలు ఇదివరకే కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన వెన్యూ, ఎలక్ట్రిక్ వాహనం అయిన కోనాలకు వర్తించదని హ్యుందాయ్ వివరించింది.

భారత దేశం లో కార్ల భద్రతా ప్రమాణాల పెంపు దిశగా కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయని హ్యుందాయ్ పేర్కొంది. వీటిని అందిపుచుకునేందుకు సంస్థ వాహనాల తయారీలో గతంలో కంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోందని అందుకే ధరల పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా హ్యుందాయ్ వివరణ ఇచ్చింది.

వివిధ విభాగాల్లో 10 కారు మోడళ్లను హ్యుందాయ్ విక్రయిస్తోంది. హ్యుందాయ్ పోర్ట్‌ఫోలియోలో శాంట్రో, గ్రాండ్ ఐ10, యాక్సెంట్, వెర్నా, క్రెటా, టక్సన్ వంటి మోడళ్లు ఉన్నాయి. వీటి ధరలు రూ.3.9 నుంచి 26.95 లక్షల మధ్య ఉన్నాయి.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
ఇదిలా ఉంటే మే 21వ తేదీన ఆవిష్కరించబడిన కంపాక్ట్ ఎస్యూవి మోడల్ కారు వెన్యూ బుకింగ్స్‌లో రికార్డును నెలకొల్పుతోంది.

మే రెండో తేదీ నుంచే ప్రీ బుకింగ్స్ నమోదైన వెన్యూ కారు కోసం ఈ నెల 22వ తేదీ నాటికి 45 వేల యూనిట్ల మార్కుకు చేరుకున్నది.

హ్యుందాయ్ వెన్యూ కారు ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన విటారా బ్రెజా, టాటా నెక్సన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్యూవీ 300 మోడల్ కార్లతో గట్టిగా పోటీ పడుతోంది. మే నెల ఆఖరి నాటికి 20 వేలకు పైగా బుకింగ్ నమోదు చేసుకున్నాయి.

గత నెలలో పేర్లు రిజిస్టర్ చేసుకున్న వారు ఇంకా రెండు నెలల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గత నెల 21వ తేదీ నాటికి 1000 యూనిట్లు డెలివరీ చేసింది హ్యుందాయ్ మోటార్స్, ఇప్పుడు బుకింగ్ చేసుకొన్న వాటిని ఎప్పుడు డెలివరీలు ఇస్తుందో చూడాలి.