నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

హ్యుందాయ్ మోటార్స్ ఇండియా మే 21, 2019 న దేశీయ విపణిలోకి సరికొత్త వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. విడుదలైన అనతి కాలంలోనే హ్యందాయ్ వెన్యూ మోడల్‌‌కు ఊహించని స్పందన లభించింది.

కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 33,000 వెన్యూ ఎస్‌యూవీలను కస్టమర్లు బుక్ చేసుకున్నట్లు సంస్థ తెలిపింది. అంతే కాకుండా, హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ గురించి ఇప్పటి వరకు ఏకంగా 2 లక్షల మంది ఆసక్తికనబరిచినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

"సరిగ్గా విడుదలైన నెల రోజుల్లోనే 33,000 వెన్యూ కార్ల బుకింగ్స్ నమోదయ్యాయి మరియు ఒక్క రోజులోనే 1,000 కార్లను డెలివరీ కూడా ఇచ్చాము. హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఎంచుకున్న కస్టమర్లకు మంచి సంతృప్తినిచ్చి, హ్యుందాయ్ ఇండియా సక్సెస్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని", హ్యుందాయ్ ఇండియా సేల్స్ విభాగాధిపతి వికాస్ జైన్ ధీమా వ్యక్తం చేశారు.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

రోజురోజుకూ హ్యుందాయ్ వెన్యూ మీద బుకింగ్స్ పెరగడంతో అనతి కాలంలోనే కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తానేంటో నిరూపించుకుంది. హ్యుందాయ్ వెన్యూ మోడల్‌ను కంపెనీకి చెందిన కె1 ఫ్లాట్‌ఫామ్ అడ్వాన్స్‌డ్ వెర్షన్ మీద అభివృద్ది చేశారు. E, S, SX, SX+ మరియు SX (O) అనే ఐదు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

హ్యుందాయ్ ఫ్రంట్ డిజైన్‌లో సరికొత్త సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, వేర్వేరుగా వచ్చిన హెడ్ ల్యాంప్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. 17-అంగుళాల మెషీన్ కట్ అల్లాయ్ వీల్స్ అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా వచ్చాయి. 7 సింగల్ టోన్ కలర్ మరియు 3 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో హ్యుందాయ్ వెన్యూ లభిస్తోంది.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

హ్యుందాయ్ వెన్యూ భారతదేశపు మొట్టమొదటి కనెక్టెడ్ కార్. ఇందులో ఎస్ఒఎస్ అలర్ట్, భారతీయ భాషలను గుర్తించే వాయిస్ అసిస్ట్ సిస్టమ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కారుకు వారంటీ ఉన్నంత కాలం ఉచిత డేటా అందించే ఐడియా-వొడాఫోన్ భాగస్వామ్యంపు హ్యుందాయ్ ఇ-సిమ్ ఇందులో అందివ్వడం జరిగింది.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి సన్‌రూఫ్, వైర్-లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్, 8.4-అంగుళాల పరిమాణంలో ఉన్న హెచ్‌డీ డిస్ల్పే స్క్రీన్ మరియు అర్కామిస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లు వచ్చాయి.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 83పిఎస్ పవర్ మరియు 115ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంతే కాకుండా 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభ్యమవుతోంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 120పిఎస్ పవర్ మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీని 1.4-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో కూడా ఎంచుకోవచ్చు. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 90పిఎస్ పవర్ మరియు 220ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కేవలం E మరియు S వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది. 1.4-లీటర్ డీజల్ ఇంజన్ అన్ని వేరియంట్లలో లభిస్తోంది.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

పలు రకాల ఇంజన్ మరియు గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో పాటు, ఎంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని హ్యుందాయ్ వెన్యూలో అందించారు. వీటితో పాట ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ పలురకాల సేఫ్టీ ఫీచర్లను కూడా అందించారు. అందులో 6-ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, పార్కింగ్ సెన్సార్లు గల రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.

నమ్మశక్యంగాని సేల్స్‌తో హ్యుందాయ్‌కి చుక్కలు చూపిస్తున్న వెన్యూ ఎస్‌యూవీ

వెన్యూ మోడల్ విడుదలతో భారతదేశపు అతి ఎస్‌యూవీ వాహన తయారీ సంస్థగా ఎదిగేందుకు గురిపెట్టింది. నెల రోజుల వ్యవధిలోనే 10 వేల యూనిట్ల క్రెటా మరియు 10 వేల యూనిట్ల వెన్యూ మోడళ్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హ్యుందాయ్ క్రెటా ఇప్పటికే నెలవారీ సేల్స్ లక్ష్యాన్ని అందుకుంటోంది. వెన్యూ కూడా అత్యుత్తమ సేల్స్ సాధించి హ్యుందాయ్ భారతదేశపు నెం.1 ఎస్‌యూవీ తయారీ సంస్థగా నిలవనుంది.

Most Read Articles

English summary
Venue bookings cross 33000 units, 1000 units in one day. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X