ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

భారత దేశంలో పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కఠినంగా వుంది. దీని వలన ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది, రోజురోజుకు అనేక సంస్థల నుంచి వివిధ మోడల్లు, వివిధ టెక్నాలజీ తో వస్తున్నాయి. ఇవి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలి. ఇందులో భాగంగా ప్రభుతం ఇచ్చిన గడువెంటో చూద్దాం రండి.

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభించేందుకు ఆటోమొబైల్ తయారీదారులు ఒక ప్రణాళికతో వచ్చేందుకు రెండు వారాలు సమయం ఇచ్చారు. కేవలం కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాహన తయారీదారులకు గడువును ప్రకటించింది.

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

ప్రభుత్వం ప్రకారం, అన్ని త్రీ వీలర్స్ ఏప్రిల్ 2023 నుండి ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలి, అలాగే 150సిసి కంటే తక్కువ ఉన్న అన్ని ద్విచక్రవాహనాలు ఏప్రిల్ 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలి. ఈ నిబంధనకు సంబంధించి అనేక ఆటోమోటివ్ తయారీదారులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు, వారి ఆందోళనలు ఒక మేరకు నిజమయ్యాయి.

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో అతి పెద్దది మరియు ప్రపంచంలో అతి పెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్గా ఉంది. ఇంత పెద్ద మార్కెట్ తో తయారైన ఇంధన వాహనాలతో, లక్షల మంది ఆటోమోటివ్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద గనులలో ఈ ఆటో పరిశ్రమ కూడా ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ చాలా తక్కువగా ఉన్న పరిస్థితిలో, భారత ప్రభుత్వం విద్యుత్తు వాహనాలకు మారడానికి ఒక ఆదేశం ఇస్తే, మొత్తం పరిశ్రమ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే పలు కంపెనీలు తమ ఆందోళనను వ్యక్తం చేశాయి.

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

ఈ మధ్య కాలంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆటోమోటివ్ తయారీదారులందరికీ కూడా విద్యుదీకరణ వాహనాల గురించి ఎలా వెళ్తామని ఒక ప్రణాళిక లేదా రోడ్ మ్యాప్ తో రావాలని కోరింది. దీని వలన ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుందని చెప్పవచ్చు.

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

కొద్దిమంది తయారీదారులు ఒక ప్రణాళికపై గడువు ఆరు నెలలు కోరారు, కానీ ప్రభుత్వం వారి విద్యుదీకరణ ప్రణాళికల గురించి మొండిగా ఉందని తెలుస్తోంది. 2025 కల్లా ఎలక్ట్రిక్ టూ వీలర్స్, 2030 కల్లా ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్, 2023 కల్లా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ లక్ష్యాన్ని ప్రతి కంపెనీ ఎలా సాధిస్తుందో ప్రభుత్వం ఒక ప్రణాలికను కోరుతోంది.

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

దీనిపై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం

విద్యుత్ వాహనాల తయారీ ప్రణాళిక తయారు చేసే పని అంత సులభం కాదు. ఆటోమోటివ్ తయారీదారులు ప్రస్తుతానికి ఎలాంటి ఈవిలపై మౌలిక సదుపాయాలు లేవని, మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్స్ ఏవీ లేవని భావించాల్సి ఉంటుంది. ఇది కాకుండా, ప్రజలకు ఆందోళన కలగని విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన కారకం ఉంది.

ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?

ఇదంతా చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి తయారీదారులు ఆరు నెలల సమయం అడిగారు. అయితే ప్రభుత్వం దాన్ని నిరాకరించి కేవలం 14 రోజుల వ్యవధి ఇచ్చింది. ఈ క్షణంలో, ఇది ఎలా మలుపు తిరుగబోతోంది నిజంగా మేము ఖచ్చితంగా చెప్పలేము. రాబోవు కాలంలో ఇంకా ఎటువంటి మార్పులొస్తాయో చూడాలి.

More from DriveSpark

Article Published On: Tuesday, June 25, 2019, 10:45 [IST]
English summary
Automobile manufacturers have been given two weeks to come up with a roadmap to enable the sales of electric vehicles. Read in Telugu..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+