ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

ఇసుజు మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న పలు కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. వి-క్రాస్ బేస్ వేరియంట్ మరియు ఎంయు-ఎక్స్ మోడల్‌లోని అన్ని వేరియంట్లతో పాటు కమర్షియల్ వాహనాలైన డి-మ్యాక్స్ మరియు ఎస్-క్యాబ్ వేరియంట్ల మీద ఈ ఆఫర్లు వర్తిస్తాయని ప్రకటించారు మరియు ఈ ఆఫర్లు ఆక్టోబర్ 31, 2019 వరకు మాత్రమే వర్తిస్తాయి.

ఏయే మోడల్ మీద ఎంత మేరకు డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దాం రండి...

ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

వివిధ రకాల మోడళ్లు మరియు ఆయా వేరియంట్ల మీద రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. నిజానికి సేల్స్ తక్కువగా ఉన్నప్పుడే కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. ఆఫర్లు ప్రకటించినట్లు ఇసుజు స్పష్టం చేసినా.. డీలర్లు మాత్రం ఆఫర్లకు సంభందించి ఇసుజు సంస్థ నుండి ఎలాంటి సమాచారం రాలేదంటున్నారు.

ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

ఇసుజు ప్రకటించిన డిస్కౌంట్లతో పాటు పలు అదనపు ప్రయోజనాలను కూడా ఆఫర్ చేయాలని డీలర్లు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇసుజు ఇండియా లైనప్‌లో ఉన్న డి-మ్యాక్స్ వి-క్రాస్ లైఫ్‌స్టైల్ పికప్-ట్రక్ బేస్ వేరియంట్ నుండి ఇసుజు లగ్జరీ ఎస్‌యూవీ అయిన ఎంయు-ఎక్స్ ధరల శ్రేణి రూ. 16.54 లక్షల నుండి రూ. 27.35 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. డిస్కౌంట్లు అమలు చేయకముందు ధరలు ఇలా ఉన్నాయి.

ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

ఇసుజు ప్రతినిధి మాట్లాడుతూ, ప్రతి ఏటా ప్రారంభమయ్యే పండుగ సీజన్‌ను సందర్భంగా ఈ యేడు కూడా కస్టమర్లు పండుగ వాతావరణంలో కొత్త వాహనాలు మరియు వస్తువుల కొనుగోలుకు ఇష్టపడతారు. వారికోసం ప్రత్యేకించి ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లు ప్రకటించినట్లు అదే విధంగా ఆక్టోబర్ 31, 2019 ఈ ఆఫర్లు వర్తిస్తాయని వివరించారు.

ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

ఇసుజు మోటార్స్ ఇటీవల వి-క్రాస్ డి-మ్యాక్స్ పికప్-ట్రక్కుని జడ్ ప్రెస్టీజ్ అనే వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రిలీజ్ చేసింది. జడ్-ప్రెస్టీజ్ ఆటోమేటిక్ ధర రూ. 19.99 లక్షలు ఉండగా.. ఇదే ట్రక్కులోని హై జడ్ అనే మిడ్ వేరియంట్ ధర రూ. 17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉన్నాయి.

ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

సాంకేతికంగా ఇసుజు వి-క్రాస్ జడ్ ప్రెస్టీజ్ వేరియంట్లో 1.9-లీటర్ కెపాసిటీ గల టుర్భో-డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 148బిహెచ్‍పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

ఇసుజు డి-మ్యాక్స్ వి-క్రాస్ ఎస్‌యూవీలోని బేస్ మరియు మిడ్ వేరియంట్లలో 134బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.5-లీటర్ పవర్‌ఫుల్ డీజల్ ఇంజన్ ఉంది. రెండు వేరియంట్లలో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. ఇసుజు విక్రయిస్తున్న అన్ని వేరియంట్లలో "షిఫ్ట్-ఆన్-ద-ఫ్లై" అనే ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ఉంది.

ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

ప్రస్తుతం ఇసుజు ఇండియా విక్రయిస్తున్న అన్ని మోడళ్లలో బిఎస్-4 ఇంజన్ ఉంది. భారత ప్రభుత్వం విధించిన ఏప్రిల్ 2020 గడువులోగా అన్ని ఇంజన్‌లలో బిఎస్-6 ఇంజన్ అందించే విషయమై ఇసుజు ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఆఫర్లే ఆఫర్లు.. ఇసుజు కార్లపై రూ.2 లక్షలు తగ్గింపు

ఆటోమొబైల్ పరిశ్రమ నెమ్మదిగా ఉన్నపుడు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు కంపెనీలకు మంచి సేల్స్ సాధించిపెడతాయి. అదే విధంగా కస్టమర్లు కూడా సాధారణ రోజులతో పోల్చుకుంటే ఆఫర్లు ఉన్న రోజుల్లో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇసుజు అత్యంత శక్తివంతమైన వాహనాలను అత్యుత్తమ విశ్వాసంతో అందిస్తోంది. తమ పాపులర్ మోడళ్లు మరియు వేరియంట్ల మీద 50 వేల నుండి 2 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. మరిన్ని వివరాలకు మీకు సమీపంలోని ఇసుజు అధీకృత డీలర్‌ను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 25, 2019, 10:43 [IST]
English summary
Isuzu Discount Offers: D-Max V-Cross & MU-X Offered With Discounts Of Upto 2 Lakh. Read in Telugu.
Read more on: #ఇసుజు #isuzu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+