కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

కియా మోటార్స్ సెల్టోస్ ఎస్‌యూవీతో ఆగష్టు 2019లో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. కొరియన్ దిగ్గజం కియా ఇప్పుడు భారతదేశపు ఐదవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా నిలిచింది. తొలి రెండు నెలల్లోనే ఇండియన్ మార్కెట్లో ఉన్న ఐదు దిగ్గజ కార్ల కంపెనీలను వెనక్కి నెట్టేసింది.

కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

మొత్తం మార్కెట్ వాటాలో 4.5 శాతం వాటా సొంతం చేసుకుంది. దీంతో మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా మరియు టాటా మోటార్స్ సరసన కియా మోటార్స్ ఐదవ స్థానంలో నిలిచింది. కేవలం అక్టోబర్ 2019 నెలలో మాత్రమే 12,850 సెల్టోస్ ఎస్‌యూవీలను విక్రయించారు.

కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది
Rank Brand అక్టోబర్-19 అక్టోబర్-18 మార్కెట్ వాటా (%)

1 మారుతి 1,39,121 1,35,948 48.90
2 హ్యుందాయ్ 50,010 52,001 17.58
3 మహీంద్రా 18,460 24,066 6.49
4 టాటా 13,169 18,290 4.63
5 కియా 12,850 0 4.52
6 టయోటా 11,866 12,606 4.17
7 రెనో 11,500 7,066 4.04
8 హోండా 10,010 14,187 3.52
9 ఫోర్డ్ 7,017 9,044 2.47
10 ఎంజీ మోటార్స్ 3,536 0 1.24
కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

ఇండియన్ ప్యాసింజర్ మార్కెట్లో ఎంతో కాలంగా ఉన్నటువంటి టయోటా, రెనో, హోండా మరియు వోక్స్‌వ్యాగన్ వంటి దిగ్గజ కంపెనీలను సేల్స్ పరంగా వెనక్కి నెట్టేసింది. గత ఆరు నెలల కాలంగా ఆటోమొబైల్ పరిశ్రమలో మాద్యం నెలకొన్న తరుణంలో చాలా వరకు కంపెనీలు ఆశించిన సేల్స్ సాధించలేక డీలా పడ్డాయి. కానీ, కియా ప్రతి నెలా సేల్స్ పెంచుకుంటూ మెరుగైన ఫలితాలు సాధించింది.

కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

గత నెలలో ఏకంగా 12,850 యూనిట్ల కియా సెల్టోస్ ఎస్‌యూవీలను విక్రయించి 65.72శాం వృద్దిని నమోదు చేసుకుంది. ఇదే తరహా విక్రయాలు జరిపితే.. మరికొన్ని నెలల్లో టాటా మోటార్స్‌ను కూడా దాటిపోతుంది. టాటా మోటార్స్ ప్రస్తుతం 4.60% మార్కెట్ వాటాతో నాలుగవ స్థానంలో నిలిచింది, కియా కంటే కేవలం 0.10 శాతం మాత్రమే ఎక్కువ.

కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న తమ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. కియా సెల్టోస్ మీద పెరుగుతున్న డిమాండుకు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో కొత్త మోడళ్లను ప్రవేశపెడితే వాటి ఉత్పత్తికి కూడా ఈ కొత్త ప్రొడక్షన్ లైన్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

కొరియన్ దిగ్గజం కియా మోటార్స్ తమ రెండవ ఉత్పత్తిగా కార్నివాల్ ఎంపీవీని తీసుకొస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. 2020 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో కియా తమ కార్నివాల్ ఎంపీవీని అధికారికంగా లాంచ్ చేయనుంది.

కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇండియన్ మార్కెట్లోకి ఒక కొత్త మోడల్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది. ఈ ప్రణాళికలో భాగంగానే తొలుత సెల్టోస్ ఆ తర్వాత కార్నివాల్ ఎంపీవీలను ఇండియన్ మార్కెట్ కోసం ప్లాన్ చేసింది.

కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

కియా మోటార్స్‌తో పాటు చైనా సొంతం చేసుకున్న బ్రిటన్ కంపెనీ ఎంజీ మోటార్స్ టాప్-10 ప్యాసింజర్ కార్ల జాబితాలో చోటు దక్కించుకుంది. 1.2% వాటాతో భారతదేశపు పదవ బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా ఎంజీ మోటార్స్ నిలిచింది. ఎంజీ కూడా ప్రస్తుతం ఒక్క మోడల్ హెక్టర్ ఎస్‌యూవీని మాత్రమే విక్రయిస్తోంది.

కియా మరో సంచలనం: ఒక్క దెబ్బతో ఐదు కంపెనీలను వెనక్కి నెట్టేసింది

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆటోమొబైల్ పరిశ్రమలో నమ్మకం అన్నింటి కన్నా ముఖ్యమైన అంశం. కియా మోటార్స్ అదే నమ్మకాన్ని సొంతం చేసుకుంది. అద్వితీయమైన మోడల్ సెల్టోస్ ఎస్‌యూవీతో ఇండియన్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంది. తొలి రెండు మూడు నెలల్లోనే నమ్మశక్యంగానీ ఫలితాలు సాధించింది. కియా సెల్టోస్ ఎస్‌యూవీ కియా మోటార్స్‌ను భారతదేశపు టాప్-5 బెస్ట్ సెల్లింగ్ కార్ల కంపెనీగా నిలిపింది.

More from DriveSpark

Article Published On: Friday, November 8, 2019, 16:17 [IST]
English summary
Kia Motors Becomes The Fifth Largest Car Maker In India: Overtakes Toyota, Ford, Volkswagen & Others. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+