మారుతి బాలెనోపై రూ.1 లక్ష తగ్గింపు: ధర ఎంతంటే?
మారుతి సుజుకి తమ బాలెనో ఆర్ఎస్ కారు ధరను భారీగా తగ్గించింది. మునుపటి ధరలతో పోల్చుకుంటే ఏకంగా లక్ష రూపాయలు తగ్గి ఇప్పుడు రూ. 7.89 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లభ్యమవుతోంది.

పండుగ సీజన్‌లో బాలెనో మోడల్ ద్వారా సేల్స్ పెంచుకోవాలనే నెపంతోనే ఈ మోడల్‌పై ఏకంగా లక్ష రూపాయల ధర తగ్గించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అతి త్వరలో బిఎస్-6 నియమాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో బిఎస్-4 మోడళ్ల స్టాక్ క్లియర్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి తొలుత బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును తీసుకొచ్చింది. దీనికి కొనసాగింపు పవర్ వెర్షన్ మోడల్‌ను విభిన్నమైన ఇంజన్‌తో బాలెనో ఆర్ఎస్ కారును తీసుకొచ్చింది. రెగ్యులర్ బాలెనోతో పోల్చితే ఆర్ఎస్ వెర్షన్ అత్యంత శక్తివంతమైనది మరియు ధర కూడా కాస్త ఎక్కువే.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్ కారులో సాంకేతికంగా 1.0-లీటర్ బూస్టర్‌జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 102బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి బాలెనో ఆర్ఎస్ వెర్షన్‌లో లభించే 1.0-లీటర్ బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ బిఎస్-4 ప్రమాణాలను మాత్రమే పాటిస్తోంది. అయితే దీనిని బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తారా లేదా అనే విషయమై మారుతి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రత్యేకమైన ఇంజన్‌తో పాటు సాధారణ బాలెనో కంటే కాస్త డిఫరెంట్‌గా ఉండేందుకు స్టైలింగ్ మరియు ఫీచర్ల పరంగా పలు మార్పులు కూడా జరిగాయి. ముందు మరియు వెనుకవైపున ఆర్ఎస్ బ్యాడ్జింగ్ గల బంపర్లు, విభిన్న డిజైన్‌లో ఉన్న ఆల్లాయ్ వీల్స్ మరియు కేవలం ఆర్ఎస్ కోసం తీసుకొచ్చిన అరుదైన రెడ్ కలర్ పెయింట్ స్కీమ్ ఇందులోని ప్రత్యేకతలు

ఇంటీరియర్ విషయానికి వస్తే స్పోర్టివ్ మరియు లగ్జరీ ఫీల్ పొందుతాము. కానీ ఫీచర్ల విషయానికి వస్తే స్టాండర్డ్ బాలెనో టాప్ ఎండ్ వేరియంట్లో ఉండే అన్ని ఫీచర్లు ఇందులో యథావిధిగా వచ్చాయి.

బాలెనో ఆర్ఎస్ మీద మాత్రమే కాదు, మారుతి సుజుకి విక్రయిస్తున్న పలురకాల కార్ల మీద రూ. 5000 వరకు ధరలు తగ్గించింది. ఇండియన్ మార్కెట్లో కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించడంతో ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించింది.

మారుతి సుజుకి విక్రయిస్తున్న స్విఫ్ట్, బాలెనో, ఇగ్నిస్, విటారా బ్రిజా, డిజైర్, ఎస్-క్రాస్ మరియు టూర్ ఎస్ కార్ల మీద రూ. 5,000 వరకు ధరలు తగ్గించింది. ఈ ధరల తగ్గింపు కారు యొక్క ఎక్స్-షోరూమ్ ధరలోనే భాగమై ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ పండుగ సీజన్‌లో డీలర్లు పలు రకాల అదనపు ప్రయోజనాలు కూడా అందిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోనే మారుతి డీలర్‌ను సంప్రదించండి.


Click it and Unblock the Notifications








