దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఆక్టోబర్ 2019 సేల్స్ గణాంకాలను వెల్లడించింది. గత నెల సేల్స్‌తో పోల్చుకుంటే తాజాగా విడుదలైన ఫలితాలలో మారుతి సుజుకి గడిచిన అక్టోబర్ మాసంలో 4.5 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

సేల్స్ రిపోర్ట్స్ ప్రకారం, గడిచిన అక్టోబర్ 2019 నెలలో దేశవ్యాప్తంగా 1,53,000 కార్లను విక్రయించింది. వీటిలో 1.41 లక్షల కార్లను దేశీయ మార్కెట్లో విక్రయించగా మిగిలిన వాటిని విదేశీ మార్కెట్‌కు ఎగుమతి చేసింది.

దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి విక్రయిస్తున్న మొత్తం ఉత్పత్తుల్లో యుటిలిటి వెహికల్ (UV Segment) సెగ్మెంట్ అత్యధికంగా 11.3% శాతం వృద్దిని నమోదు చేసింది. ఈ సెగ్మెంట్లో విటారా బ్రిజా, ఎర్టిగా ఎంపీవీ, ఎక్స్ఎల్6 ప్రీమియం ఎంపీవీ మరియు ఎస్-క్రాస్ కార్లు ఉన్నాయి.

దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

మునుపటి నెల కంటే గత అక్టోబరులో అత్యధిక సేల్స్ నమోదవ్వడానికి పండుగ సీజన్ ప్రధాన కారణమని మారుతి సుజుకి వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా జరిగే దంతేరాస్ మరియు దేశవ్యాప్తంగా జరుపుకునే దీపావళి పర్వదినాల్లో సేల్స్ విపరీతంగా పెరిగాయి. సేల్స్ పెంచుకునేందుకు ప్రవేశపెట్టిన పలు ఆఫర్లు మరియు డిస్కౌంట్లు కూడా ఈ తరహా సేల్స్‌కు దోహదపడ్డాయి.

దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇటీవల ఇకో ఎంపీవీ లేటెస్ట్ వెర్షన్‌ను నూతన క్రాష్ టెస్ట్ ప్రమాణాలతో లాంచ్ చేసింది. అంతే కాకుండా గత నెలలో మారుతి ఎర్టిగా టూర్ డీజల్ వేరియంట్‌ను కూడా ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

కానీ గత నెలలో విడుదలైన మారుతి ఎస్-ప్రెస్సో స్మాల్‌ హ్యాచ్‌బ్యాక్ అన్నింటి కంటే అత్యంత ముఖ్యమైన మోడల్. విడుదలైన కేవలం రెండు నెలల్లోనే పది వేల యూనిట్లకు పైగా బుకింగ్స్ నమోదు చేసుకుని భారీ విజయాన్ని అందుకుంది.

దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

అంతే కాకుండా, మారుతి ఎస్-ప్రెస్సో స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి సుజుకి బ్రాండ్ యొక్క మొట్టమొదటి బిఎస్-6 కారు కావడం విశేషం. ఇందులో ఆల్టో కె10 నుండి సేకరించిన 1.0-లీటర్ ఇంజన్‌ను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలతో అందివ్వడం జరిగింది.

దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారులోని సరికొత్త 1.0-లీటర్ బిఎస్-6 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో కూడా లభ్యమవుతోంది.

దీపావళి సేల్స్ అదుర్స్: 1,53,000 కార్లు అమ్మేసిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2019 ఏడాది నుండి భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ నష్టాలు చవిచూస్తూనే ఉంది. ప్రతినెలా తగ్గుముఖం పడుతున్న మారుతి సుజుకి సేల్స్ అక్టోబర్ 2019 అమ్మకాలతో నష్టాలకు బ్రేక్ వేసి ఎట్టకేలకు సానుకూల ఫలితాలను నమోదు చేసుకుంది. దీంతో మారుతి కొత్త ఆశలతో రాబోయే కాలంలో ఇదే తరహా సేల్స్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, పండుగ సీజన్ కావడం వీటికి తోడు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకమైన ఆఫర్లు అందుబాటులో ఉండటంతో అత్యుత్తమ సేల్స్ నమోదు చేయగలిగారు.

Most Read Articles

English summary
Maruti Suzuki Sales Register A Growth During Festive Season: Clocks 1.53 Lakh Units Of Sales. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X