ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఇండియాలో అత్యధికంగా ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎర్టిగా ఎంపీవీని బిఎస్-6 పెట్రోల్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. ఎర్టిగా ఎంపివి లలో ఈ వెర్షన్ అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలవనుంది. అంతే కాకుండా, ఈ వేరియంట్‌ను కేవలం నెక్సా షోరూమ్‌ల ద్వారా మాత్రమే విక్రయించాలనే భావిస్తోంది. మారుతి ఎర్టిగా కొత్త వెర్షన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం రండి..

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి రాబోయే బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తన అన్ని మోడళ్లను నెమ్మదిగా అప్ డేట్ చేస్తోంది. భారత దేశంలో కొత్త కఠినమైన ఉద్గార నిబంధనలను దేశంలో 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనుంది.

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

దీని అమలుకు ముందు, మారుతి సుజుకి ఇప్పటికే ఆల్టో, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, బాలెనో మరియు డిజైర్ లతో సహా బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా పలు మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు భారత మార్కెట్లో బిఎస్-6 ఎర్టిగా ఎంపివి ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి "ఎర్టిగా (పెట్రోల్) ఇప్పుడు బిఎస్-6 అని పేర్కొంది. దీని వల్ల ఈ మోడల్ యొక్క అన్ని వేరియెంట్ ల ధరల పెంచుతున్నట్లు తెలియచేసింది. "మారుతి సుజుకి ఎర్టిగా బిఎస్-6 లో 1.5-లీటర్ కె15-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ను ఆఫర్ చేస్తోంది.

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఇది మారుతి సుజుకి వారి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా వస్తుంది. ఇందులోని ఇంజన్ 104 బిహెచ్పి మరియు 138 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని మరియు ఇందులో ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుందని చెప్పబడింది.

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

మారుతి ఎర్టిగా బిఎస్-6 మోడల్ ను రూ. 7.54 లక్షల ప్రారంభ ధరతో ఆఫర్ చేసి టాప్ ఎండ్ వేరియంట్ రూ.10.05 లక్షలకు చేరుకొంది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం ఉన్నాయి.

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఇంజన్ కు బిఎస్-6 అప్డేట్ కాకుండా, ఇండియన్ మార్కెట్లో ఉన్న పాపులర్ ఎంపివి కు మరే ఇతర మార్పులు చేయలేదు. మారుతి సుజుకి ఎర్టిగా బ్రాండ్ యొక్క అరేనా డీలర్ షిప్ ల ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది మరియు ఇది ఎంపివి సెగ్మెంట్లో బాగా ప్రదర్శన ఇస్తోంది.

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి ఇటీవలే ఎర్టిగా సిఎన్జి వేరియంట్ ను కూడా లాంచ్ చేసింది -దీని కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మారుతి ఎర్టిగా సిఎన్జి దేశీయంగా ఫ్యాక్టరీ-ఫిట్ అయిన సిఎన్జి టెక్నాలజీతో అందిస్తున్న మొదటి ఎంపివి మరియు ఇది రూ. 8.82 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉంది.

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

ఇండియన్ కార్ మేకర్ ఎర్టిగ ఆధారంగా ఎక్కువ ప్రీమియమ్ తో సిక్స్ సీటర్ ఎంపివి పై పనిచేస్తోంది. దీనిని ' ఎక్స్ఎల్6 ' అని పిలిచే కొత్త ప్రీమియం ఎంపివి, 2019 ఆగస్టు 21 వ తేదీ నుంచి దీని అమ్మకాలు జరగనున్నాయి, దీనిని ఈ బ్రాండ్ యొక్క నెక్స డీలర్ షిప్ ల ద్వారా ప్రత్యేకంగా విక్రయిస్తారు. ఈ కొత్త ప్రీమియం ఎంపివి, తరువాత బిఎస్-6 అప్డేట్ కూడా అందుకోబడుతుంది.

ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ ను విడుదల చేసిన మారుతి సుజుకి

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపివి ల్లో మారుతి సుజుకి ఎర్టిగా ఒకటి. ఈ ఎంపివి బ్రాండ్ మంచి సేల్స్ ని తీసుకొస్తుంది, ఇది ప్రస్తుతం మార్కెట్ లో తక్కువ అమ్మకాలను ఎదుర్కొంటోంది. మారుతి సుజుకి ఎర్టిగా బిఎస్-6 పెట్రోల్ వేరియంట్ పై మహీంద్రా మారాజో, టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు రానున్న రెనాల్ట్ ట్రైబర్ వంటి ప్రత్యర్థులు పోటీ పడుతున్నాయి. కొనసాగించనుంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Ertiga BS-VI Petrol Launched In India — Prices Start At Rs 7.54 Lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X