దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారు సేల్స్ పరంగా ఇండియన్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 2019 సంవత్సరం ప్రారంభం నుండే దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికీ మారుతి డిజైర్ కారుకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లోనే ఏకంగా లక్షా 20 వేల మారుతి డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

2019లో ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి డిజైర్ తొలి స్థానంలో నిలిచింది. 2019 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ నుండి నవంబర్ వరకు కేవలం 8 మాసాల్లో 1.2 లక్షల డిజైర్ కార్లను విక్రయించినట్లు మారుతి సుజుకి ప్రకటించింది.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

ప్రతి ఏటా భారీ విక్రయాలు నమోదు చేస్తున్న మారుతి డిజైర్ మోడల్‌ ఈ మధ్యనే 20 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని చేరుకుంది. ఒక్క 2018-19లోనే 2.5లక్షల కార్లు అమ్ముడుపోవడం గమనార్హం.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ మొత్తం విక్రయాల్లో మారుతి డిజైర్ మోడల్ 60 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. అంతే కాదండోయ్.. గత పదేళ్ల కాలంలో ప్రతి ఏటా భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ సెడాన్ కారుగా ప్రతి ఏటా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంటూ వచ్చింది.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

మారుతి డిజైర్ సేల్స్‌కు సంభందించి మారుతి వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. డిజైర్ మొత్తం విక్రయాల్లో 50 శాతానికి పైగా మొదటి సారి కారు కొంటున్న కస్టమర్లే అధికంగా ఉన్నట్లు మారుతి పేర్కొంది. ఫస్ట్ టైమ్ కారు కొంటున్న కస్టమర్లలో మారుతి డిజైర్‌కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

పాత డిజైన్ మోడల్‌తో పోలిస్తే కొత్త డిజైర్ యొక్క అత్యాధునిక బాడీ డిజైన్, స్టైలిష్ అల్లాయ్ వీల్స్, టర్న్ ఇండికేటర్స్ జోడింపుతో వచ్చిన ఆకర్షణీయమైన సైడ్ మిర్రర్లు వంటి ఎన్నో ఎక్ట్సీరియర్ స్టైలింగ్ ఎలిమెంట్స్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

ప్రయాణికుల సేఫ్టీ కోసం మారుతి సుజుకి ఈ డిజైర్ సెడాన్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్ మరియు ఐఎస్ఒ చైర్డ్ సీట్ మౌంట్స్ వంటి అతి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లను డిజైర్ లభించే అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందివ్వడం కూడా డిజైర్ సక్సెస్‌కు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

కొత్త తరం మారుతి డిజైర్ సెడాన్ కారు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

మారుతి డిజైర్‌లోని 1.3-లీటర్ డీజల్ ఇంజన్ 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు ఇంజన్ ఆప్షన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తున్నాయి.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

బాడీ స్టైల్ పరంగా మారుతి డిజైర్‌ను కాంపాక్ట్ సెడాన్ అంటారు. వెనుక భాగంలో పొడవాటి డిక్కీతో నాలుగు మీటర్ల పొడవులోపు ఉండే కార్లను కాంపాక్ట్ సెడాన్ అంటారు. మారుతి డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజ్ మరియు అతి త్వరలో విడుదల కానున్న టయోటా ఆరా వంటి మోడళ్లు కాంపాక్ట్ సెడాన్ కిందకు వస్తాయి.

దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్: 8 నెలల్లో లక్షా 20 వేల కార్లు రోడ్డెక్కాయి!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి డిజైర్ మోడల్ అత్యంత సరసమైన సెడాన్ కారు. స్టైల్, సేఫ్టీ, ఫీచర్లు, రీ-సేల్ వ్యాల్యూ, సులభమైన సర్వీసింగ్, దేశవ్యాప్తంగా ఉన్న మారుతి సుజుకి డీలర్ నెట్‌వర్క్ అన్నింటికీ మించి అత్యంత సరసమైన ధర వంటి అంశాల పరంగా మారుతి డిజైర్ భారీ సక్సెస్ అందుకుంది.

మారుతి డిజైర్ ధరల శ్రేణి రూ. 5.83 లక్షల నుండి రూ. 9.53 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

Most Read Articles

English summary
Maruti Suzuki Dzire Becomes Best Selling Car Of 2019: Sells Over 1.2 Lakh Units This Year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X