విపణిలోకి కొత్త మారుతి డిజైర్.. ధర & పూర్తి వివరాల కోసం

2019 జూలై 01 నుండి అమ్ముడయ్యే ప్రతి ప్యాసింజర్ కారు కూడా నూతన భద్రత ప్రమాణాలను పాటించాలి. ఈ క్రమంలో పలు కార్ల సంస్థలు తమ కార్లలో నూతన సేఫ్టీ ఫీచర్లను అప్‌గ్రేడ్‌ చేసి కొత్త ధరలను నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే నూతన భద్రతా ప్రమాణాలతో మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును లాంచ్ చేసింది. వేరియంట్ల వారీగా ధరలు కూడా పెంచింది.

విపణిలోకి కొత్త మారుతి డిజైర్.. ధర & పూర్తి వివరాల కోసం

మారుతి సుజుకి మాత్రమే కాదు, దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ అన్ని ప్యాసింజర్ వాహనాలలో సేఫ్టీ ఫీచర్లను అందించి, సుమారుగా రూ. 36,000 వరకు ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఇదే బాటలో మారుతి సుజుకి ప్రస్తుతం విక్రయిస్తున్న అన్ని కార్లలో తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఈ వారంలో స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్ మోడళ్లను అప్‌గ్రేడ్ చేసింది.

విపణిలోకి కొత్త మారుతి డిజైర్.. ధర & పూర్తి వివరాల కోసం

మారుతి సుజుకి నూతన భద్రత ఫీచర్లను అందివ్వడంతో పాటు 2020 నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ఇంజన్‌ను కూడా అందించి డిజైర్ కారును లాంచ్ చేసింది. మారుతి డిజైర్ బిఎస్-6 మోడల్ ధరల శ్రేణి రూ. 5.82 లక్షలతో మొదలుకొని రూ. 9.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి. అంటే మునుపటి ధరలతో పోల్చుకుంటే దాదాపు రూ. 15,000 వరకు పెరిగాయి.

విపణిలోకి కొత్త మారుతి డిజైర్.. ధర & పూర్తి వివరాల కోసం

సాంకేతికంగా మారుతి డిజైర్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. కానీ ప్రస్తుతం ఉన్న ఇవే ఇంజన్‌లు బిఎస్-4 ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఏప్రిల్ 01, 2020 నుండి వీటి స్థానంలో బిఎస్-6 ప్రమాణాలు పాటించే ఇంజన్‌లు తప్పనిసరి కావడంతో బిఎస్-6 మోడళ్లను ముందుగానే ప్రవేశపెడుతున్నారు.

విపణిలోకి కొత్త మారుతి డిజైర్.. ధర & పూర్తి వివరాల కోసం

ప్యాసింజర్ కార్లలో ప్రయాణాలు మరింత సురక్షితంగా ఉండటం మరియు వాహనాలు వెలువరించే కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఈ నూతన ప్రమాణాలను అమల్లోకి తీసుకొస్తోంది.

విపణిలోకి కొత్త మారుతి డిజైర్.. ధర & పూర్తి వివరాల కోసం

కార్ల తయారీ సంస్థలు విక్రయించే తమ అన్ని కార్లలోని అన్ని వేరియంట్లలో పలు కీలక సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసింది. అందులో, ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్స్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్.

విపణిలోకి కొత్త మారుతి డిజైర్.. ధర & పూర్తి వివరాల కోసం

అన్ని సంస్థలు పైన పేర్కొన్న భద్రతా ఫీచర్లను అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందివ్వాలి. అదనపు సేఫ్టీ ఫీచర్లను వేరియంట్ల వారీగా కల్పించనా పర్వాలేదు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ AIS-145 ప్రకారం ఈ నూతన భద్రతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, June 21, 2019, 16:43 [IST]
English summary
Maruti Suzuki India is in the process of upgrading safety features on their cars. Earlier this week, the company upgraded the Swift and the WagonR. They have revealed today, that the new Dzire is now AIS-145 compliant. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+