మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే!

మారుతి సుజుకి ఇటీవల విడుదల చేసిన మోడల్ ఎక్స్ఎల్6 (XL6) ఎంపీవీ. మారుతి ప్రీమియం విక్రయ కేంద్రాలయిన మారుతి నెక్సా షోరూముల్లో ఎక్స్ఎల్6 మోడల్‌ను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా మారుతి సుజుకి ఎక్స్ఎల్6 వెయిటింగ్ పీరియడ్‌కు సంభందించిన కీలకమైన సమాచారం బయటికొచ్చింది. మీరు మారుతి ఎక్స్ఎల్6 కొంటున్నారా..? అయితే ఈ స్టోరీ మీరు తప్పక చదవాల్సిందే..

మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే!

దేశవ్యాప్తంగా 20 ప్రధాన నగరాల్లో మారుతి ఎక్స్ఎల్6 బుకింగ్స్ మరియు వెయిటింగ్ పీరియడ్‌కు సంభందించిన వివరాలు డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ పాఠకుల కోసం సేకరించింది. ప్రస్తుతానికి ఢిల్లీ, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, చంఢీఘర్ మరియు నోయిడా నగరాల్లో ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు. బుక్ చేసుకున్న వెంటనే డెలివరీ ఇచ్చేస్తున్నారు.

మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే!

అయితే గురుగ్రామ్ మరియు పాట్నా, కోయంబత్తూర్ మరియు ఫరీదాబాద్, ఘజియాబాద్ నగరాల్లో మారుతి ఎక్స్ఎల్6 ఎంపీవీ కారు మీద రెండు వారాల నుండి 45 వరకు వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు తెలిసింది.

మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే!

థానే, కోల్‌కత్తా మరియు ముంబాయ్ నగరాల్లో మారుతి ఎక్స్ఎల్6 మీద రెండు నుండి నాలుగు వారాల మధ్య వెయిటింగ్ పీరియడ్ ఉంది. పూనే మరియు బెంగళూరులో ఉన్న కస్టమర్లకు సరిగ్గా నాలుగు వారాల వెయిటింగ్ పీరియడ్ అనంతరం డెలివరీ ఇస్తున్నారు.

మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే!

సూరత్‌లోని కస్టమర్లకు నాలుగు నుండి ఆరు వారాలు అదే విధంగా ఇండోర్ నగరంలో కస్టమర్లకు 6 వారాల అనంతరం డెలివరీ ఇస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంలో అయితే మారుతి ఎక్స్ఎల్6 ఆటోమేటిక్ వేరియంట్లను రెండు వారాల వెయిటింగ్ పీరియడ్ అనంతరం డెలివరీ ఇస్తున్నారు.

మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే!

మారుతి సుజుకి ప్రీమియం ఫీలింగ్ కోరుకునే (కాస్త లగ్జరీ ఫీల్) కస్టమర్ల కోసం రెగ్యులర్ ఎర్టిగా ఎంపీవీ కారును పలు మార్పులు చేర్పులతో సౌకర్యవంతమైన ఫీచర్లతో ఎక్స్ఎల్6 ఎంపీవీని లాంచ్ చేసింది. సాంకేతికంగా ఇందులో 1.5-లీటర్ కె15బి పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 103బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే!

మారుతి ఎక్స్ఎల్6 ఎంపీవీ కారు మెటాలిక్ ప్రీమియం సిల్వర్, మెటాలిక్ మ్యాగ్నమ్ గ్రే, పర్ల్ బ్రేవ్ ఖాకీ, ప్రీమియం ఆబర్న్ రెడ్, పర్ల్ ఆర్కిటిక్ వైట్ మరియు నెక్సాన్ బ్లూ అనే ఆరు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. మారుతి ఎక్స్ఎల్6 ప్రారంభ ధర రూ. 9.79 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11.46 లక్షలు ఎక్స్-షోరూమ్ ఇండియాగా ఉన్నాయి.

మారుతి XL6 కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే తప్పకుండా ఇది చదవాల్సిందే!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి ఎక్స్ఎల్6 విపణిలో ఉన్న ఎర్టిగా, మహీంద్రా మరాజొ మరియు రెనో లాజీ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. పలు కార్ల తయారీ కంపెనీలు సేల్స్ తగ్గిపోవడంతో తమ తయారీ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లకు ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ లేకుండా నిర్ణీత గడువులోగా డెలివరీ ఇచ్చేందుకు మారుతి ప్రయత్నిస్తోంది. ఒకవేళ డిమాండ్ పెరిగితే వెయిటింగ్ పీరియడ్ పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Waiting For Your XL6? It Could Take Up To Six Weeks! Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X