ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ కార్లకు ఓ ప్రత్యేకత ఉంది. స్టేటస్‌ను చూపించుకోవడంలో చాలా మంది మెర్సిడెస్ బెంజ్ కార్లను ఎంచుకుంటారు. దీంతో ఈ కార్లను అత్యంత ఖరీదైనవిగా భారతీయుల భావిస్తారు. కానీ మీకు తెలుసా... ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న టయోటా ఇన్నోవా ఫార్చ్యూనర్ కంటే తక్కువ ధరలో మెర్సిడెస్ బెంజ్ కొన్ని కార్లను విక్రయిస్తోంది. నమ్మశక్యంగా లేదు కదూ...? ఫార్చ్యూనర్ మాత్రమే కాదండోయ్.. ఫోర్డ్ ఎండీవర్ కంటే కూడా చీపెస్ట్ ధరలో బెంజ్ కార్లు మన ఇండియాలో లభిస్తున్నాయి.

టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు, వాటి ధరలు మరియు వాటి ప్రత్యేకతలేంటో చూద్దాం రండి...

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ హ్యాచ్‌బ్యాక్, పేరుకు తగ్గట్లుగానే ఇది ఇండియాలో లభించే అత్యంత సరసమైన జర్మన్ కారుగా పేరుగాంచింది. దేశీయంగా లభించే మిగతా హ్యాచ్‌బ్యాక్ కార్లతో పోల్చుకుంటే ఇది ఖరీదైనదే.. కానీ మెర్సిడెస్ బెంజ్ శ్రేణిలో ఇదే చీపెస్ట్ కారు. వాస్తంగా చెప్పాలంటే మెర్సిడెస్ బెంజ్‌ను సూచించే లోగో కారణంగానే ఇదీ కాస్ట్లీ అని చెప్పుకోవచ్చు.

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ 2017 మోడల్ ఏ-క్లాస్ కార్ల మీద ప్రస్తుతం రూ. 6.25 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో మెర్సిడెస్ ఏ-క్లాస్ ఎంట్రీ లెవల్ వేరియంట్ డిస్కౌంట్ పోను రూ. 27.86 లక్షలు నుండి టాప్ ఎండ్ వేరియంట్ రూ. 29.26 లక్షల ధరల శ్రేణిలో లభిస్తోంది. డిస్కౌంట్ కలుపుకున్న తర్వాత ఏ-క్లాస్ కారు ధరలు చూసుకుంటే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ఎండీవర్ కంటే తక్కువే. కానీ ఇక్కడ హ్యాచ్‌బ్యాక్ మరియు ఎస్‌యూవీ ఏది కావాలనేది తుది నిర్ణయం మీదే!

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

ఏ-క్లాస్ తర్వాత మెర్సిడెస్ లైనప్‌లో ఉన్న బీ-క్లాస్ సిరీస్ కార్లు ఓ మెట్టు పైనే ఉంటాయి. లగ్జరీ బ్రాండ్ మెర్సిడెస్ అందిస్తున్న 5-సీటర్ ఎంపీవీ మోడల్ ఈ మెర్సిడెస్ బి-క్లాస్ కారు. దీనికి మార్కెట్లో ఎలాంటి పోటీ లేదు.

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఎంపీవీ 2016 లేదా 2017 మోడళ్ల మీద గరిష్టంగా రూ. 6.25 లక్షల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. డిస్కౌంట్లు పోను ఎంట్రీ లెవల్ బి-క్లాస్ వేరియంట్ ధర రూ. 30.10 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 31.36 లక్షల ధరతో లభిస్తున్నాయి. అనగా.. ఫార్చ్యూనర్ మరియు ఎండీవర్ ఎస్‌యూవీల బేస్ వేరియంట్ కంటే మెర్సిడెస్ బి-క్లాస్ టాప్ ఎండ్ వేరియంట్ ధరలే తక్కువగా ఉన్నాయి.

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఏ

సరసమైన ధరలో అత్యంత ఆకర్షణీయంగా కనిపించే బెస్ట్ మోడల్ మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎ. మెర్సిడెస్ సీఎల్ఎస్ (CLS) మోడల్‌ నుండి తీసుకొచ్చి కూపే తరహా స్లోపింగ్ రూఫ్ లైన్ సీఎల్ (CLA) మోడల్‌లో హైలెట్‌గా నిలిచింది.

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

మెర్సిడెస్ బెంజ్ సీఎల్ఎ ఎస్‌యూవీ మీద అత్యధికంగా 10.25 లక్షల రూపాయల వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. 2018లో తయారైన మోడళ్ల మీద రూ. 4.25 లక్షలు, 2019లో తయారైన మోడళ్ల మీద రూ. 3.25 లక్షల క్యాష్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్లు పోను మెర్సిడెస్ బెంజ్ సీఎల్ బేస్ వేరియంట్ రూ. 31.72 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 36.99 లక్షలుగా ఉన్నాయి.

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

చీపెస్ట్ మెర్సిడెస్ బెంజ్ కార్ల జాబితాలో చివరి మోడల్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎ. ఇది జర్మన్ దిగ్గజం విక్రయిస్తున్న అత్యంత సరసమైన లగ్జరీ క్రాసోవర్ కారు. మెర్సిడెస్ జీఎల్ క్రాసోవర్ ఎస్‌యూవీ మోడల్ ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆడి క్యూ3 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మోడళ్లకు సరాసరి పోటీనిస్తుంది.

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

ఆడి, బిఎమ్‌డబ్ల్యూలోని ఉత్పత్తులతో పోటీ పడే ఈ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎ క్రాసోవర్ పాపులర్ టయోటా ఫార్చ్యూనర్ కంటే తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మోడల్ మీద ప్రస్తుతం రూ. 6.10 లక్షల వరకు డిస్కౌంట్ స్కీమ్ ఉంది. 2019 జీఎల్ఎ లోని స్పోర్ట్ ఎడిషన్ మీద రూ. 4.35 లక్షలు మరియు అర్భన్ ఎడిషన్ వేరియంట్ మీద రూ. 2.50 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ స్కీమ్స్ ఉన్నాయి. డిస్కౌంట్లు పోను మెర్సిడెస్ జీఎల్ఎ క్రాసోవర్ బేస్ వేరియంట్ రూ. 32.33 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ రూ. 38.64 లక్షల ధరల శ్రేణిలో ఉంది.

ఫార్చ్యూనర్, ఎండీవర్ కంటే తక్కువ ధరకే లభిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

పైన పేర్కొన్న డిస్కౌంట్లు మరియు ధరలు వివిధ షోరూములు మరియు డీలర్లకు అనుగుణంగా మారే అవకాశం ఉంది. ఫార్చ్యూనర్ మరియు ఎండీవర్ ఎస్‌యూవీలతో పోల్చుకుంటే పైన పేర్కొన్న కార్లు చూడటానికి చిన్నగానే ఉంటాయి. కానీ స్టేటస్, సమాజంలో హుందాతనం మరియు జర్మన్ కార్లను వాడుతున్నామనే ఫీలింగ్ కావాలనుకుంటే మెర్సిడెస్ కార్లను ఎంచుకోవచ్చు. ఇదే ధరలో అన్ని ఫీచర్లు ఉన్న భారీ ఎస్‌యూవీలు కావాలనుకుంటే ఫార్చ్యూనర్ వంటి మోడళ్లను ఎంచుకోవచ్చు.

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

Discount source

Most Read Articles

English summary
Mercedes Benz June discount on cars. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X