2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2020 జీఎల్‌సీ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. సరికొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 52.75 లక్షలు.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీ రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. జీఎల్‌సీ200 మరియు జీఎల్‌సీ 200డీ 4మ్యాటిక్ టాప్ వేరియంట్ ధర రూ. 57.75 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీ చూడటానికి అచ్చం మునుపటి మోడల్‌నే పోలి ఉంటుంది. కొత్త ఎస్‌యూవీలో అత్యాధునిక ఫ్రంట్ గ్రిల్, గ్రిల్‌కు ఇరువైపులా సమాతరంగా ఉన్న గ్రే కలర్ స్లాట్స్ మరియు మధ్యలో త్రీ-పాయింట్ మెర్సిడెస్ లోగో ఉన్నాయి.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

సరికొత్త మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీలో కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు మరియు రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ లైట్లు వచ్చాయి. ఫ్రంట్ మరియు రియర్ బంపర్లను కూడా కొద్ది మార్చారు. కొత్త జీఎల్‌సీ ఎస్‌యూవీలో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా వచ్చాయి.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌‌సీ ఫేస్‌లిఫ్ట్‌లో వచ్చిన కీలకమైన అప్‌గ్రేడ్‌లో MBUX టెక్నాలజీ ఒకటి. మెర్సిడెస్ బెంజ్ యూజర్ ఎక్స్పీరియెన్స్ (MUXB) టెక్నాలజీతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చిన మెర్సిడెస్ బెంజ్ మొట్టమొదటి కారు 2020 వెర్షన్ మెర్సిడెస్ జీఎల్‌సీ ఎస్‌యూవీ.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్మెంట్ డిస్ల్పేలతో యధావిధిగా ఈ టెక్నాలజీ వచ్చింది. స్టీరింగ్ వీల్ మీద టచ్ కంట్రోల్స్, వాయిస్ మరియు గెస్చర్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పానరమిక్ సన్‌రూఫ్, ఆంబియెంట్ లైటింగ్, మూడ్ లైటింగ్ ఇంకా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు వచ్చాయి.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే సరికొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీలో ఆరు (ముందు, పక్క వైపుల, మోకాలు మరియు కర్టన్) ఎయిర్ బ్యాగులు, డైనమిక్ బాడీ కంట్రోల్ మరియు అడ్జస్టబుల్ డ్యాంపర్స్ వంటివి అన్ని వేరియంట్లలో తప్పనిసరి ఫీచర్లుగా వచ్చాయి.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ తమ 2020 జీఎల్‌సీ ఎస్‌యూవీలో పలు రకాల డ్రైవింగ్ మోడ్స్ మరియు డ్రైవర్ అసిస్ట్ ఫీచర్లను కూడా అందించింది. ఆఫ్-రోడ్ ఇంజనీరింగ్ ప్యాకేజీ మరియు డ్రైవర్ అసిస్టెన్స్ అనే రెండు రకాల యాక్ససరీల ప్యాకేజీలను అందిస్తోంది. ఈ ప్యాకేజీల ద్వారా అదనపు ఫీచర్లు మరియు పరికరాలను పొందవచ్చు.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

ఇంజన్ విషయానికి వస్తే, 2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ ఎస్‌యూవీని రెండు రకాల ఇంజన్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. ఇందులో 255బిహెచ్‌పి పవర్ మరియు 370ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ ఒకటి.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

మరో ఇంజన్ ఆప్షన్, 2.0-లీటర్ డీజల్ యూనిట్. ఇది 192బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్‌లను స్టాండర్డ్ 9-స్పీడ్ జీ-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

2020 మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌సీ విడుదల: ధర రూ. 52.75 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ అంతర్జాతీయంగా ఆవిష్కరించిన MBUX టెక్నాలజీతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన తొలి మోడల్ 2020 మెర్సిడెస్ జీఎల్‌సీ ఎస్‌యూవీ. ఇది మార్కెట్లో ఉన్న బిఎమ్‌‌డబ్ల్యూ ఎక్స్3, వోల్వో ఎక్స్‌సీ60 మరియు ఆడి క్యూ3 ఎస్‌యూవీలకు పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
2020 Mercedes-Benz GLC Launched In India: Prices Start At Rs 52.75 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X