2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

2019 ఏడాది దాదాపు ముంగిపు దశకు వచ్చింది. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ నెమ్మదించినా.. మార్కెట్లోకి ఎన్నో కొత్త కార్లు విడుదలయ్యాయి. కియా మోటార్స్ మరియు ఎంజీ మోటార్ వంటి కొత్త కంపెనీలు కూడా ఈ ఏడాదే పరిచయమయ్యాయి.

కొన్ని కంపెనీలైతే నమ్మశక్యంగాని మోడళ్లు మార్కెట్లోకి వచ్చాయి. భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ ఎస్‌‌యూవీ హ్యుందాయ్ కోనా ఇవి కూడా ఈ ఏడాదే విపణిలోకి ప్రవేశించింది. వీటితో ఎన్నో కొత్త కార్లు ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. 2019లో విడుదలైన కొత్త కార్ల గురించి పాఠకుల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగు ప్రత్యేక కథనం..

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన కొత్త మోడల్ ఎస్-ప్రెస్సో. ఆల్టో హ్యాచ్‌బ్యాక్ కారుకు పైస్థానంలో ఎస్-ప్రెస్సో కారును ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌గా బడ్జెట్ ధరలో తీసుకొచ్చింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

చూడటానికి ఎస్‌యూవీ డిజైన్ సైలిలో ఉండే మారుతి ఎస్-ప్రెస్సో రెనో క్విడ్ కారుకు సరాసరి పోటీనిస్తుంది. అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ గల మారుతి ఎస్‌-ప్రెస్సోలో ఆల్టో నుండి సేకరించిన 1.0-లీటర్ బిఎస్-6 పెట్రోల్ ఇంజన్ అందించారు.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300

దేశీయ ఎస్‌‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా విపణిలోకి సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో, పలు రకాల కొత్త ఫీచర్లు మరియు అత్యాధునిక డిజైన్ శైలిలో తీసుకొచ్చింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటీవల బిఎస్-6 వెర్షన్ ఇంజన్‌తో అప్‌గ్రేడ్ కూడా చేసింది. విపణిలో ఉన్న మారుతి వితారా బ్రిజా, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఇకోస్పోర్ట్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి ఎస్‌యూవీలకు ధీటైన పోటీనిస్తోంది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

హ్యుందాయ్ వెన్యూ

హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ దేశీయ మార్కెట్లో ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ డిమాండును దృష్టిలో ఉంచుకుని సరికొత్త వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. అత్యంత సరసమైన ధరలో, విశాలమైన క్యాబిన్, ఫీచర్లతో వెన్యూ ఎస్‌యూవీని తీసుకొచ్చింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీ మూడు శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. విడుదలైన అనతి కాలంలోనే భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌‌యూవీగా కొన్ని నెలల పాటు తొలి స్థానంలో నిలిచింది. వెన్యూ మోడల్ మారుతి వితారా బ్రిజా మరియు టాటా నెక్సాన్ సేల్స్‌ను దెబ్బతీసింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

రెనో ట్రైబర్

ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చి, భారీ సక్సెస్ అందుకున్న మోడళ్లలో రెనో ట్రైబర్ ఒకటి. రెనో ట్రైబర్ సబ్-4 మీటర్లలోపు ఉన్న కాంపాక్ట్ ఎంపీవీ. ఫ్రెంచ్ దిగ్గజం రెనో తమ ట్రైబర్ ఎంపీవీని 6-సీటింగ్ కెపాసిటీతో అత్యంత సరసమైన ధరలో తీసుకొచ్చింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

రెనో ట్రైబర్ మోడల్ ప్రతి నెలా కంపెనీ యొక్క బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అంతే కాకుండా ఎంపీవీ సెగ్మెంట్లో ఉన్న టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు మారుతి సుజుకి ఎర్టిగా మోడళ్లకు సేల్స్ పరంగా ఊహించని పోటీనిచ్చింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఇండియన్ మార్కెట్లోకి కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త మోడల్. నియోస్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 మోడల్ యొక్క నెక్ట్స్ జనరేషన్ అని చెప్పవచ్చు. అయితే, గ్రాండ్ ఐ10 రెగ్యులర్ మోడల్ మరియు నియోస్ రెండూ మార్కెట్లో లభిస్తున్నాయి.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

హ్యుందాయ్ యొక్క నూతన డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌ను డిజైన్ చేశారు. మోడ్రన్, స్టైలిష్ మరియు స్టోర్టివ్ లుక్ దీని సొంతం. హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో ప్రీమియం కారును కోరుకునే కస్టమర్ల కోసం లగ్జరీ కార్లను తలపించే ఫీచర్లను ఇందులో అందించారు.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

టయోటా గ్లాంజా

ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి టయోటా ప్రవేశపెట్టిన తొలి మోడల్ టయోటా గ్లాంజా. మారుతి-టయోటా మధ్య కుదురిన భాగస్వామ్యపు ఒప్పందంలో భాగంగా మారుతి బాలెనో కారును గ్లాంజా పేరుతో రీ-బ్యాడ్జ్‌డ్ వెర్షన్‌లో టయోటా విడుదల చేసింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

టయోటా-మారుతి భాగస్వామ్యంలో వచ్చిన తొలి మోడల్ కూడా ఇదే. ప్రయోగాత్మకంగా గ్లాంజా కారును లాంచ్ చేసినప్పటికీ, మంచి సక్సెస్ అందుకుంది. అంతే కాకుండా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మోడల్‌ను వెనక్కి నెట్టేసింది. మారుతి బాలెనో తర్వాత ఇండియా యొక్క సెకండ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా టయోటా గ్లాంజా నిలిచింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

కియా సెల్టోస్

కొరియన్ దిగ్గజం కియా మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చిన ఫస్ట్ కార్ కియా సెల్టోస్. పవర్‌ఫుల్ ఇంజన్ ఆప్షన్స్, అత్యాధునిక ఫీచర్లు కియా సెల్టోస్ సొంతం. అత్యంత సరసమైన ధరలో స్టైలిష్ డిజైన్‌లో మార్కెట్లో తీవ్ర అలజడి సృష్టించింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

కియా సెల్టోస్ భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా తొలి స్థానంలో నిలిచింది. కియా మాతృ సంస్థ హ్యుందాయ్ తీసుకొచ్చిన క్రెటా ఎస్‌యూవీ గట్టి పోటీనిస్తోంది. ఆగష్టు 2019లో విడుదలైన కియా సెల్టోస్ ఎస్‌యూవీ అనతి కాలంలో అనూహ్యమైన స్పందన లభించింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

టాటా హ్యారియర్

టాటా మోటార్స్ "ఇంపాక్ట్ డిజైన్ 2.0" ఫిలాసఫీ ఆధారంగా తీసుకొచ్చిన తొలి మోడల్ టాటా హ్యారియర్ ఎస్‌యూవీ. 2019లో ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన హ్యారీయర్ ఎస్‌యూవీ టాటా మోటార్స్ ముఖచిత్రాన్నే మార్చేసింది. పాత చింతకాయ పచ్చడి అనే పేరును మూటగట్టుకున్న టాటా కొత్త మోడళ్లతో దేశీయ ప్యాసింజర్ మార్కెట్లో మళ్లీ ప్రాణం పోసుకుంది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

ల్యాండ్ రోవర్ డీ8 ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మించిన హ్యారియర్ ఎస్‌యూవీ చాలా అంశాల పరంగా ల్యాండ్ రోవర్ ఎస్‌యూవీల లక్షణాలను కలిగి ఉంది. ప్రస్తుతం టాటాలో ఉన్న హైఎండ్ మోడల్ కూడా ఇదే. మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న టాటా హ్యారీయర్ ఎన్నో విదేశీ మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

ఎంజీ హెక్టర్

ఎంజీ హెక్టర్ కూడా కియా సెల్టోస్‌ను పోలిన ఎస్‌యూవీనే, చైనా సొంతం చేసుకున్న బ్రిటన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మోరిస్ గ్యారేజెస్ మోటార్(MG Motor) 2019లోనే దేశీయంగా అధికారిక కార్యకలపాలు ప్రారంభించింది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

ఎంజీ మోటార్ ఇండియా యొక్క తొలి మోడల్ ఎంజీ హెక్టర్ ఇండియా యొక్క తొలి ఇంటర్నెట్ కారు. ఇందులో ఆశించిన సేల్స్ సాధించడంలో కాస్త విఫలమైనప్పటికీ, ఒక అలజడినైతే సృష్టించింది. ఎంజీ మోటార్ ఇండియా తమ రెండవ మోడల్‌గా 2020 జనవరిలో ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్దమైంది.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లోకి తమ మొట్టమొదటి ఫుల్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, కోనా ఇవి కారును లాంచ్ చేసింది. సింగల్ ఛార్జింగ్‌తో 452కిలోమీటర్లు నడిచే పవర్‌ఫుల్ మోటార్ ఇందులో ఉంది. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ దేశీయంగా అసలైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేస్ మొదలుపెట్టిన మోడల్.

2019లో విడుదలైన కొత్త కార్లు: ఏది సక్సెస్.. ఏది ఫెయిల్..?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం

పైన పేర్కొన్న కొత్త మోడళ్లతో పాటు, ఇది వరకే మార్కెట్లో లభించే కార్లను పలు మార్పులు చేర్పులతో ఆయా కార్ల కంపెనీలు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌‌లో లాంచ్ చేశాయి. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికీ కొత్త ఆశలతో పలు నూతన మోడళ్లను ప్రవేశపెట్టాయి. అందులో మారుతి ఎస్-ప్రెస్సో, రెనో ట్రైబర్, హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సెల్టోస్ వంటి మోడళ్లు భారీ విజయాన్ని అందుకున్నాయి.

2020 ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా "2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పో" జరగనుంది. దేశీయ మరియు అంతర్జాతీయ కంపెనీలు తమ ఫ్యూచర్ మోడళ్లను ఈ వాహన ప్రదర్శన వేదిక మీద ఆవిష్కరించనున్నాయి. కార్లు మరియు బైకులకు సంభందించిన తాజా అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగును ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
New Car Launches In 2019: Here Are The Best New Car Models Introduced In India This Year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X