లెక్సస్ నుండి లగ్జరీ ఎస్‌యూవీ విడుదల: ధర అక్షరాల కోటి రూపాయలు

కొరియాకు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల బ్రాండ్ లెక్సస్ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త 2020 మోడల్ ఆర్ఎక్స్450హెచ్ఎల్ (Lexus RX450hL) కారును విడుదల చేసింది. సరికొత్త లెక్సస్ ఆర్ఎక్స్450హెచ్ఎల్ లగ్జరీ ఎస్‌యూవీ ధర రూ. 99 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు నిర్ణయించారు. లెక్సస్ RX450hL మోడల్ మీద దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, అతి త్వరలో డెలివరీలు మొదలవ్వనున్నాయి.

లెక్సస్ నుండి లగ్జరీ ఎస్‌యూవీ విడుదల: ధర అక్షరాల కోటి రూపాయలు

లెక్సస్ ఇండియా ప్రస్తుతం విక్రయిస్తున్న RX450h మోడల్ యొక్క 7-సీటర్ వెర్షన్ లెక్సస్ RX450hL ఎస్‌యూవీ. పొడవాటి వీల్ బేస్, బిఎస్-6 ఇంజన్ మరియు అదనంగా మూడో వరుస సీటింగ్ కెపాసిటీతో ఖరీదైన 7-సీటర్ లగ్జరీ ఎస్‌యూవీగా మార్కెట్లోకి వచ్చింది.

లెక్సస్ నుండి లగ్జరీ ఎస్‌యూవీ విడుదల: ధర అక్షరాల కోటి రూపాయలు

సాంకేతికంగా లెక్సస్ RX450hL ఎస్‌యూవీలో 3.5-లీటర్ కెపాసిటీ గల వి6 పెట్రోల్ ఇంజన్ కలదు. బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఈ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం కూడా ఉంది. ఇంజన్ మరియు మోటార్ కలిపి 313బిహెచ్‌పి వరకు పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అత్యుత్తమ మైలేజ్ దీని సొంతం.

లెక్సస్ నుండి లగ్జరీ ఎస్‌యూవీ విడుదల: ధర అక్షరాల కోటి రూపాయలు

లెక్సస్ RX450hLలో వచ్చిన కీలక అప్‌డేట్ బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఇంజన్ మరియు ధృడమైన బాడీ మరియు మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్ కూడా అందివ్వడం జరిగింది. అదనంగా యాక్టివ్ కార్నరింగ్ అసిస్ట్, ఫ్రిక్షన్ కంట్రోల్ డివైజ్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ సస్పెన్షన్స్ మరియు 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి.

లెక్సస్ నుండి లగ్జరీ ఎస్‌యూవీ విడుదల: ధర అక్షరాల కోటి రూపాయలు

కారు కంఫర్ట్‌కు సంబంధించిన ఫీచర్ల విషయానికి వస్తే, లెక్సస్ RX450hL ఎస్‌‌యూవీలో 12.3-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మీకు గ్రాండ్ వెల్‌కం చెబుతుంది. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్యానరోమిక్ సన్‌రూఫ్, లెథర్ అప్‌హోల్‌స్ట్రే, హీటెడ్ మరియు కూల్డ్ ఫ్రంట్ సీట్లు అదే విధంగా రియర్ ప్యాసింజర్స్ కోసం ఫోల్డ్ అండ్ రిక్లైన్ ఫంక్షన్ గల సీట్లతో పాటు ఇంకా ఎన్నో సౌకర్యవంతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

లెక్సస్ నుండి లగ్జరీ ఎస్‌యూవీ విడుదల: ధర అక్షరాల కోటి రూపాయలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

లెక్సస్ RX450hL ఎస్‌యూవీ ఇది వరకే మార్కెట్లో లభించే RX450h 5-సీటర్ యొక్క 7-సీటర్ వెర్షన్. ఈ రెండింటి మధ్య ధరలో తేడా సుమారుగా రూ. 30 లక్షల వరకు ఉంది. ఇది విపణిలో ఉన్న ఆడి క్యూ7, వోల్వో ఎక్స్‌సి90, మెర్సిడెస్ బెండ్ జీఎల్ఇ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Saturday, October 5, 2019, 13:50 [IST]
English summary
New (2020) Lexus RX450hL Launched In India: Prices Start At Rs 99 Lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+