ఖరీదైన 6-సీటర్ కారును విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

మారుతి సుజుకి సరికొత్త ఖరీదైన లగ్జరీ వెర్షన్ ఎర్టిగా ఎంపీవీ కారును విపణిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సాధారణ ఎర్టిగా ఎంపీవీ కంటే కాస్త ఖరీదైన ప్రీమియం ఫీచర్లతో వస్తోన్న ప్రీమియం వెర్షన్ ఎర్టిగా ఎంపీవీ ఆగష్టు 21 న దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

ఖరీదైన 6-సీటర్ కారును విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

అతి త్వరలో విడుదల ఉన్న నేపథ్యంలో మారుతి సుజకి తమ ప్రీమియం ఎర్టిగా ఎంపీవీని రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తుండగా కెమెరా కంటికి పట్టుబడింది. కానీ ఈసారి డిజైన్ అంశాలన్నీ రివీల్ అయ్యాయి.

ఖరీదైన 6-సీటర్ కారును విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

సరికొత్త ప్రీమియం ఎర్టిగా ఎంపీవీని ఎక్స్ఎల్6 అనే పేరుతో పరిచయం చేస్తున్నట్లు రహస్యంగా లీకైన ఫోటోలను బట్టి తెలుస్తోంది. అంతే కాకుండా దీని మీద నెక్సా అనే స్టిక్కర్ ఉండటంతో.. మారుతి ప్రీమియం షోరూమ్‌లైన నెక్సా విక్రయ కేంద్రాల ద్వారా మాత్రమే దీనిని విక్రయించనున్నట్లు సమాచారం.

ఖరీదైన 6-సీటర్ కారును విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

రెగ్యులర్ ఎర్టిగా ఎంపీవీతో పోల్చితే ప్రీమయం ఎర్టిగా కారును గుర్తించడానికి ఎక్ట్సీరియర్ డిజైన్‌లో పలు మార్పులు జరిగాయి. వాస్తవానికి ఎర్టిగా ఫ్లాట్‌ఫామ్ మీదనే నిర్మించినప్పటికీ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ పరంగా రెండింటి మధ్య గుర్తించదగిన మార్పులు చేశారు.

ఖరీదైన 6-సీటర్ కారును విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

ఎక్ట్సీరియర్ డిజైన్‌లో కండలు తిరిగిన శరీరాకృతి, ప్రీమియం మరియు స్పోర్టివ్ ఫీల్ కలిగించే అదనపు డిజైన్ ఎలిమెంట్లు, అల్లాయ్ వీల్స్, ప్లాస్టిక్ వీల్ క్లాడింగ్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంటీరియర్‌లో పొడవాటి సీట్లు కాకుండా.. ఒక్కో ప్యాసింజర్‌కు ఒక్కో సీటును కేటాయించారు(కెప్టెన్ సీట్లు).

ఖరీదైన 6-సీటర్ కారును విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

సాంకేతికంగా మారుతి సుజుకి ఎర్టిగా ప్రీమియం ఎంపీవీ మారుతి వారి SHVS మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ గల అదే మునుపటి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 105బిహెచ్‌పి పవర్ మరియు 138ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఖరీదైన 6-సీటర్ కారును విడుదలకు సిద్దం చేసిన మారుతి సుజుకి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి బిఎస్-6 ఇంజన్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్న మొట్టమొదటి కారు ఇదే. ఆరు మంది ప్రయాణించేందుకు వీలుగా కాస్త ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్లలో బడ్జెట్ కారును కారుకునే కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఎర్టిగా ప్రీమియం వెర్షన్ ఎక్స్ఎల్6 కారును డెవలప్ చేసింది. ఆగష్టు 21 న ఇది లభించే వేరియంట్లు మరియు వాటి ధరలను వెల్లడించనునుంది. మరింత తాజా సమాచారం కోసం డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 24, 2019, 12:03 [IST]
English summary
New Maruti Suzuki Premium Six-Seater MPV Spied — To Be Called The ‘XL6’. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+