6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

స్కోడా కంపెనీ రానున్న రెండేళ్లలో ఇండియన్ మార్కెట్లోకి కొత్త కార్లను విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది. ఈ విషయాన్ని స్కోడా ఆటో ఇండియా సేల్స్, సర్వీస్ మరియు మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్వయంగా వెల్లడించారు.

6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

స్కోడా డైరక్టర్ చేసిన తాజా ట్వీట్‌లో వచ్చే రెండేళ్లలోపు ఆరు కార్లను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఉన్న కార్ల అప్‌డేటెడ్ వెర్షన్స్ మరియు పలు కొత్త కార్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వీటిలో కొన్నింటిని 2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించే అవకాశం ఉంది.

6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

స్కోడా చీఫ్ ఎక్జ్సిక్యూటివ్ బెర్నార్డ్, వారం క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో వచ్చే ఏడాది మధ్య బాగానికల్లా మిడ్-సైజ్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని స్పష్టం చేశాడు. ఈ మోడల్‌ను కూడా ఫిబ్రవరి 2020లో జరిగే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించే అవకాశం ఉంది.

6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, స్కోడాకు చెందిన ఇండియా 2.0 ప్రాజెక్ట్ ఆధారంగా కంపెనీ యొక్క MQB AO IN ఫ్లాట్‌ఫామ్ మీదనే కొత్త ఎస్‌యూవీని నిర్మిస్తున్నట్లు తెలిసింది.

6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

ఈ కొత్త ఫ్లాట్‌ఫామ్ ఇప్పటికే ఉత్పత్తవుతున్న మోడళ్లలో 90 శాతం వరకు దేశీయంగా తయారైన విడి భాగాలను ఉపయోగిస్తున్నారు. స్కోడా మరియు వోక్స్‌వ్యాగన్ రెండు కంపెనీలు కూడా మిడ్-సైజ్ ఎస్‌యూవీల కోసం MQB AO IN ఫ్లాట్‌ఫామ్‌ను ఉమ్మడిగా ఉపయోగించుకుంటున్నాయి.

6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

స్కోడా ఇండియా కరోక్ ఎస్‌యూవీ మరియు న్యూ-జనరేషన్ స్కోడా ఆక్టావియా మోడళ్లను 2020లో మార్కెట్లోకి విడుదల చేయనుంది. అంతే కాకుండా, ఇప్పటికే మార్కెట్లో ఉన్న పలు మోడళ్లను ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన‌లో లాంచ్ చేయనున్నారు.

6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

స్కోడా ఆటో మరియు వోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చకన్‌లో ఉన్న ప్రొడక్షన్‌ ప్లాంటును డిసెంబర్ మధ్య భాగం నుండి జనవరి మధ్య భాగం వరకు మూసేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ ఏడాది అక్టోబరు మరియు నవంబర్ మధ్య కాలంలో కూడా చకన్ ప్లాంటును మూసేశారు.

6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

ప్రొడక్షన్ ప్లాంటులో కొత్త కార్లను ఉత్పత్తి చేసేందుకు అనుగుణంగా ఇప్పటికే ఉన్న ప్రొడక్షన్ లైన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు, ఇందులో భాగంగానే ప్లాంటును స్వల్ప కాలం పాటు మూసేస్తున్నట్లు ప్రకటించారు. కస్టమర్లకు కార్లను డెలివరీ ఇచ్చే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా పాక్షికంగానే ప్లాంటును మూసేస్తూ అభివృద్ది పనులు చేస్తున్నారు.

6 కొత్త కార్లు తీసుకొస్తున్న స్కోడా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్కోడా మరియు వోక్స్‌వ్యాగన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో మంచి పేరును గడించాయి. కానీ సేల్స్ విషయంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. అయితే స్కోడా తాజా నిర్ణయంతో కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా ఆరు కొత్త మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
New Skoda Cars In India: Brand Confirms Six New Product Launches Over The Next Two Years. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X