హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

సరికొత్త డిజైన్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన టాటా మోటార్స్ తమ అన్ని మోడళ్లను ఒక్కొక్కటిగా పలు మార్పులు చేర్పులతో అప్‌డేట్ చేస్తున్నట్లు సమాచారం.

మార్కెట్లో ఎదురవుతున్న పోటీని తట్టుకొని కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటికే మంచి సేల్స్ సాధిస్తున్న పాపులర్ మోడళ్లను ఫేస్‌లిఫ్ట్ రూపంలో లాంచే చేసేందుకు సిద్దమవుతోంది. అందులో ఒకటి టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

ఇండియన్ మార్కెట్లో లభించే సబ్-4 మీటర్ ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఎంతో కస్టమర్ల బెస్ట్ ఛాయిస్. 2017లో దేశీయ విపణిలోకి విడుదలైన నెక్సాన్ ఈ సెగ్మెంట్లో ఉన్న మోడళ్లకు విపరీతమైన పోటీనివ్వడమే కాకుండా టాటాలో ఫేమస్ బ్రాండుగా పేరు సంపాదించింది.

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

అయితే గత కొన్ని నెలలుగా మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడళ్ల ద్వారా నెక్సాన్ ఎస్‌యూవీకి పోటీదారుల సెగ పెరిగింది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు హ్యుందాయ్ వెన్యూ మోడళ్ల విడుదలతో టాటా నెక్సాన్ సేల్స్ కాస్త నెమ్మదించాయి.

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

పోటీదారులను ఎదుర్కునేందుకు గట్టి సమాధానంగా టాటా మోటార్స్ ఇప్పుడు తమ నెక్సాన్ ఎస్‌యూవీని పలు మార్పులు చేర్పులతో మరింత కొత్తగా అప్‌డేటెడ్ వెర్షన్‌లో లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నెక్సాన్ ఫేస్లిఫ్ట్ మోడల్‌ను పరీక్షిస్తోంది.

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా పరీక్షిస్తుండగా తీసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. డిజైన్ అంశాలను ఏ మాత్రం గుర్తించడానికి వీల్లేకుండా డెవలప్ చేశారు. దీనిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదికలో ఆవిష్కరించి, 2020 మధ్య కాలానికి పూర్తి స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేటెడ్ హెడ్ ల్యాంప్ క్లస్టర్, రీడిజైన్ చేసిన ఎయిర్ ఇంటేకర్ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్ల జోడింపు అత్యంత ఆకర్షణీయమైన రూపాన్ని చూడవచ్చు.

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ టాటా వారి అత్యాధునిక ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేస్తున్నారు. ఈ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా వచ్చిన మొదటి మోడల్ టాటా హ్యీరియర్. నెక్సాన్ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

కాస్మొటిక్ సొబగుల మార్పులతో పాటు సాంకేతికంగానూ ఎన్నో మార్పులు సంతరించుకుంటున్నాయి. సరికొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ అత్యంత కఠినమైన సేఫ్టీ పరీక్షలను ఎదుర్కోనున్నాయి మరియు 2020 అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చే పాదచారుల భద్రతకు సంబంధించి కొత్త కార్లలో తప్పనిసరిగా రానున్న సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో పరిచయం అవుతున్నాయి.

Most Read: కియా సెల్టోస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ : ఆంధ్ర రాష్ట్రంలో తయారైన తొలి కార్

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లను అందివ్వనుంది. ప్రధానంలో ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లు ఉంటాయి. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌తో ఎంచుకోవచ్చు.

Most Read: రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్

హ్యుందాయ్, మారుతీలను దెబ్బతీసేందుకు టాటా కొత్త ప్లాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అప్‌డేట్ వెర్షన్ నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే ఏడాదికల్లా ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది. దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు విక్రయిస్తున్న మోడళ్లలోకెల్లా టాటా నెక్సాన్ పాపులర్ మోడల్. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నెక్సాన్ ఎస్‌యూవీ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, హ్యుందాయ్ వెన్యూ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
New Tata Nexon Facelift Spied For The First Time Ahead Of Its Launch In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X