నిస్సాన్ పండుగ ఆఫర్లు.. ఈ మూడు కార్లపై భారీ డిస్కౌంట్లు

ప్రతి ఒక్కరికీ దీపావళి ఎంతో ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా భారతీయులు కొత్త వస్తువులను ఇంటికి తీసుకెళ్లడానికి ఇష్టపడతారు. అంతే కాదు ఎంతో కాలంగా కొనాలనుకుంటున్న వాటిని ఈ పండుగ సీజన్‌లోనే కొనాలనుకుంటున్నారు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎన్నో కంపెనీలు రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఏడాది కాలంలో నష్టపోయిన సేల్స్ ఈ ఒక్క పండుగ సీజన్‌తోనే సమం చేసేస్తాయి.

ఇప్పటికే ఎన్నో కార్ల కంపెనీ భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించాయి. జపాన్ దిగ్గజం నిస్సాన్ కూడా దేశీయంగా ఎంపికచేయబడిన కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్టంగా రూ. 94,000 వరకు నిస్సాన్ కార్ల డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఏయే మోడల్‌పై ఎలాంటి డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దాం రండి..

నిస్సాన్ పండుగ ఆఫర్లు.. ఈ మూడు కార్లపై భారీ డిస్కౌంట్లు

నిస్సాన్ మైక్రా

నిస్సాన్ మైక్రా కంపెనీ యొక్క స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్, విపణిలో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగో మరియు పలు ఇతర హ్యాచ్‍‌‌బ్యాక్ కార్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ పండుగ ఆఫర్లలో భాగంగా నిస్సాన్ మైక్రా మీద గరిష్టంగా రూ. 51,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

నిస్సాన్ పండుగ ఆఫర్లు.. ఈ మూడు కార్లపై భారీ డిస్కౌంట్లు

వివరంగా చూస్తే, క్యాష్ డిస్కౌంట్ రూపంలో రూ. 25,000, ఎక్స్‌ఛేంజ్ బోనస్ క్రింద రూ. 20,000 మరియు కార్పోరేట్ బోనస్ క్రింద రూ. 6,000 కలుపుకొని మొత్తం రూ. 51 వేల వరకు ప్రయోజనాలున్నాయి. నిస్సాన్ మైక్రా ఆక్టివ్ కారు మీద రూ. 41 వేల వరకు ప్రయోజనాలున్నాయి.

నిస్సాన్ పండుగ ఆఫర్లు.. ఈ మూడు కార్లపై భారీ డిస్కౌంట్లు

అత్యంత సరసమైన ధరలో విశాలమైన రియర్ స్పేస్‌తో లభిస్తున్న అతి పెద్ద సెడాన్ కారు నిస్సాన్ సన్నీ. దీని ధర రూ. 6.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. పండుగ ఆఫర్ల విషయానికి వస్తే నిస్సాన్ సన్నీ సెడాన్ మీద రూ. 94,000 విలువైన ప్రయోజనాలు ఉన్నాయి.

నిస్సాన్ పండుగ ఆఫర్లు.. ఈ మూడు కార్లపై భారీ డిస్కౌంట్లు

డిస్కౌంట్ స్కీమ్‌లో క్యా,ష్ డిస్కౌంట్ రూపంలో రూ. 50,000 లు, ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూపంలో రూ. 30,000 మరియు కార్పోరేట్ బోనస్ క్రింద మరో రూ. 14,000 కలుపుకొని మొత్తం94 వేల రూపాయల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో బెస్ట్ ప్రైజ్‌లో బెస్ట్ సెడాన్ ఎంచుకోవాలనుకునే వారికి నిస్సాన్ సన్నీ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

నిస్సాన్ పండుగ ఆఫర్లు.. ఈ మూడు కార్లపై భారీ డిస్కౌంట్లు

నిస్సాన్ ఇండియా తాజాగా తీసుకొచ్చిన మోడల్ నిస్సాన్ కిక్స్. ఈ ఏడాది మధ్య భాగంలో విపణిలోకి వచ్చిన నిస్సాన్ కిక్స్ కంపెనీకి భారీ సేల్స్ సాధించిపెడుతుందని భావించారు. కానీ ఇటీవల కొత్తగా విడుదలైన కియా సెల్టోస్ దెబ్బకు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

నిస్సాన్ పండుగ ఆఫర్లు.. ఈ మూడు కార్లపై భారీ డిస్కౌంట్లు

విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు రెనో డస్టర్ నుండి విపరీతమైన పోటీని ఎదుర్కుంటోంది. నిస్సాన్ కిక్స్ మీద లభించే పండుగ ఆఫర్ల విషయానికి వస్తే ఎలాంటి క్యాష్ బెనిఫిట్స్ లేవు. అయితే ఐదేళ్ల పాటు ఉచిత వారంటీ మరియు ప్రత్యేకమైన రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీలను పూర్తి ఉచితంగా అందిస్తోంది.

పండుగ ఆఫర్లకు సంబంధించి మరిన్ని వివరాలకు మీకు సమీపంలో నిస్సాన్ అధీకృత డీలర్‌ను సంప్రదించండి

More from DriveSpark

Article Published On: Saturday, October 19, 2019, 16:45 [IST]
English summary
Nissan cars with discounts up to Rs. 94,000 this month: Kicks, Micra & Sunny. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+