జీప్ కంపాస్ ‌ఎస్‌యూవీపై భారీగా ఆఫర్లు.. లక్షల్లో తగ్గింపు

జీప్ ఇండియా 2020 మోడళ్ల కోసం పాత స్టాకును తగ్గించేందుకు సంచలనాత్మక ఆఫర్లను ప్రవేశపెట్టింది. 2019 జీప్ కంపాస్ స్టాకును వీలైనంత త్వరగా క్లియర్ చేసేందుకు ఏకంగా రూ. 2 లక్షల రూపాయల వరకు తగ్గింపును ప్రకటించింది.

జీప్ కంపాస్ ‌ఎస్‌యూవీపై భారీగా ఆఫర్లు.. లక్షల్లో తగ్గింపు

జీప్ కంపాస్ ఎస్‌యూవీ టాప్ ఎండ్ వేరియంట్ కంపాస్ లిమిటెడ్ (O) పెట్రోల్-ఆటోమేటిక్ మీద అత్యధికంగా రూ. 2.10 లక్షల వరకు ధర తగ్గింపు ఉంది. అదే విధంగా ప్రారంభ వేరియంట్ కంపాస్ లాంగిట్యూడ్ (O) పెట్రోల్ ఆటోమేటిక్ మీద రూ. 1.30 లక్షల వరకు ధర తగ్గించారు.

జీప్ కంపాస్ ‌ఎస్‌యూవీపై భారీగా ఆఫర్లు.. లక్షల్లో తగ్గింపు

జీప్ కంపాస్ ఎస్‌యూవీలో హై ఎండ్ మోడల్ కంపాస్ ట్రయల్‌హాక్, మునుపెన్నడూ లేని విధంగా 35,000 రూపాయల వరకు ఎక్స్‌చ్ఛేంజ్ బోనస్ లభిస్తోంది. జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఇప్పుడు బిఎస్-6 వెర్షన్‌లో లభ్యమవుతోంది.

జీప్ కంపాస్ ‌ఎస్‌యూవీపై భారీగా ఆఫర్లు.. లక్షల్లో తగ్గింపు

కంపాస్ ఎస్‌యూవీ ప్రస్తుతం 1.4-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభిస్తోంది, ఈ రెండి బిఎస్-4 వెర్షన్ ఇంజన్‌లను 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డీజల్ వేరియంట్లను 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో ఎంచుకోవచ్చు.

జీప్ కంపాస్ ‌ఎస్‌యూవీపై భారీగా ఆఫర్లు.. లక్షల్లో తగ్గింపు

జీప్ ఇండియా కంపాస్ ఎస్‌యూవీని అతి త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో లాంచ్ చేయాలని భావిస్తోంది. 2020 ప్రారంభలోకెళ్లా మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఇంకా ఎన్నో కొత్త ఫీచర్లు వస్తున్నాయి.

జీప్ కంపాస్ ‌ఎస్‌యూవీపై భారీగా ఆఫర్లు.. లక్షల్లో తగ్గింపు

జీప్ కంపాస్ ధరల శ్రేణి రూ. 15.60 లక్షల నుండి రూ. 23.11 లక్షల మధ్య ఉంది, కంపాస్ ట్రయల్‌హాక్ రూ. 26.80 లక్షల నుండి రూ. 27.60 లక్షల ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

జీప్ కంపాస్ ‌ఎస్‌యూవీపై భారీగా ఆఫర్లు.. లక్షల్లో తగ్గింపు

మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోని ఎంజీ హెక్టార్, టాటా హ్యారీయర్, హ్యుందాయ్ టుసాన్, మహీంద్రా ఎక్స్‌‌యూవీ500 మరియు టాటా హెక్సా వంటి మోడళ్లకు జీప్ కంపాస్ సరాసరి పోటీనిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 17, 2019, 10:29 [IST]
English summary
Over Rs 2 lakh off on Jeep Compass in December 2019. Read in Telugu.
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+