రెనో కార్లపై భారీ ఆఫర్లు: ఏకంగా లక్ష రుపాయలు తగ్గింపు!

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఈ మధ్య కాలంలో భారీ నష్టాలను చవిచూసింది. చిన్న చిన్న కార్ల కంపెనీల నుండి మహామహ దిగ్గజాల వరకు దాదాపు అన్ని ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు తీవ్ర నష్టాలపాలయ్యాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు పలు కార్ల తయారీ సంస్థలు తమ అన్ని మోడళ్ల మీద ఎన్నో ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించి సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

రెనో కార్లపై భారీ ఆఫర్లు: ఏకంగా లక్ష రుపాయలు తగ్గింపు!

1. రెనో డస్టర్

రెనో ఇండియా తాజాగా డస్టర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రెనో డీలర్ల వద్ద లభిస్తోంది. డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ కంటే మునుపటి మోడల్ డీజల్ వేరియంట్ మీద ఏకంగా రూ. 1.05 లక్షలు మరియు పెట్రోల్ వేరియంట్ మీద రూ. 35,000 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు: ఏకంగా లక్ష రుపాయలు తగ్గింపు!

ప్రస్తుతం డిస్కౌంట్లు లభిస్తున్న డస్టర్1.5-లీటర్ డీజల్ మరియు పెట్రోల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. రెండు ఇంజన్ ఆప్షన్‌లను మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు.

రెనో కార్లపై భారీ ఆఫర్లు: ఏకంగా లక్ష రుపాయలు తగ్గింపు!

2. రెనో క్యాప్చర్

రెనో ఇండియా భారీ అంచనాలతో తీసుకొచ్చిన క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీ ఆశించిన ఫలితాలు కనబరచలేదు. ఇటీవల పలు కీలక అప్‌డేట్స్‌తో వచ్చింది. డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రెనో క్యాప్చర్ ఎస్‌యూవీ మీద సుమారుగా రూ. 55,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు: ఏకంగా లక్ష రుపాయలు తగ్గింపు!

రెనో క్యాప్చర్ క్రాసోవర్ ఎస్‌యూవీ 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. రెండు ఇంజన్ వేరియంట్లు కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే ఎంచుకోగలరు.

రెనో కార్లపై భారీ ఆఫర్లు: ఏకంగా లక్ష రుపాయలు తగ్గింపు!

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

రెనో క్విడ్

ఫ్రెంచ్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం రెనో బెస్ట్ సెల్లింగ్ కారు క్విడ్. 2015లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన క్విడ్ అనతి కాలంలోనే భారీ విజయాన్ని అందుకుని, పాపులర్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది. విపణిలో ఉన్న మారుతి సుజుకి ఆల్టో 800 మరియు ఆల్టో కె10 వంటి కార్లకు గట్టి పోటీనిచ్చింది.

రెనో కార్లపై భారీ ఆఫర్లు: ఏకంగా లక్ష రుపాయలు తగ్గింపు!

రెనో ఇండియా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ క్విడ్ మీద గరిష్టంగా రూ. 25,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. రెనో క్విడ్ 800సీసీ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

గమనిక: వివిధ ప్రాంతాలు, డీలర్ల ఆధారంగా డిస్కౌంట్లు మరియు ఆఫర్లలో వ్యత్యాసం ఉండవచ్చు. మరిన్ని వివరాలు కోసం సమీపంలోని రెనో షోరూమ్‌ని సంప్రదించగలరు.

Most Read Articles

English summary
Renault Makes First Move — Benefits Of Up To Rs 1 Lakh On The Duster, The Captur, And The Kwid. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X