ట్రైబర్ ఎంపివి ని ఆవిష్కరించిన రెనాల్ట్... దగ్గరలో లాంచ్ కూడా...
భారతదేశంలో మారుతి సుజుకి ఎర్టిగా మరియు మహీంద్రా మారాజ్జో కాకుండా సబ్-4మీటర్ విభాగంలో తక్కువ ధరతో రెనాల్ట్ ట్రైబర్ ను ఆవిష్కరించింది. ఇది దాదాపు రూ .5 లక్షలకు దగ్గరగా ధర పలికే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే మారుతి సుజుకి ఎర్టిగా రూ. 7.45 లక్షలు, మరియు మహీంద్రా మారాజ్జో ధర రూ. 10.17 లక్షలు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి.

మహీంద్రా మారాజ్జో కేవలం భారత మార్కెట్లో డీజల్ ఇంజన్ ను మాత్రమే అందిస్తుండగా, రెనాల్ట్ ట్రైబర్ మరియు మారుతి సుజుకి ఎర్టిగా పెట్రోల్ ఇంజన్ తో లభ్యమవటం గమనార్హం. రెనాల్ట్ ట్రైబర్ అనేది సవరించిన వెర్షన్ అయినటువంటి సిఎమ్ఎఫ్-ఎ ప్లాట్ ఫారమ్ మీద ఆధారపడి ఉంటుంది.

ఇందులో అత్యంత సరసమైన ఏడు సీట్లతో, క్రాస్ఓవర్ ప్రేరేపిత బాడీ డిజైన్ తో ట్రైబర్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది బోనెట్ మరియు కారుపై లోతైన క్రీజులు పొందడం వలన చాలా అందంగా కనిపిస్తుంది.

రెనాల్ట్ ట్రైబర్ ప్రపంచవ్యాప్తంగా వెల్లడి కాగా, భారత పరిస్థితికి అనుగుణంగా ఇంజనీరింగ్ మరియు ఇతర లక్షణాలను రూపకల్పన చేసారు. అదే విధంగా రెనాల్ట్ క్విడ్ ను భారతదేశంలో ప్రారంభించి తర్వాత లాటిన్-అమెరికన్ మార్కెట్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో లాంచ్ చేశారు.

ట్రైబర్ విండో లైన్ లో ఒక రకమైన డిజైన్ వస్తుంది. ట్రైబర్ సెగ్మెంట్ లో ఇతర ఎంపివి ల వలే విస్త్రృతశ్రేణి స్లైడింగ్ మరియు రెండో వరస సీటును మడుచుకోవచ్చు. ఇది ఒక రిమూవబుల్ సిట్ అమరికను పొందుతుంది.

చివరి వరుసను తొలగించిన తర్వాత ట్రైబర్లో భారీగా 625-లీటర్ల స్థలం లభిస్తుంది. రెనాల్ట్ ట్రైబర్ యొక్క మూడవ వరుసలో ఆర్మ్ రెస్ట్స్ మరియు ఛార్జింగ్ పాయింట్లను కూడా అందిస్తుంది, ఇది సీటు యొక్క చివరి వరుసలో ప్రయాణీకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇందులో ఒక ఆల్-డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ మరియు మూడో వరస స్థానంలో క్లాస్ లీడింగ్ హెడ్ రూమ్ మరియు బూట్ స్పేస్ కూడా పొందుతుంది.

ఇంజిన్ల యొక్క ఖచ్చితమైన స్పెసిఫికేషన్ లను రెనాల్ట్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఇది ఇప్పటికే రెనాల్ట్ గ్లోబల్ మోడళ్లలో అందుబాటులో ఉన్న సరికొత్త 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ను పొందనుంది.

ఇందులోని ఇంజన్ గరిష్టంగా 72బిహెచ్పి మరియు 96ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెనాల్ట్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ల గురించి మాట్లాడలేదు కానీ ఇది ఆప్షనల్ యూనిట్ గా ఈజీ-ఆర్ ఎఎంటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను పొందనుంది.

వచ్చే నెలలో ఇండియన్ మార్కెట్లో ట్రైబర్ ప్రారంభం కానుంది. ఇది తగిన ధర ట్యాగ్తో ఎర్టిగ మరియు మారాజ్జో లకు గట్టి పోటీని ఇవ్వనుంది. రెనాల్ట్ అధికారికంగా త్వరలో ట్రైబర్ బుకింగ్స్ లను కూడా మొదలు పెట్టనుంది.


Click it and Unblock the Notifications








