టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

టాటా మోటార్స్ సరికొత్త ఆల్టోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును దేశీయంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది, ఇందుకు సంభందించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంది. జనవరి 22, 2020 న పూర్తి స్థాయిలో విడుదల చేయనున్నారు, బుకింగ్స్ కూడా అతి త్వరలో ప్రారంభమవుతాయి.

టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

ఇండియన్ మార్కెట్లో విడుదలకు ఎంతోకాలంగా వేచిఉన్న ఉన్న మోడళ్లలో టాటా ఆల్ట్రోజ్ ఒకటి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి సెగ్మెంట్లోకి విడుదలవుతున్న టాటా ఆల్ట్రోజ్ విపణిలో ఉన్న మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఎలైట్ఐ10 మరియు వోక్స్‌వ్యాగన్ పోలో మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

టాటా ఆల్ట్రోజ్ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఫీచర్లు, సరికొత్త డిజైన్ మరియు పవర్‌ఫుల్ ఇంజన్‌ ఆప్షన్లతో వచ్చింది. ఇప్పటికీ ఈ సెగ్మంట్లో పరిచయం కానటువంటి సాంకేతిక టెక్నాలజీ ఇందులో వచ్చింది. అంతే కాకుండా, టాటా కంపెనీ ప్రారంభించిన సరికొత్త "ఆల్ఫా" అర్కిటెక్చర్ మీద వచ్చిన మొదటి కారు కూడా ఇదే.

టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును టాటా ఆవిష్కరించిన ఆధునిక "ఇంపాక్ట్ 2.0" డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించారు. ఏడాది ప్రారంభంలో విడుదలైన టాటా హ్యారీయర్ ఎస్‌యూవీని కూడా ఇదే డిజైన్ లాంగ్వేజ్ ఫిలాసఫీతో తీసుకొచ్చారు.

టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

టాటా ఆల్ట్రోజ్ డిజైన్ పరంగా అత్యంత పదునైన మరియు అగ్రెసివ్ లుక్ కలిగి ఉంది. ఇందులో, పదునైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్ గల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు ఫ్రంట్ బంపర్ మీదున్న స్టైలిష్ ఫాగ్ ల్యాంప్స్ కారుకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇచ్చాయి.

టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

టాటా ఆల్ట్రోజ్ ఇంటీరియర్ విషయానికి వస్తే, రకరకాల ఎలక్ట్రిక్ పరికరాలున్నాయి. ఇందులో, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పలు రకాల కంట్రోల్స్ గల ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ప్లష్ సీట్లు ఉన్నాయి.

టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ రెండు రకాల ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతోంది. వీటిలో 85బిహెచ్‌పి పవర్‌నిచ్చే 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 90బిహెచ్‌పి పవర్ అందించే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఉన్నాయి. రెండింటినీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. భవిష్యత్తులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి.

Read More: ఇండియా బైక్ వీక్‌లో అదరగొట్టిన కెటిఎమ్‌ 390 అడ్వెంచర్

టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

టాటా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులోని రెండు ఇంజన్‌లు కూడా బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అందించారు. ఆల్ట్రోజ్ కారును ఇండియన్ మార్కెట్లోకి ఆలస్యంగా విడుదల చేయడానికి బిఎస్-6 రెగ్యులేషన్స్ కూడా ఒక ప్రధాన కారణం.

Read More:ఓఆర్ఎక్స్ఏ మాంటీస్ ఎలక్ట్రికల్ పెరఫామెన్స్ మోటార్ సైకిల్ రెవెల్ల్డ్

టాటా ఆల్ట్రోజ్ రిలీజ్ డేట్ ఫిక్స్: మారుతికి ఊహించని షాక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా ఆల్ట్రోజ్ కారు మీద మార్కెట్లో ఎన్నో అంచనాలున్నాయి. టాటా తీసుకొస్తున్న మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇదే. ఈ సెగ్మెంట్లో ఇప్పటికీ విపరీతమైన పోటీ ఉంది, పోటీని ఎదుర్కొని మార్కెట్లో నిలబడేందుకు టాటా ఆల్ట్రోజ్‌ను రూ. 6 నుండి 8 లక్షల రేంజ్‌లో (ఎక్స్-షోరూమ్) విడుదల చేసే అవకాశం ఉంది.టాటా ఆల్ట్రోజ్ లాంచ్ మరియు ఫస్ట్ డ్రైవ్ రివ్యూలను త్వరలోనే ప్రచురిస్తాం.. అంత వరకు డ్రైవ్‌స్పార్క్ తెలుగును చూస్తూ ఉండండి.

Read More: జనవరి నుండి భారీగా పెరగుతున్న టాటా కార్ల ధరలు

Most Read Articles

English summary
Tata Altroz India Launch Date Confirmed: To Rival The Maruti Suzuki Baleno-Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X