Just In
Don't Miss
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డిసెంబర్‌లో వస్తున్నా.. సిద్దంగా ఉండండి: టాటా ఆల్ట్రోజ్
భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ "ఆల్ట్రోజ్" కారును డిసెంబరులో అవిష్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఢిల్లీ వేదికగా సరిగ్గా రెండేళ్ల క్రితం 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఈ ఆల్ట్రోజ్ కారును 45X కాన్సెప్ట్ పేరుతో తొలిసారిగా ప్రదర్శించినపుడు వీక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది.

అతి త్వరలో మార్కెట్లోకి ఆవిష్కరించనున్న టాటా అల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారును టాటా వారి అత్యాధునిక ఆల్ఫా ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించారు, మరియు ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఉన్న మోడళ్ల కంటే ఇది అత్యంత వెడల్పైనది మరియు తక్కువ వీల్ బేస్ కలిగి ఉంది. దీంతో ఇది చూడటానికి కాస్త మినీ ఎస్‌యూవీ తరహాలో ఉంటుంది.

ఇంటీరియర్ గురించి ఎలాంటి వివరాలు వెల్లడికాలేదు. డిసెంబర్ నెలలో తొలిసారి జరుగుతున్న టాటా ఆల్ట్రోజ్ ఆవిష్కరణలో ఇంటీరియర్‌లో వచ్చే అత్యాధునిక ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, సౌకర్యవంతమైన, సురక్షితమైన మరియు ఎంటర్‍టైన్‌మెంట్‌కు సంభందించి ఎన్నో ఫీచర్లు రానున్నాయి. అతి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు టు-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా ఎన్నో పరిచయం కానున్నాయి.

టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎక్ట్సీరియర్ డిజైన్ మొత్తం కూడా టాటా ఇంపాక్ట్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా డెవలప్ చేశారు. టాటా హ్యారీయర్ ఎస్‌యూవీని కూడా ఇదే డిజైన్ ఫిలాసఫీ క్రింద డిజైన్ చేశారు. ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో 341-లీటర్ల విశాలమైన లగేజ్ స్పేస్ ఉన్నట్లు సమాచారం.

టాటా ఆల్ట్రోజ్ వాస్తవానికి ఈ ఏడాది ఆగష్టులోనే విడుదల కావాల్సి ఉంది, కానీ ఇందులో బిఎస్-6 వెర్షన్ ఇంజన్ అందించాలనే ఉద్దేశంతో దీని విడుదలను వచ్చే ఏడాదికి మార్చింది. సాంకేతికంగా ఇందులో బిఎస్-6 ప్రమాణాలను పాటించే 1.2-లీటర్ పెట్రోల్ (టియాగోలో ఉన్నటువంటి) ఇంజన్ సాధారణ వేరియంట్లలో మరియు 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ (టాటా నెక్సాన్‌లో ఉన్నటువంటి) ఇంజన్ టాప్ ఎండ్ వేరియంట్లలో లభించనుంది.

టాటా ఆల్ట్రోజ్ డీజల్ వేరియంట్ల విషయానికి వస్తే, ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో ఉన్నటువంటి 90బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ యధావిధిగా రానుంది. పెట్రోల్ మరియు డీజల్ అన్ని ఇంజన్ వేరియంట్లు ప్రస్తుతానికి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో లభించనున్నాయి, డిమాండును బట్టి భవిష్యత్తులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేస్తారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
టాటా ఆల్ట్రోజ్ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందా అని కస్టమర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇది మార్కెట్లోకి పూర్తి స్థాయిలో విడుదలైతే, టెస్ట్ డ్రైవ్ చేయడానికి మేము కూడా ఎంతగానే వెయిట్ చేస్తున్నాము.
టాటా ఆల్ట్రోజ్ కంపెనీ యొక్క ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. ఇది విపణిలో ఉన్న మారుతి బాలెనో, హ్యుందాయ్ ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ మోడళ్లకు సరాసరి పోటీనివ్వనుంది.