గుడ్‌న్యూస్: టాటా కార్లపై లక్షన్నర తగ్గింపు.. ఏయే కారు మీద ఎంత?

దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ కార్ల మీద భారీ ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించింది. "ఫెస్టివల్ ఆఫ్ కార్స్" అనే క్యాంపెయిన్‌ ద్వారా దాదాపు అన్ని మోడళ్ల మీద అద్భుతమైన ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఈ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

గుడ్‌న్యూస్: టాటా కార్లపై లక్షన్నర తగ్గింపు.. ఏయే కారు మీద ఎంత?

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న కార్లలోకెల్లా ఎంచుకోదగిన మోడళ్ల మీద మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. హెక్సా, టియాగో, టిగోర్, టియాగో ఎన్‌ఆర్‌జి, నెక్సాన్ మరియు హ్యీరియర్ కార్ల మీద ఆఫర్లు వర్తిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని షోరూముల్లో కనిష్టంగా రూ. 50,000 నుండి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

గుడ్‌న్యూస్: టాటా కార్లపై లక్షన్నర తగ్గింపు.. ఏయే కారు మీద ఎంత?

కస్టమర్ల ఛాయిస్‌ను బట్టి టాటా అందించే డిస్కౌంట్లు మరియు ఆఫర్లలో కాస్త వ్యత్యాసం ఉంటుంది. కస్టమర్లు తమ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను వారే నిర్ణయించుకోవచ్చు. వీటితో పాటు అదనంగా ఎక్స్‌చేంజ్ బోనస్, కార్పోరేట్ ఆఫర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు పలు ప్రత్యేక స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

Model Benefits Up To
Tata Hexa Rs 1,50,000
Tata Nexon Rs 85,000
Tata Tiago Rs 70,000
Tata Tiago NRG Rs 70,000
Tata Tigor Rs 1,15,000
Tata Harrier Rs 50,000
గుడ్‌న్యూస్: టాటా కార్లపై లక్షన్నర తగ్గింపు.. ఏయే కారు మీద ఎంత?

అంతే కాకుండా, ఈ పండుగ సీజన్ నాటికి సొంత కారు కల నెరవేర్చుకోవాలనుకునే కస్టమర్ల కోసం వీలైనంత మేర తక్కువ మొత్తంలో ఇఎంఐ ఉండేలా పలు ఫైనాన్స్ కంపెనీలో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుని 100శాతం ఫైనాన్స్ కల్పిస్తున్నారు.

గుడ్‌న్యూస్: టాటా కార్లపై లక్షన్నర తగ్గింపు.. ఏయే కారు మీద ఎంత?

టాటా మోటార్స్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్.ఎన్. బర్మన్ మాట్లాడుతూ, "పండుగ సీజన్ ప్రారంభమయ్యే సందర్భం మాకు ఎంతో ముఖ్యమైనది. కస్టమర్లకు పలు రకాల ఆఫర్లు, డిస్కౌంట్లు మరియు బోనస్ అందించి వారికి మరింత ఆనందాన్ని పంచుతూ కస్టమర్లు జరుపుకునే పండుగ వేడుకల్లో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన గణేష్ చతుర్థి మరియు ఓనమ్ పండుగ వేళ అత్యుత్తమ సేల్స్ సాధించాము.. ఆ ప్రేరణతోనే ఫెస్టివల్ ఆఫ్ కార్స్ అనే క్యాంపెయిన్ ప్రారంభించి ఈ పండుగ సీజన్‌లో కొత్త కార్లను కొనాలనుకునే కస్టమర్ల కోసం పలు ప్రత్యేకమైన ఆఫర్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పుకొచ్చాడు."

గుడ్‌న్యూస్: టాటా కార్లపై లక్షన్నర తగ్గింపు.. ఏయే కారు మీద ఎంత?

అంతే కాకుండా, "పండుగ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆఫర్లు కస్టమర్లను తప్పకుండా ఆకట్టుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా టాటా బ్రాండ్ కార్ల మీద కస్టమర్లకు మంచి నమ్మకం ఉందని, ఈ పండుగ సీజన్‌లో కస్టమర్లు, డీలర్లు మరియు వ్యాపార భాగస్వాములకు శుభాకాంక్షలు తెలియజేశారు."

గుడ్‌న్యూస్: టాటా కార్లపై లక్షన్నర తగ్గింపు.. ఏయే కారు మీద ఎంత?

దేశీయంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఆటోమొబైల్ పరిశ్రమ డీలా పడిపోయింది. ఆశించిన సేల్స్ లేకపోవడంతో పలు కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. పండుగ సీజన్ రావడంతో పలు ఆఫర్లు, డిస్కౌంట్లు అందించి సేల్స్ పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా తమ అన్ని కొత్త కార్ల మీద దాదాపు లక్షన్నర రూపాయల వరకు డిస్కౌంట్లు మరియు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 17, 2019, 15:58 [IST]
English summary
Tata Motors Announces Discounts & Benefits Of Up To Rs 1.50 Lakh On Select Models. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+