టాటా నుండి దూసుకొస్తున్న మరో ఎస్‌యూవీ.. గ్రావిటాస్

టాటా మోటార్స్ తమ గ్రావిటాస్ ఎస్‌యూవీని ఫిబ్రవరి 2020లో పరిచయం చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో టాటా విడుదల చేసిన హ్యారియర్ ఎస్‌యూవీ ఆధారంగా టాటా తీసుకొస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ టాటా గ్రావిటాస్.

టాటా నుండి దూసుకొస్తున్న మరో ఎస్‌యూవీ.. గ్రావిటాస్

టాటా విక్రయిస్తున్న వాటిలో అత్యంత ఖరీదైన మోడల్ టాటా హ్యారీయర్ ఎస్‌యూవీ కాగా దీని కంటే పై స్థానంలో తమ నెక్ట్స్ మోడల్ గ్రావిటాస్‌ను టాటా తీసుకొస్తోంది. తొలుత దీనిని పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే విక్రయించనున్నారు.

టాటా నుండి దూసుకొస్తున్న మరో ఎస్‌యూవీ.. గ్రావిటాస్

టాటా హ్యారియర్ ఎస్‌యూవీలో లభించే అదే 2.0-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను రీ-ట్యూన్ చేసి అందిస్తున్నారు. స్టాండర్డ్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇది గరిష్టంగా 173బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నుండి దూసుకొస్తున్న మరో ఎస్‌యూవీ.. గ్రావిటాస్

టాటా మోటార్స్ తమ హ్యారీయర్ మరియు గ్రావిటాస్ ఎస్‌యూవీల కోసం ప్రత్యేకమైన పెట్రోల్ ఇంజన్ డెవలప్ చేస్తున్నట్లు రూమర్లు వినిపించాయి. కార్‌దేఖో కథనం మేరకు, టాటా సరికొత్త 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా ప్రవేశపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిని టుర్భో ఛార్జ్‌డ్ వెర్షన్‌లో కూడా అందించే ఛాన్స్ ఉంది.

టాటా నుండి దూసుకొస్తున్న మరో ఎస్‌యూవీ.. గ్రావిటాస్

ఏదేమైనప్పటికీ కొత్త పెట్రోల్ ఇంజన్ పరిచయం గురించి టాటా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 2020 మధ్య భాగంలో మార్కెట్లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హ్యారియర్ మరియు గ్రావిటాస్ రెండు ఎస్‌యూవీలలో ఒకేసారి ఈ కొత్త ఇంజన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

టాటా నుండి దూసుకొస్తున్న మరో ఎస్‌యూవీ.. గ్రావిటాస్

నూతన పెట్రోల్ ఇంజన్ డెవలప్ చేయడంతో పాటు సరికొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అభివృద్ది చేస్తున్నట్లు టాటా ప్రతినిధులు పేర్కొన్నారు. హ్యారియర్ మరియు గ్రావిటాస్ రెండు ఎస్‌యూవీలలో కూడా తొలుత 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరిచయం చేయనున్నారు.

టాటా నుండి దూసుకొస్తున్న మరో ఎస్‌యూవీ.. గ్రావిటాస్

పలు నివేదికల నుండి అందిన సమచారం మేరకు, టాటా డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మీద పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. డీసీటీ గేర్‌బాక్స్ పూర్తి స్థాయిలో డెవలప్ అయితే రెండు మోడళ్లలో కూడా టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్ స్థానంలో డీసీటీ గేర్‌బాక్స్ అందివ్వనున్నారు.

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీని "బజార్డ్" (Buzzard) పేరుతో 2019 జెనీవా మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించారు. గ్రావిటా ఎస్‌యూవీ టాటా హ్యారీయర్ ఎస్‌యూవీ యొక్క 7-సీటర్ వెర్షన్. ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ చూడటానికి అచ్చం హ్యారీయర్‌నే పోలి ఉంటుంది. అయితే ఎక్కువ మంది ప్రయాణించేలా ఇందులో 7-సీటింగ్ లేఔట్ ఉంటుంది.

టాటా నుండి దూసుకొస్తున్న మరో ఎస్‌యూవీ.. గ్రావిటాస్

టాటా మోటార్స్ ఈ 7-సీటర్ ఎస్‌యూవీని కూడా అదే ఒమెగా (OMEGA) ఫ్లాట్‌ఫామ్ మీద, టాటా యొక్క అత్యాధునిక "ఇంపాక్ట్ 2.0" డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా నిర్మించారు. ఇదే ఫ్లాట‌్‌ఫామ్ మరియు డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఇప్పటికే ఎన్నో మోడళ్లను టాటా తీసుకొచ్చింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా గ్రావిటాస్ ఎస్‌యూవీ హ్యారీయర్ కంటే పై స్థానంలో, టాటా హెక్సాతో సమానంగా మార్కెట్‌లోకి రానుంది. ప్రీమియం ఎస్‌యూవీగా పిలువబడే దీని ప్రారంభ ధర సుమారుగా రూ. 15 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు. ఫిబ్రవరి 2020లో పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది. ఒక్కసారిగా మార్కెట్లోకి ప్రవేశిస్తే విపణిలో ఉన్న ఫోర్డ్ ఎండీవర్, టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా అల్టురాస్ జీ4 మరియు స్కోడా కొడియాక్ వంటి ప్రీమియం ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Tata Gravitas Petrol Variant Coming Soon: India Launch Expected By Mid-2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X