హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

టాటా మోటార్స్ హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేసింది. విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా మోడళ్లలో హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీ ఒకటి. టాటా హ్యారీయర్ 7-సీటర్ పూర్తి స్థాయిలో లాంచ్ అయితే విపణిలో ఉన్న టాటా హెక్సా ఎస్‌యూవీ స్థానాన్ని భర్తీ చేస్తుందని సమాచారం.

హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

టాటా మోటార్స్ 7-సీటర్ హ్యారీయర్ ఎస్‌యూవీని మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఆవిష్కరించింది. బయట నుండి ఈ ఎస్‌యూవీని చూస్తే రెగ్యులర్ 5-సీటర్ హ్యారీయర్ కంటే మరింత గంభీరమైన రూపాన్ని కలిగి ఉంది. రోడ్డు మీద చూస్తే చక్కటి సౌష్టవాన్ని కలిగి ఉంటుంది.

హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

ఆటో కార్ ఇండియా ప్రచురించి కథనం మేరకు, టాటా మోటార్స్ విక్రయిస్తున్న కార్లలో ఉన్నటువంటి హెక్సా మోడల్ స్థానాన్ని హ్యారీయర్ 7-సీటర్ భర్తీ చేస్తుందని సమాచారం. ప్రస్తుతం టాటా విక్రయిస్తున్న కార్లు అన్నింటిలోకెల్లా హెక్సా అత్యంత ఖరీదైన మోడల్‌. గతంలో ఉన్నటువంటి టాటా అరియా ఎస్‌యూవీ స్థానంలోకి టాటా హెక్సా ఎస్‌‌యూవీని ప్రవేశపెట్టారు.

హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

వాస్తవానికి టాటా ఆశించినమేర హెక్సా విక్రయాలు లేవు, కానీ ఖరీదైన ఎస్‌యూవీల సెగ్మెంట్లోకి ప్రవేశించేందుకు టాటా హెక్సా మార్గం సుగమం చేసింది. ఇందులో 2.2-లీటర్ టుర్బో-డీజల్ ఇంజన్ కలదు, త్వరలో అమల్లోకి రానున్న బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు పాటించే విధంగా ఇంజన్‌ను అప్‌గ్రేడ్ చేసే పనిలో టాటా నిమగ్నమయ్యింది. ఈ క్రమంలో అతి త్వరలో టాటా హెక్సా ప్రొడక్షన్ నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

అత్యంత కఠినమైన బిఎస్-6 ఉద్గార ప్రమాణాలు ఏప్రిల్ 01, 2020 నుండి అమల్లోకి రానున్నాయి. చాలా వరకు కార్ల తయారీ సంస్థలు అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఉండే ఇంజన్‌లను వీలైనంత త్వరగా బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. కానీ అప్‌గ్రేడ్ సాధ్యం కానటువంటి మోడళ్ల మీద పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండా అలాగే వదిలేస్తున్నాయి. అందులో టాటా హెక్సా ఒకటి అనే వార్తలు వినిపిస్తున్నాయి.

హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

టాటా హెక్సా ప్రస్తుతం ఉన్న మోడల్‌ను బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది, టాటా హెక్సా సేల్స్‌ పరంగా చూసుకుంటే ఈ నిర్ణయం సంస్థకు ఏ విధంగాను లాభదాయకం కాదు. కాబట్టి, ప్రస్తుతం అభివృద్ది చేసినటువంటి హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని హెక్సా స్థానాన్ని భర్తీ చేస్తూ, విపణిలోకి ప్రవేశపెట్టాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

ఈ నిర్ణయంతో టాటా మోటార్స్‌కు దేశీయ విపణిలో మరిన్ని కొత్త మోడళ్లను కలిగి ఉండటమే కాకుండా.. కొత్త కార్ల విడుదల ద్వారా మంచి సేల్స్ కూడా సాధించగలదు. సాంకేతికంగా టాటా హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీ అధునాతన 2.2-లీటర్ డీజల్ బిఎస్-6 ఇంజన్‌తో రానుంది.

హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సంస్థను సొంతం చేసుకున్న తర్వాత, ల్యాండ్ రోవర్ సంస్థలో ఉన్నటువంటి డిజైన్ ఫిలాసఫీని టాటా ప్యాసింజర్ వెహికల్స్ విభాగాన్ని అన్వయించడంతో గత మూడేళ్ల కాలంలో టాటా బృందం ఎన్నో నూతన మోడళ్లను ఆవిష్కరించింది. ఇందులో భాగంగానే ల్యాండ్ రోవర్ డి8 డిజైన్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని అభివృద్ది చేశారు.

హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీని సిద్దం చేసిన టాటా, విడుదల ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టాటా హ్యారియర్ అద్భుతమైన ఎస్‌యూవీ, సేల్స్ పరంగా సంస్థకు ఊహించని ఫలితాలనిస్తోంది. హ్యారీయర్ 5-సీటర్‌కు కొనసాగింపుగా టాటా ఇప్పుడు హ్యారీయర్ 7-సీటర్ మోడల్‌ను విడుదలకు సిద్దం చేస్తోంది. ఇది పూర్తి స్థాయిలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయితే మరో సంచలనానికి దారితీస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాటా హ్యారీయర్ 7-సీటర్ ఎస్‌యూవీ గురించి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మాతో కలిసి ఉండండి.

Most Read Articles

English summary
Tata Might Discontinue Hexa In India — To Be Replaced With New 7-Seater Harrier-Based SUV. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X