హారియర్ పై కొత్త సన్ రూఫ్ ఫీచర్ ను పరిచయం చేస్తున్న టాటా మోటార్స్
టాటా మోటార్స్ తన ఫ్లాగ్ షిప్ ప్రొడక్ట్ అయిన హారియర్ ఎస్యువి ఈ ఏడాది ఆరంభంలో లాంచ్ చేసింది. ప్రారంభించినప్పటి నుంచి, ఈ ఎస్యువి చాలా ప్రజాదరణ పొందింది. అయితే, 2018 ఆటో ఎక్స్ పోలో హారియర్ షోను ప్రదర్శించినప్పుడు అది సన్ రూఫ్ తో కనిపించింది.

అయితే ఇండియాలో ఎస్యువి లాంచ్ అయినప్పుడు ఇందులో సన్ రూఫ్ ఫీచర్ లేదు. ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు మన దేశంలో సన్ రూఫ్ ని ఇష్టపడతారు, అంతే కాకుండా కొంత మంది కొనుగోలుదారులు నిరాశకు గురయ్యారు.

ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో కొత్త కొత్త ఫీచర్లను వినియోగదారులు కోరుకొంటున్నారు. కాగా, ఈ టాటా మోటార్స్ సంస్థ ఎట్టకేలకు హర్రియర్ కు అధికారికగా సన్ రూఫ్ ను అందజేయాలని నిర్ణయించింది.

ముంబైలోని కొంతమంది డీలర్లతో మాట్లాడుతూ, దేశీయ మార్కెట్లో సన్ రూఫ్ ని రూ.1 లక్ష నుంచి 1.30 లక్షల వరకు ధరను చేయవచ్చు అని తెలిసింది. యాక్ససరీల వేహికల్ యొక్క వారెంటీ చెల్లుబాటు కాదు మరియు కారు మీద ఇన్ స్టాల్ చేయడానికి వారాల సమయం పడుతుంది.

టాటా హారియర్ బ్రాండ్ యొక్క తాజా వేరియంట్లో ఇంపాక్ట్ 2.0 డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త డిజైన్ లాంగ్వేజ్ లో భాగంగా ఉన్న బ్రాండ్ లో హారియర్ ఎస్యువి మొదటి మోడల్ గా నిలిచింది.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
ఈ ఎస్యువి చాలా అద్భుతమైన లైటింగ్ అమరికను కలిగి ఉంది, ఎల్ఈడి డ్రిల్స్ పై ఉంచబడుతుంది, హెడ్ ల్యాంప్స్ బంపర్ మీద ఉంటాయి.

మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హారియర్ పై ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 8.8-అంగుళాల టచ్ స్క్రీన్ యూనిట్ లను కలిగి ఉంటుంది. టాటా ' ఫ్లోటింగ్ ఐలాండ్ ' గా పేర్కొనే ఒక ప్లాట్ ఫారం మీద ఈ సిస్టమ్ ఉంటుంది, మరియు ఆండ్రాయిడ్ ఆటో (యాపిల్ క్యారప్లే త్వరలో ప్రవేశపెట్టబడుతుంది) కు మద్దతు ఇస్తుంది.

2019 జెనీవా మోటార్ షో లో ' బజార్డ్ ' గా మొదటి షోను నిర్వహిస్తున్న హారియర్ ఎస్యువి యొక్క సెవెన్ సీటర్ వర్షన్ పై కంపెనీ పనిచేస్తోంది. ఈ ఎస్యువి భారత్ లో లాంచ్ అయినప్పుడు బజ్గార్డ్ అని ఉండదు. అయితే, ఫైవ్ సీటర్ హారియర్ ఎస్యువి మీద చూసిన విధంగా ఇది ఒక కొత్త డిజైన్ ను కలిగి ఉంటుంది.

టాటా హార్రియర్ ను 2.0-లీటర్ ' క్రయోటెక్ ' నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ లతో ఇది 138బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి వస్తుంది.

హారియర్ ఒక అద్భుతమైన వాహనం, అది ప్రారంభం అయినప్పటి నుండి చాలా ఆదరణ పొందింది. అయితే, ఈ ఎస్యువి సన్ రూఫ్ ను కలిగి లేనందున, కొంతమంది కొనుగోలుదారులు నిజంగా నిరాశకు గురయ్యారు. సన్ రూఫ్ ను మార్కెట్ యాక్ససరీ గా పరిచయం చేయడం ద్వారా, హారియర్ ఖచ్చితంగా మరింత ఎక్కువ కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








