హ్యారీయర్ కోసం ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లాంచ్ చేసిన టాటా: ధర ఎంతంటే?
టాటా మోటార్స్ తమ హ్యారీయర్ ఎస్‌యూవీ కోసం ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టాటా హ్యారీయర్ విడుదలైనప్పుడు సన్‌రూఫ్ ఫీచర్ రాలేదు. అయితే కస్టమర్ల అభిరుచి మేరకు.. అదనపు ఫీచర్‌గా రెండేళ్ల వారంటీతో ఈ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉన్న కార్లకు డిమాండ్ అధికంగా ఉంది.
టాటా హ్యారీయర్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ధరలు మరియు ఈ ఫీచర్‌ను హ్యారీయర్ కారులో ఎలా పొందాలనే విషయాన్ని తెలుసుకుందాం రండి...

*Image Courtesy: Webasto Sunroofs Chandigarh/Facebook
కొత్త కస్టమర్లు టాటా హ్యారీయర్ కారును ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో ఎంచుకోవచ్చు, సన్‌రూఫ్ లేకుండా ఇది వరకే కొనుగోలు చేసిన కస్టమర్లు టాటా షోరూముల్లో అదనపు యాక్ససరీగా ఫిట్ చేయించుకోవచ్చు. దీని ధర రూ. 95,100 వరకు ఉన్నట్లు సమాచారం.

టాటా అందిస్తున్నటువంటి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కొలతలు ఖచ్చితంగా ఎలా ఉంటాయనేది వెల్లడించలేదు. కానీ, ఇది వరకే టాటా హ్యారీయర్ ఎంచుకున్న కస్టమర్లు టాటా సర్వీస్ సెంటర్లలో సన్‌రూఫ్ ఫిట్ చేయించుకుంటే హ్యారీయర్ మీద ఉన్న వారంటీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది.

మార్కెట్లో టాటా హ్యారీయర్‌కు పోటీగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, జీప్ కంపాస్ మరియు ఎంజీ హెక్టర్ వంటి మోడళ్లలో సన్‌రూఫ్ వచ్చింది. దీంతో ఇటు కస్టమర్ల కోసం.. అటు పోటీని ఎదుర్కునేందుకు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు.

సన్‌రూఫ్ ఫీచర్ ఇప్పుడు దాదాపు అన్ని రకాల సెగ్మెంట్లలో తప్పనిసరిగా వచ్చేసింది. స్మాల్ బడ్జెట్ కార్లు మరియు ఓ మోస్తారు ఖరీదైన కార్ల నుండి ఖరీదైన ప్రీమియం ఎస్‌యూవీల వరకు సన్‌రూఫ్ తప్పనిసరిగా వస్తోంది. ప్రస్తుతం టాటా హ్యారీయర్‌లో అదనపు యాక్ససరీగా లభిస్తోంది. సన్‌రూఫ్‌తో లభిస్తున్న మరో ఏకైక మోడల్ టాటా హెక్సా.

టాటా మోటార్స్ జెన్యూన్ యాక్ససరీస్ విభాగం ఈ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అదనపు ఫీచర్‌ను అందిస్తోంది. హ్యారీయర్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ హెచ్-300 మీద ఫిట్ చేసిన రోజు నుండి సరిగ్గా రెండేళ్ల పాటు వారంటీ అందిస్తోంది.

పరిశుభ్రమైన గాలి మరియు వెలుతురు క్యాబిన్ లోపలికి ప్రవేశించేందుకు సన్‌రూఫ్ ఉపయోగపడుతుంది. సన్‌రూఫ్ గ్లాస్ మీద టింటెన్ కోటింగ్ కలదు.. ఇది సుర్యూడి నుండి వచ్చే అల్ట్రా వైలెట్ రేడియేషన్ మరియు ప్రమాదకరమైన కిరణాలను నుండి రక్షిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎంజీ హెక్టర్ మరియు కియా సెల్టోస్ ఎస్‌యూవీలు విడుదలయ్యాక టాటా హ్యారీయర్ సేల్స్ నెలకు సగటున 700 యూనిట్ల వరకు పడిపోయాయి. సేల్స్ పెంచుకునేం క్రమంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్ ప్రవేశపెట్టాకనే సంగతి స్పష్టమవుతోంది. మరి ఈ ఫీచర్ హ్యారీయర్ సేల్స్ నిజంగానే పెంచుతుందో లేదో చూడాలి మరి!


Click it and Unblock the Notifications








