హారియర్ కార్లపై కొత్త అప్డేట్ లను ఉచితంగా ఆఫర్ చేస్తున్న టాటా మోటార్స్
టాటా మోటార్స్ నుంచి వచ్చిన హారియర్ కార్ భారత రోడ్లకు తగ్గట్టుగా అత్యంత భద్రతా ఫీచర్లతో ఉండడం వలన ఇది భారత మార్కెట్లో మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త కార్లలో ఎక్కువగా లేటెస్ట్ ఫీచర్లు వస్తున్నాయి. దీని వలన టాటా వారు కూడా తమ ఎస్‌యూవీ ని కొత్త అప్డేట్ లను ఇస్తోంది, అది కూడా ఉచితంగా మరి ఆ అప్డేట్లు ఏవో తెలుసుకొందాం రండి..

టాటా మోటార్స్ తమ ఫ్లాగ్ షిప్ ఎస్‌యూవీ అయిన హారియర్ ను ఇండియన్ మార్కెట్లో జనవరిలో లాంచ్ చేసింది. ఈ కారు మార్కెట్ లో అత్యంత విజయాన్ని సాధించింది మరియు నెలవారీ అమ్మకాల పరంగా కూడా తన ప్రత్యర్థులను అధిగమించింది. ఇప్పుడు, టాటా మోటార్స్ హారియర్ ఎస్‌యూవీ కు కొన్ని అప్గ్రేడ్ లను అందిస్తోంది.

టాటా హారియర్ పై ఉన్న ఈ నవీకరణలను కస్టమర్లకు ఉచితంగా, దాని నిర్ణీత సేవల సమయంలో అవసరమైన మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందని తెలిసింది. వాటిలో ముఖ్యంగా క్లచ్ పెడల్ రిటర్న్ స్ప్రింగ్, టెయిల్ గేట్ స్విచ్, క్లచ్ కంప్రెషన్ స్ప్రింగ్, ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ కు సాఫ్ట్ వేర్ అప్డేట్ లు చేయనుంది.

ఆర్ఎక్స్ 1.0 సాఫ్ట్ వేర్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ కు అప్డేట్ చేస్తుంది, సిస్టమ్ లో ఏదైనా గ్లిచ్ ని తొలగించేటప్పుడు యూనిట్ యొక్క పనితీరును పెంపొందిస్తుంది. టాటా మోటార్స్ స్టీరింగ్ వీల్ ను మార్పు చేసింది, ఇది ఇప్పుడు మరింత మెరుగైన ఫీడ్ బ్యాక్ ని ఇస్తుందని అనుకొంటున్నారు, అంతే కాకుండా ఇంతకు ముందు కంటే మరింత భధ్రతతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

టాటా హారియర్ మీద క్లచ్ ఆపరేషన్ కూడా అప్డేట్ చేయబడినదని తెలుస్తోంది, ఈ ఎస్‌యూవీ ఇప్పుడు లైటర్ ఆపరేషన్ లకు అప్డేట్ లను ఇవ్వడం వలన డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. చివరగా, టాటా మోటార్స్ మరింత మెరుగైన ఇన్సులేషన్ జోడించడం ద్వారా, హారియర్ యొక్క ఎన్ విహెచ్ స్థాయిలను కూడా మెరుగుపర్చింది.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
వారి నిర్ణీత సర్వీసుల సమయంలో కస్టమర్ కార్లకు అప్డేట్స్ చేస్తారు. అప్డేట్ లు కస్టమర్ కు ఉచితంగా ఇస్తున్నారు మరియు ఈ అప్డేట్ లను అనేక ఫీడ్ బ్యాక్ లపై ఆధారపడి ఉంటుంది.

టాటా హారియర్ ఎస్‌యూవీ ఒమేగా ప్లాట్ ఫాంలో భాగంగా ఉంది, ఇదిలా ఉంటే ఈ బ్రాండ్ యొక్క కొత్త ' ఇంపాక్ట్ 2.0 ' డిజైన్ లాంగ్వేజ్ కిందకు వచ్చిన మొదటి టాటా ప్రొడక్ట్ అని చెప్పవచ్చు.

ఇది 143బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే సింగిల్ 2.0-లీటర్ ' క్రయోటెక్ ' డీజిల్ ఇంజిన్ (ఎఫ్సిఏ నుంచి తీసుకోబడింది) ద్వారా పవర్ చేయబడింది, ఆరు-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది.

టాటా మోటార్స్ ప్రస్తుతం హారియర్ ఆధారంగా సెవెన్ సీటర్ ఎస్‌యూవీ ను పరిచయం చేసే పనిలో ఉంది. కొత్త హారియర్ ఆధారిత సెవెన్ సీటర్ ఎస్‌యూవీ, హెక్స ను స్థానాన్ని భర్తీ చేస్తుందని, దీనిని త్వరలో నిలిపివేయనున్నట్లు చెప్పారు.

డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం
కంపెనీ ద్వారా అందుకున్న కస్టమర్ ఫీడ్ బ్యాక్ యొక్క సంఖ్య నుంచి టాటా హారియర్ అప్డేట్ లను చేస్తుంది. ఇది లాంచ్ చేసినప్పటి నుంచి ఈ ఎస్‌యూవీలో అనేక చిన్న సమస్యలు ఉన్నట్లుగా కనిపిస్తోంది, అయినా ఫీడ్ బ్యాక్ ఆధారంగా, అప్డేట్ లను ఇవ్వనున్నట్లు చెప్పబడింది. టాటా హర్రియర్ ప్రస్తుతం మహీంద్రా ఎక్స్యూవి 500, జీప్ కంపాస్, ఎంజి హెక్టర్ మరియు భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా వంటి వాటితో పోటీ పడుతోంది.


Click it and Unblock the Notifications








