ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

టాటా అంటే మొదటిగా గుర్తొచ్చేది నాణ్యమైన కార్ అని చెప్పవచ్చు, కొన్ని నెలల క్రితం విడుదలైన హారియర్ కార్ భారత మార్కెట్లో ఎటువంటి విజయాన్ని సాధించిందో మనకు తెలుసు. ఇటీవల కాలంలో ఒక కారు మాత్రమే దారుణమైన అమ్మకాలను నమోదు చేసింది. అది కూడా ఆర్ నెలల కాలంలో ఒకటీ మాత్రమే సేల్ జరిగింది. మరి అది ఏమిటో చూద్దామా...

ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

రతన్ టాటా డ్రీమ్ కారుగా వచ్చిన ‘నానో' కారు ఒకప్పుడు భారత మార్కెట్లో ప్రభంజనాన్ని సృష్టించింది. అయితే ఇప్పుడు దీని పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దీనికి ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ లేనే లేదు. అందువలన గత జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ కారును ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి చేయలేదు. ఫిబ్రవరిలో మాత్రం కేవలం ఒక్క కారు అమ్ముడు పోయిందని టాటా మోటార్స్ పేర్కొంది.

ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

2008 జనవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్ పోకు రతన్ టాటా సొంతంగా ‘నానో' కారు నడుపుకుంటూ వచ్చి దాని గురించి ప్రజలకు చెప్పారు. 2009 మార్చి నుంచి మార్కెట్లోకి నానో కారు విడుదలైంది. టాటా మోటార్స్ ఈ బుల్లి కారును ప్రారంభ దశలో రూ.1 లక్షకే కస్టమర్లకు విక్రయయించింది.

ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

అప్పట్లో లక్ష రూపాయలకే టాటా నానో కారు విక్రయిస్తామని ప్రజలకు రతన్ టాటా మాట ఇచ్చారు. తర్వాత కార్ల ఉత్పత్తి ప్రత్యేకించి ‘నానో' ప్రొడక్షన్లో ఉపయోగించే పరికరాల ధరలు పెరిగినా ‘ప్రజలకిచ్చిన మాటకే కట్టుబడి ఉన్నట్లు రతన్ టాటా చెప్పాడు.

ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ జనవరి నుంచి ఈ బుల్లి కారు ఉత్పత్తిని నిలిపివేసింది. గత ఫిబ్రవరి నుంచి ఒకే ఒక్క కారు అమ్ముడు పోయిందంటూ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అయితే టాటా మోటార్స్ తమ నానో కార్ ఉత్పత్తి నిలిపివేయాలనే ప్రాథమికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.

ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

ప్రారంభ దశలో నానో కారును ‘పీపుల్స్ కారు' అని పిలిచేవారు. టాటా మోటార్స్ డిమాండ్ ఉన్నంత కాలం నానో కారును విక్రయించింది . చివరిసారిగా గతేడాది డిసెంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రం సనంద్ నుంచి 82 నానో కార్లను టాటా మోటార్స్ ఉత్పత్తి చేసింది. తర్వాత ఈ సంవత్సరం మొదటి నుంచి జూన్ వరకు టాటా నానో కారును ఉత్పత్తి చేయ లేదు.

ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

తాము వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా కార్లను విక్రయిస్తామని, నానో ఉత్పత్తిని అధికారికంగా నిలిపేయలేదని టాటామోటార్స్ అధికార ప్రతినిధి ద్వారా తెలిసింది, అయితే టాటా మాత్రం దీనిపై ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు.

ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

ఈ ఆరు నెలల కాలంలో విదేశాలకు టాటా నానో కార్ల ఎగుమతి చేయలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బిఎస్ -6 ప్రమాణాలను అమలు చేయనున్న విషయం తెలిసిందే, ఈ నేపథ్యంలో నానో మోడల్ కారు ఉత్పత్తిని నిలిపేయాలని టాటా మోటార్స్ సంకేతాలిచ్చింది అని తెలిసింది.

ఆరు నెలలో ఒకటి మాత్రమే సేల్ అయిన టాటా కార్ ఏదో తెలుసా

సేఫ్టీ రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా నానో కారులో మార్పులు చేయాలంటే ఇప్పటికిప్పుడు అయ్యే విషయం కాదని పేర్కొంది. ఆ స్థాయిలో పెట్టుబడులు పెట్టే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. గతేడాది జూన్ నెలలో ఒక కారును ఉత్పత్తి చేసిన టాటా మోటార్స్, మూడు యూనిట్లను విక్రయించింది. ఆ నాటి నుంచి నానో కార్ల ఉత్పత్తిని సంస్థ యాజమాన్యం వినియోగదారుల డిమాండ్‌ను బట్టి చేపట్టింది.

Most Read Articles

English summary
Tata Motors launched the Nano way back during the March of 2009, and the little car soon became a bestseller for the company.Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X