ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

టాటా మోటార్స్ కంపెనీ ఆటోకాంప్ సిస్టమ్స్ ఎలక్ట్రిక్ కార్ల కోసం బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయడానికి చైనా కంపెనీ అయిన గుయోక్సువాన్ హైటెక్‌తో జతకలవడానికి సంతకం చేసింది. టాటా మోటార్స్ గ్రూప్ కంపెనీ యొక్క బలాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ లలో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లను స్థాపించడానికి ఇది టాటా పవర్‌తో జతకట్టింది.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

టాటా మోటార్స్ యొక్క సమూహ సంస్థలు చాలా వైవిధ్యభరితంగా ఉన్నాయి. ఇంకా ఇవి విభిన్న విభాగాలలో నైపుణ్యం కలిగి ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ మరింత ప్రాచుర్యం పొందే విదంగా తాము అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం అని టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ అధ్యక్షుడు శైలేష్ చంద్ర అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి దాదాపు 300 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ వేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే 50 వరకు ఛార్జింగ్ స్టేషన్లను స్థాపించామని చెప్పారు. మొత్తానికి వచ్చే ఆర్ధిక సంవత్సరానికల్లా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా టాటామోటార్స్ వారు అడుగులు వేస్తున్నట్లు మనకు తెలుస్తుంది.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

ఈ సమూహం యొక్క ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్మ్, టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ మరియు ఎలక్ట్రిక్ కార్ల కోసం బ్యాటరీ ప్యాక్‌ల తయారు చేయడంకోసంఇప్పటికే చైనా కంపెనీ అయిన గుయోక్సువాన్ హైటెక్‌ జాయింట్ వెంచర్ (జెవి)తో సంతకం చేసింది. ఈ జెవి సంస్థ ఇప్పుడు పూణేలో ప్రోటోటైప్ తయారీ కార్యకలాపాలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ కోసం డిసి ఫాస్ట్ ఛార్జర్లను తయారు చేయడానికి ఇది ఆస్ట్రేలియా కంపెనీ ట్రిటియంతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

టాటా మోటార్స్ ఛైర్మెన్ చంద్రశేఖరన్ ప్రకారం క్రోమా స్టోర్లలో కారును ప్రదర్శించాలనే ఆలోచన అక్కడికి వచ్చే వ్యక్తుల బట్టి ఉంటుందని వీరు దాదాపుగా టెక్-గీక్ కస్టమర్లను ఆకర్షించడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలను కొనబోతున్నట్లయితే వారు విద్యుత్తు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు అని అతను తెలియజేసాడు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

ఈ వారం ప్రారంభంలో టాటా మోటార్స్ ఏజిఎం వాటాదారులతో చేసిన ప్రసంగంలో చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఇవి కంపెనీ తన ఆశయాల కోసం అన్నింటిని అధికంగా పునః పరిశీలించిందని, ప్రభుత్వం ప్రకటించిన తరువాత, ఈ వాహనాలకున్న డిమాండ్ ని బట్టి ప్రణాళికలో భాగంగా ఇంకా ఎక్కువ ఇవి మోడళ్లను విడుదల చేయాలని యోచిస్తోంది అని కూడా చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

వ్యక్తిగతంగా కొనుగోలు చేసే కొనుగోలుదారుల కోసం మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన నెక్సాన్ ఇవి ని గురువారం కంపెనీ ఆవిష్కరించింది. దీనిలో సంస్థ యొక్క కొత్త ఇవి టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ జిప్‌ట్రాన్‌ను ఉపయోగిస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల యొక్క భారీ ధరలను తగ్గించాలని డైరెక్టర్ చంద్ర పేర్కొన్నట్లు మనకు తెలుస్తుంది. దాదాపు రూ.10 లక్షల లోపు ఈవీ వచ్చేవరకు పర్సనల్ వెహికల్ విభాగంలో వీటి ప్రాచుర్యం అసాద్యంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇదే తరుణంలో మారుతి తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి తన వాగన్ ఆర్ మోడల్‌ను ఎంచుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

ఎలక్ట్రిక్ వాహనాలను ఫ్లీట్ విభాగంతో పోలిస్తే వాటి యొక్క మార్కెట్ ధర భారీగా ఉందని ఛైర్మెన్ చెప్పారు. ఇప్పుడున్న మొత్తం ప్రయాణీకుల కార్ల మార్కెట్లో ఫ్లీట్ విభాగం కేవలం 10 శాతం మాత్రమే అని మిగిలిన 90 శాతం వ్యక్తిగత విభాగం అని తెలియజేసారు.

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడానికి టాటా మోటార్స్ ఇతర సంస్థలతో జతకట్టనుందా...?

టాటా మోటార్స్ యొక్క ఎంటి-లెవల్ సెగ్మెంట్ లోని వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపాంతరం చెందితే వాటి ధర చాలా ఎక్కువగా ఉండవచ్చు మరియు వినియోగదారులను కొంత వరకు కష్టంగా ఉంటుంది. అందువల్ల వీటి యొక్క ధరలో ఉన్న వ్యత్యాసాన్ని 20 నుంచి 25 శాతానికి మించకుండా వుండే మోడల్‌ను ఎంచుకుంటామని చెప్పారు. ఈ విధానంగా చేసినప్పుడు మాత్రమే కారు యొక్క అత్యుత్తమ పనితీరుతో పాటు బహుళ ప్రజాదరణ పొందుతుంది.

Source: Business Standard

More from DriveSpark

Article Published On: Monday, December 23, 2019, 10:35 [IST]
English summary
Tata Motors to tie up with group entities to foray into electric vehicles-Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+