Just In
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్రేకింగ్ న్యూస్: టాటా మోటార్స్ నుండి మరో ఎలక్ట్రిక్ వెహికల్ ప్రకటన
టాటా మోటార్స్ వారు ఇండియన్ మార్కెట్ కోసం నెక్సాన్ ఎస్యువి ఎలక్ట్రిక్ వర్షన్ పై పని చేస్తున్నట్లు నిర్ధారించారు. రాబోయే 18 నెలల్లోగా భారతదేశంలో అమ్మకానికి వెళ్లడానికి నాలుగు కొత్త ఎలక్ట్రిక్ వాహనాల షెడ్యూల్ లో టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కూడా ఉంటుంది.

75 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులతో కలిసిన సందర్భంగా టాటా మోటార్స్ ఛైర్మన్, టాటామోటార్స్, నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్యువి ను ధ్రువీకరించారు. గతంలో అనేక ఊహాజనక నివేదికలు ఉన్నపటికీ టాటా నెక్సాన్ విద్యుత్ కు సంబంధించి ఇదే తొలి అధికారిక నిర్ధారణ చేసినది.

అయితే, ఈ సమయంలో నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎస్యువి గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. రాబోయే ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి తన బ్యాటరీ టెక్నాలజీ, మోటార్ ను తీసుకోవాలని టాటా మోటార్స్ భావిస్తోంది.

అలాగే, మార్కెట్లో టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ తరహాలోనే, నెక్సాన్ ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఫీచర్ ను కలిగి ఉంటుందని తెలిసింది. టాటా మోటార్స్ కూడా అల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వెహికల్ తరహాలోనే డీసీ, ఏసీ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ పై ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు.

ఆల్ట్రోజ్ ప్రీమియమ్ హ్యాచ్ బ్యాక్ యొక్క ఎలెక్ట్రిక్ వెర్షన్ 2019 జెనీవా మోటార్ షో వద్ద కొత్త కాన్సెప్ట్ రూపంలో ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ తో కలిసి ఈ షో లో ప్రదర్శించారు. ఇది ఒక సారి ఛార్జింగ్ చేస్తే సుమారు 250 నుంచి 300కిమీ దూరాన్ని ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని టాటా కూడా ధృవీకరించారు.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కూడా ఇదే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు, రెండు ఉత్పత్తులను మార్కెట్ లో మంచి కొనుగోలులు నమోదు చేస్తాయని భావిస్తున్నారు.

నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్, ఆల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాకుండా టాటా మోటార్స్ భారత మార్కెట్లో టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ గా కూడా రిఫ్రెష్ వెర్షన్ ను కూడా ప్రవేశపెట్టనుంది.కేవలం క్యాబ్ లు, ఫ్లయిట్ ఆపరేటర్లకు మాత్రమే పరిమితమైనప్పటికీ ప్రస్తుత టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇప్పటికే భారత మార్కెట్లో అందుబాటులో ఉంది.

టాటా మోటార్స్ నుంచి నాలుగో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంది, అయితే, ప్రస్తుతం ఆ మోడల్ కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుత టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్ లో 16.4 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు, ఇది ఒక సారి ఛార్జింగ్ చేస్తే సుమారు 140 కిమీ దూరాన్ని ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

రిఫ్రెష్ మోడల్ లో స్వల్పంగా మార్పు చేసారు, ఇది సుమారుగా 200 కిమీ ఉంటుంది. ప్రస్తుత టిగోర్ ఎలక్ట్రిక్ వెహికల్, రూ 9.99 లక్షలు, ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ధర తో వాణిజ్య అవసరాలకు అందుబాటులో ఉంది. అయితే, టాటా మోటార్స్ ఒక ఎలక్ట్రిక్ కాంపాక్ట్-ఎస్యువి మీద పనిచేసే ఏకైక భారతీయ తయారీ సంస్థ కాదు.

మహీంద్రా కూడా ఇండియన్ మార్కెట్లో ఎక్స్యూవి300 ఎలక్ట్రిక్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కొత్త మహీంద్రా ఎక్స్యూవి300 రాబోయే నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ నేరుగా పోటీపడనుంది, ఇవి 2020 లో అమ్మకానికి వెళుతుందని సమాచారం.