బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

భారతదేశంలో టాటా మోటార్స్ అనేది ప్రసిద్ధి చెందిన సంస్థల్లో ఒకటిగా పేరుపొందింది. ఇది మారుతున్న సమాజానానికి అనుగుణంగా వాహనాలను తయారుచేసి ప్రవేశపెట్టడంలో దిట్ట. ఇప్పుడు సాధారణ రీతులలోకంటే కుర్రకారుని ఆకర్షించడానికి ఒక కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టబోతోంది. దాని పేరే టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్.

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ఇండియాలో ప్రస్తుతం టాటా మోటార్స్ 2020 నెక్సాన్ యొక్క తయారీ చాలా చురుకుగా జరుగుతోంది. దీని తయారీ గురించి మరియు దీనికి సంబంధించిన కొన్ని విషయాలను రహస్యంగా ఉంచనుంది. ఏది ఏమైనా మొత్తానికి దాని డిజైన్ లక్షణాలు మాత్రం మనకు తెలుస్తున్నాయి.

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ఇప్పుడు టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ పబ్లిక్ రోడ్లపై పరీక్షించడం జరిగింది. దీని యొక్క క్లోజ్ అప్ స్పై షాట్స్ ను గమనించినట్లయితే అది ఫాసియా డిజైన్ ని కలిగి ఉంటుంది మనకు తెలుస్తుంది. ఈ వాహనంలో కొంతవరకు ముందు భాగంలో మార్పులను చేయడం జరిగింది. దీని వెనుక భాగంలో మాత్రం ఎటువంటి స్టైలింగ్ లో మార్పులు జరగలేదని నిర్దారణ అవుతుంది.

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

టాటా మోటార్స్ నెక్సాన్ యొక్క ముఖాన్ని తక్కువ వంకరగా మరియు ఎక్కువ రేంజ్ రోవర్ ఎవోక్-ఇష్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇది ప్రొజెక్టర్ ఎలిమెంట్స్‌తో కూడిన కొత్త డబుల్ బారెల్ హెడ్‌ల్యాంప్‌లు కలిగి ఉంటుంది. ఇవి మునుపటి కంటే పొడవుగా మరియు చూడటానికి అందంగా ఉంటాయి. ఇందులోని గ్రిల్ కూడా దానికి అనుగుణంగా పునర్నిర్మించినట్లు కనిపిస్తోంది.

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

నెక్సాన్ లోని బంపర్ వాస్తవానికి కొత్తగా పొగమంచు కాంతి ఆవరణలను కలిగి ఉన్నట్లు ఉంటుంది.ఇది దాదాపు ఇప్పటిదాకా మార్కెట్లో వచ్చిన వాహనాలకు పూర్తిగా బిన్నంగా ఉండబోతోంది. ఈ విదంగా కొత్త రంగులో ఉండటం అనేది నేటి యువ ప్రేక్షకులలో నెక్సాన్ ని బాగా ఆకర్షింపచేయడానికే అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విధమైన రహస్య చిత్రాలను పంచుకున్న ఆటో మొటివ్ ఔత్సాహికుడు ప్రేమ్ కుమార్.

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో విస్తృతమైన మార్పులు ఉండవు. కానీ ఇందులోని ట్రిమ్‌లు మాత్రం సర్దుబాటు చేయబడతాయి. కస్టమర్ల యొక్క ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇందులో కొత్త మార్పులు అమలు చేయబడతాయి. టాటా మోటార్స్ తన క్రాస్ఓవర్‌ను హ్యుందాయ్ వెన్యూకి సరిపోయేలా అదనపు కనెక్టివిటీ లక్షణాలతో కొత్తగా సన్నద్ధం చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ యొక్క ఉద్గార ప్రమాణాలు అప్‌గ్రేడ్ అయినప్పటికీ దానిలోని కొన్ని విషయాలు మాత్రం మనకు సుపరిచితమే. దీనిలోని పనితీరు యొక్క గణాంకాలు ఆప్టిమైజింగ్ చేయబడినప్పటికీ ఇంధన సామర్థ్యం కొంచెం తక్కువగా ఉండవచ్చు అని తెలుస్తుంది.

Read More:ఇండియాలో త్వరలో ప్రారంభించనున్న యమహా ఎలక్రిక్ స్కూటర్లు

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ప్రస్తుతం ఇందులో 1.2-లీటర్ రివోట్రాన్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ రివోటోర్క్ టర్బో డీజిల్ ఇంజన్లు 110 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తాయి. పెట్రోల్ యూనిట్ లో 170 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఆయిల్ బర్నర్ 180 ఎన్ఎమ్ లను అభివృద్ధి చేస్తుంది. దీని ప్రసార ఎంపికలలో 6 ఎంటి మరియు 6 ఏఎంటి లు ఉన్నాయి.

Read More:హ్యుండాయ్ ఆరా కార్ల ఆవిష్కరణ ఎప్పుడంటే...?

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

2020 టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 2020 జనవరిలో ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. జనవరి పండుగ సీజన్ కాబట్టి దీని యొక్క ప్రయోగం టాటా మోటార్స్ మెరుగైన ప్రభావాన్ని చూపడానికి సహాయపడుతుంది. కానీ ఆలా జరగకుంటే జనవరి 2020 లో కాకుండా ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పో 2020 లో నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ని లాంచ్ చేసే అవకాశం ఉంది.

Read More:ఇప్పుడే చూడండి, ఇండియాలో లాంచ్ అయిన కియా కార్నివాల్ ఎంపివి టీజర్!

బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

ఇక్కడ ఇంకో గమనించవలసిన విషయం ఏమిటంటే హ్యుందాయ్ వెన్యూ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 రాకతో మార్కెట్లో నెక్సాన్ యొక్క వాటా తగ్గిపోతున్నట్లు గుర్తించింది. టాటా మోటార్స్ ఫేస్ లిఫ్ట్ చాలా అవసరమైన షాట్ గా ఉంటుంది. ఎందుకంటే టాటా నెక్సాన్ ప్రస్తుత ఉత్తమ అమ్మకందారులలో ఒకటిగా ఉంది.

Source: Rushlane

Most Read Articles

English summary
2020 Tata Nexon facelift spied with BS6 emission testing kit-Read in Telugu
Story first published: Monday, December 23, 2019, 15:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X