టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్ విడుదల: ప్రత్యేకత ఏంటో తెలుసా?

టాటా మోటార్స్ మార్కెట్లోకి నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ ఎస్‌యూవీ క్రేజ్ మరియు క్రేజ్+ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది వరకే అందుబాటులో ఉన్న నెక్సాన్ ఎస్‌యూవీని క్రేజ్ ఎడిషన్ పేరుతో పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

టాటా నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుండటంతో రెగ్యులర్ వేరియంట్ల మాదిరిగా కాకుండా రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. టాటా నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్‌లోని క్రేజ్ వేరియంట్ ధర రూ. 7.57 లక్షలు మరియు హై-ఎండ్ వేరియంట్ క్రేజ్+ ధర రూ. 8.17 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీ దేశీయ మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుండి నెక్సాన్ క్రేజ్ కంపెనీ యొక్క రెండవ లిమిటెడ్ ఎడిషన్. గత ఏడాది కూడా నెక్సాన్ ఎస్‌యూవీని క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. నెక్సాన్ ఎస్‌యూవీ పది లక్షల సేల్స్ మైలురాయిని అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్‌ను మరో మారు తీసుకొచ్చారు.

షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

ఎక్ట్సీరియర్‌ రెగ్యలర్ నెక్సాన్‌తో పోల్చుకుంటే ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆల్ బ్లాక్ బాడీ పెయింటింగ్, అక్కడక్కడ కాషాయపు రంగు సొబగులు కారు మొత్తానికి ఆకర్షణీయమైన లుక్ తీసుకొచ్చాయి. ఇంటీరియర్‌లో కూడా పలుకాస్మొటిక్ మెరుగులు దిద్దారు. ఓవరాల్‌గా నెక్సాన్ క్రేజ్ చూడ్డానికి స్పోర్టివ్ మరియు స్టైలిష్‌గా ఉంది.

షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

నెక్సాన్ క్రేజ్ ఎడిషన్‌లో ఎక్ట్సీరియర్‌లో సిల్వర్ కలర్ రూఫ్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ కప్స్, ఫ్రంట్ గ్రిల్ మీద ఉన్న ప్రత్యేకమైన ఎలిమెంట్స్, అల్లాయ్ వీల్స్ మీద ఆరేంజ్ కలర్ హైలెట్స్ చూడవచ్చు. రియర్ డిజైన్‌లోని టెయిల్ గేట్ మీద క్రేజ్ (Kraz) ఎడిషన్ బ్యాడ్జ్ కూడా గమనించవచ్చు.

షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

ఎక్ట్సీరియర్‌తో పాటు సమానంగా ఇంటీరియర్‌లో కూడా బ్లాక్ అండ్ ఆరేంజ్ కలర్ అప్‌డేట్స్ వచ్చాయి. సీట్లు, ఎసీ వెంట్స్ చుట్టుపక్కల, సెంట్రల్ కన్సోల్, డోర్లు మరియు స్టీరింగ్ ప్రదేశాల్లో పియాన్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది.

షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

సాంకేతికంగా టాటా నెక్సాన్ క్రేజ్ లిమిటెడ్ ఎడిషన్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

షాకింగ్ ధరతో విడుదలైన టాటా నెక్సాన్ క్రేజ్ ఎడిషన్

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 10, 2019, 12:22 [IST]
English summary
Tata Motors has launched the 2019 Kraz special edition of the Nexon in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+