టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న తమ కార్లను ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేయడానికి ఎంతగానో ఇష్టపడుతుంది. అందులో భాగంగానే నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో పలు నూతన ఫీచర్లను జోడించిన ఎక్స్‌టి+ అనే వేరియంట్‌ను విపణిలోకి లాంచ్ చేసింది. దీని ధర రూ. 8.02 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఖరారు చేసింది.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

టాటా మోటార్స్ ఎక్స్‌టి+ మరియు ఎక్స్‌జడ్ వేరియంట్లలో పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైట్లు మరియు ఫాగ్ ల్యాంప్స్‌ను అందించింది. కానీ ఎక్స్‌టి+ వేరియంట్లో అదనంగా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్రైవర్ సీట్ ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే వెసులుబాటు మరియు 8-స్పీకర్ల సౌండ్ సిస్టమ్ అదనంగా అందించారు.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

టాటా నెక్సాన్ ఎక్స్‌టి+ వేరియంట్లో కొత్త ఫీచర్లను అందించినప్పటికీ కనెక్ట్ నెక్ట్స్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు అల్లాయ్ వీల్స్ వంటివి ఫీచర్లు రాలేదు. కానీ వీటిని భవిష్యత్తులో అప్‌గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ విషయానికి వస్తే ఈ రెండు వేరియంట్లలో ఏసీని ఇప్పటికీ మ్యాన్యువల్‌గానే ఆపరేట్ చేసుకోవాల్సిందే. కానీ ఎక్స్‌జడ్+ మరియు ఎక్స్‌జడ్ఎ+ వేరియంట్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

అన్ని రకాల ఫీచర్ల అప్‌గ్రేడ్స్‌తో లభిస్తున్న టాటా నెక్సాన్ ఎక్స్‌టి+ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 8.02 లక్షలు మరియు డీజల్ వెర్షన్ ధర రూ. 8.87 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా లభిస్తున్నాయి.

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

టాటా నెక్సాన్ ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్+ మరియు ఎక్స్‌జడ్ఎ+ వేరియంట్లలో కనెక్ట్ నెక్ట్స్ సిస్టమ్ యథావిధిగా లభిస్తోంది. కానీ మునుపటి కంటే కాస్త పెద్దదిగా 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ల్పే కలదు. మునుపటి కంటే ఇప్పుడిది మరింత వేగంగా స్పందిస్తోంది.

Most Read:' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

ఈ సరికొత్త 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది. న్యావిగేషన్ కోసం సహాయపడే వాయిస్ గుర్తుపట్టే టెక్నాలజీ, ఫోన్ కాల్స్, సింగల్ బటన్ ప్రెస్ ద్వారా మ్యూజిక్ ప్లే వంటివి ఉన్నాయి. వాయిస్ కమాండ్ ద్వారా మెసేజ్‌లు చదవడం మరియు మెసేజ్‌లకు రిప్లే కూడా ఇచ్చే టెక్నాలజీ ఇందులో తీసుకొచ్చారు.

Most Read:"ఎగిరే కారు" ను ఆవిష్కరించిన జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

టాటా నెక్సాన్ లభించే అన్ని వేరియంట్లు సాంకేతికంగా 1.2-లీటర్ టుర్భోఛార్జ్‌డ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతున్నాయి. వీటిని 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో ఎంచుకోవచ్చు.

Most Read:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారో భారీ ఫైన్ కట్టాల్సిందే...ఇవే కొత్త రూల్స్

టాటా నెక్సాన్ కొత్త వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు కోసం..

టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300 మరియు హ్యుందాయ్ ఇటీవల విడుదల చేసిన వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది.

Most Read Articles

English summary
Tata Motors Nexon XT+ Variant Launched In India: Prices Start At Rs 8.02 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X