ఊహించని ధరతో విడుదలైన టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు: పూర్తి వివరాల కోసం...
భారతదేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో కీలకమైన అడుగు వేసింది. టాటా సంస్థ తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును దేశీయ విపణిలోకి పూర్తి స్థాయిలో విడుదల చేసింది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారును రూ. 9.99 లక్షల నుండి రూ. 10.90 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్(ఇండియా) ధరలతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కానీ వ్యక్తిగత అవసరాలకు వీటిని విక్రయించడంలేదు.. అద్దె కార్లు, క్యాబ్ సేవలు నిర్వహించే మరియు విసృత రవాణా సేవలందించే సంస్థలకు మాత్రమే వీటిని పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఆటో కార్ ఇండియా కథనం మేరకు, కొనుగోలుదారుల నుంటి విక్రయదారుల వసూలు చేసే 1% TCS (Tax Collected at Sources) ట్యాక్స్ కలుపుకొని టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కార్ల ఎక్స్-షోరూమ్ ధరలను నిర్ణయించారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షం 260సి ప్రకారం వస్తువు యొక్క విక్రయ ధర రూ. 10 లక్షలు దాటితే మొత్తం ధరలో ఒక శాతాన్ని విక్రయదారుడు కొనుగోలుదారుడి నుండి పన్ను రూపంలో వసూలు చేయాల్సి ఉంటుంది.

అంటే కాకుండా దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది, తయారీ మరియు విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్-II (FAME - II) పథకం ద్వారా ప్రతి ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై రూ. 1.62 లక్షలు మేర ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఈ పథకం ద్వారా వచ్చే మొత్తాన్ని కూడా కలుపుకొని ధరలను నిర్ణయించారు.

ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా లభించే ప్రోత్సాహకాలను మినహాయిస్తే, టాటా ఎలక్ట్రిక్ కార్ల ధరల శ్రేణి రూ. 11.61 లక్షల నుండి రూ. 11.71 లక్షలుగా ఉంది. ప్రస్తుతం లభించే టాటా టిగోర్ పెట్రోల్ వేరియంట్‌తో పోల్చుకుంటే టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 4 లక్షల వరకు ఎక్కువగా ఉంది (ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను కలుపుకొని).

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ రెండు మధ్య స్థాయి వేరియంట్లలో లభ్యమవుతోంది. అవి టిగోర్ ఇవి ఎక్స్ఎమ్ మరియు టిగోర్ ఇవి ఎక్స్‌టి. టిగోర్ లభించే పెట్రోల్ మరియు డీజల్ వెర్షన్‌లలో కూడా ఈ వేరియంట్లను గుర్తించవచ్చు. కానీ టిగోర్ ఎలక్ట్రిక్ వేరియంట్లలో ఇవి అని ఉంటుంది. ఇవి అనగా ఎలక్ట్రిక్ వెహికల్ అని అర్థం.

టాటా విక్రయించే టిగోర్ ఎలక్ట్రిక్ రెండు వేరియంట్లు కూడా తెలుపు, నీలం మరియు సిల్వర్ అనే మూడు విభిన్న రంగుల్లో లభిస్తోంది. జూలై 1, 2019 నుండి అమల్లోకి వచ్చే నూతన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా టిగోర్ ఎలక్ట్రిక్ కారులో ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఎక్స్ఎమ్ మరియు ఎక్స్‌టి రెండు వేరియంట్లలో ఉమ్మడిగా లభించే ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. అయితే ఎక్స్‌టి వేరియంట్లో 14-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకోగల అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ పొందవచ్చు. కానీ వీటికి మరో రూ. 10,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రెండు వేరియంట్లను క్యాబ్ మరియు అద్దె కార్లుగా బాగా సరిపోతాయి. ఇందులో 330-లీటర్ల లగేజ్ స్పేస్ కలదు.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ రెండు వేరియంట్లలో బాడీ కలర్‌లో ఉన్న బంపర్లు మరియు డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ (ఏసీ), డ్రైవర్ సీట్ ఎత్తును సరిచేసుకునే అడ్జెస్ట్ లీవర్, పవర్ విండోస్, హార్మన్ సంస్థ నుండి సేకరించిన 2-డిఐఎన్ ఆడియో సిస్టమ్, ఇది బ్లూటూత్, యూఎస్‌బీ మరియు ఏయుఎక్స్ సపోర్ట్ చేస్తుంది.

టాటా టిగోర్ ఎలక్ట్రిక్ గురించిన అత్యంత కీలకమైన సమాచారం.. ఇందులో ఉన్న పవర్ సిస్టమ్ మరియు దీని మైలేజ్. సాంకేతికంగా వీటిలో 16.2kWh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. ఇది గరిష్టంగా 41బిహెచ్‌పి పవర్ మరియు 105ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 72 వోల్ట్, 3-ఫేస్ ఏసి (ఆల్టర్నేటివ్ కరంట్) ఇండక్షన్ మోటార్ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు అందుతుంది.

మైలేజ్ విషయానికి వస్తే ఒక్కసారి ఛార్జింగ్‌తో 142 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని టాటా పేర్కొంది. కానీ సహజ పరిస్థితుల్లో నిర్వహించిన టెస్డ్ డ్రైవ్‌లో 100కిలోమీటర్ల వరకు సునాయసంగా నడుస్తుందని తెలిసింది.

AC వాల్ పవర్ సాకెట్ ద్వారా 6 గంటల్లో 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. అంతే కాకుండా టాటా కథనం మేరకు DC 15kW ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 90 నిమిషాల్లోనే బ్యాటరీని 80 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు.
వెహికల్ మరియు బ్యాటరీ ప్యాక్‌తో సహా టాటా టిగోర్ ఎలక్ట్రిక్ మీద మూడేళ్లు లేదా 1,25,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది. టాటా ఎలక్ట్రిక్ కారు గురించి పూర్తి సమాచారం పొందారని ఆశిస్తున్నాము. టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారు గురించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి!


Click it and Unblock the Notifications








