Just In
Don't Miss
- Finance
అమెరికాలో జరిగింది... మన దగ్గరా జరుగుతుందా? రోబోట్స్ తో పెద్ద జాబ్స్ కూడా ఊష్ట్!
- News
చండీ 'వ్రతం'తో దోషాలు దూరం.. కార్యాలు దిగ్విజయం కావాలంటే ఏం చేయాలంటే?
- Movies
నాగబాబు అదిరిపోయే ఎంట్రీ: ఎంత మంది ఉన్నారన్నది కాదురా.. ఎవడున్నాడన్నదే ముఖ్యం
- Lifestyle
మంగళవారం మీ రాశిఫలాలు 10-12-2019
- Technology
పీసీ సరిగా పనిచేయడం లేదా, అయితే ఇది చూడండి
- Sports
85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
వాహన కొనుగోలుదారులకు శుభవార్త: కారు ధరలో రూ. 1.5 లక్షలు కేంద్రం చెల్లిస్తుంది
కేంద్రం ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు శుభవార్త ప్రకటించింది. అవును, మీరు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ కారు మొత్తం ధరలో కేంద్రం రూ. 1.5 లక్షల వరకు రాయితీ ఇస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన 2019 కేంద్ర బడ్జెట్‌లో ఈ మేరకు రాయితీలు వెల్లడించింది. భారత్‌ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా అభివృద్ది చేసే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించారు.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ఏకంగా ఒకటిన్నర లక్ష రుపాయలు రాయితీగా కేంద్రం ఇస్తోంది. కాబట్టి, బడ్జెట్ విశేషాలతో పాటు.. విడుదలకు సిద్దంగా టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి..

అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల కోసం మరో శుభవార్త అందించింది. ఫేమ్ స్కీమ్ ఫేజ్ 2 కింద ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు రూ.10,000 కోట్లు అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

ఫేమ్ 2 స్కీమ్ 2019 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. దీనికి సంబంధించి వచ్చే మూడేళ్ల కాలంలో రూ.10,000 కేటాయింపులు ఉంటాయని, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకమైన చార్జింగ్ స్టేషన్లను త్వరితగతిన ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. FAME-II స్కీమ్‌లో ఎలక్ట్రిక్ బైకులు, కార్లకు భారీ సబ్సిడీ ఇస్తోంది కేంద్రం. ఫేమ్-2 పథకానికి రూ.10,000 కోట్ల ప్యాకేజీ కేటాయించింది కేంద్రం. ఈ పథకం 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు వర్తిస్తుంది.

10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, 55,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు, 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు ప్రధాన పట్టణాలను కలిపే ప్రధాన రహదారుల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. అంతేకాదు,ఎలక్ట్రిక్ వాహనాలకు వసూలు చేస్తున్న పన్నుల్ని తగ్గించే ఆలోచనలోనూ కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన జీఎస్‌టీ మండలి వద్ద పెండింగ్‌లో ఉంది.

ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం రెండు కంపెనీలు మాత్రమే కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. టాటా మోటార్స్ టిగోర్ ఎలక్ట్రిక్, మహీంద్రా సంస్థ ఇవెరిటో మరియు ఇ20 ప్లస్ అనే ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్నాయి. కానీ ఇండియన్ కస్టమర్లను ఆకర్షించడంలో ఇవి విఫలమవుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది, తయారీ మరియు విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఎన్నో రాయితీలు మరియు ప్రోత్సాహకాలను అందిస్తుండటంతో పలు అంతర్జాతీయ కార్ల తయారీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్దమవుతున్నాయి. విడుదలకు సిద్దంగా ఉన్న టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల కోసం....

5. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్
కొరియాకు చెందిన ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ దేశీయంగా ఎన్నో ఉత్పత్తలను విక్రయిస్తోంది. కానీ ఇండియన్ లైనప్‌లో ఒక్క ఎలక్ట్రిక్ కారును కూడా ప్రవేశపెట్టలేదు. అయితే ఇప్పటికే ప్రపంచ విపణిలో అమ్మకాల్లో ఉన్న హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జూలై 09 న విడుదల చేసేందుకు సిద్దమైంది. ఇది 39.2 kWh మరియు 64.0 kWh సామర్థ్యం గల బ్యాటరీలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఇవి 312 మరియు 482కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయి.

4. ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా విభాగం ఏడాది చివరికల్లా దేశీయ విపణిలోకి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయాలని భావిస్తోంది. ఆడి ఇ-ట్రాన్ పేరుతో వస్తోన్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా నాలుగు చక్రాలకు పవర్ అందుతుంది (ఆల్-వీల్-డ్రైవ్). 95 kWh సామర్థ్యం ఉన్న లిథియం -అయాన్ బ్యాటరీ సిస్టమ్ కలదు, 5-సీటర్ ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 200కిలోమీటర్లు మరియు దీని ధర సుమారుగా రూ. 1.15 కోట్లు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉండవచ్చు.

3. ఎంజీ ఇజడ్ఎస్ (MG EZS electric)
ఇండియన్ మార్కెట్లోకి హెక్టర్ ఎస్‌యూవీని విడుదల చేసిన ఎంజీ మోటార్స్ తమ రెండవ ఉత్పత్తిగా ఇజడ్ఎస్ (EZS) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 5-సీటర్ ఎంజీ ఇజడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ డిసెంబర్ 2019 నాటికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో విడుదల చేయనున్న ఎలక్ట్రిక్ కార్లను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, హైదరాబాద్, ముంబాయ్, బెంగళూరు నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఫిన్లాండుకు చెందిన క్లీన్ ఎనర్జీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

2. టాటా అల్ట్రోజ్ ఎలక్ట్రిక్ వెహికల్
దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ మరో ఏడాదిలోపు అల్ట్రోజ్ ఎలక్ట్రిక్ కారును విపణిలోకి విడుదల చేయనుంది. ఆల్ఫా ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించిన ఇందులో పర్మినెంట్ మ్యాగ్నెట్ ఏసీ మోటార్ మరియు సింగల్ స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది. దీని ధర సుమారుగా రూ. 10 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

1. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్
మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు 2020 నాటికి విడుదలకానుంది. వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ గురించి కంపెనీ ఇంత వరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ వ్యవస్థ, పరికరాలు, సామర్థ్యం మరియు మైలేజ్‌కు సంభందించిన వివరాలను రివీల్ చేయలేదు. ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్లతో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 200కిమీల ప్రయాణించే కెపాసిటీ ఉండవచ్చు. దీని ధర సుమారుగా రూ. 10 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.