Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జులై 2019 నెలలో భారతీయులు ఎక్కువగా కొన్న కార్లు ఇవే
భారత దేశంలో కార్ల అమ్మకాల పరంగా మారుతీ సుజుకి దే పైచేయి అని చెప్పవచ్చు. జులై నెలలో కార్ల అమ్మకాలను గమనిస్తే ఎక్కువ మంది మారుతీ సుజుకి కార్లనే కొనుగోలు చేసారు. దీని తరువాత స్థానంలో ఎప్పటి లాగానే హ్యుందాయ్ నిలిచింది. భారతీయులకు కార్లను ఎక్కువగా ఇష్టపడుతారు. అందుకే కార్ల తయారీ సంస్థలు వినియోగదారులను ఆకర్షించే విధంగా కొత్త డిజైన్లు, అదిరిపోయే కొత్త టెక్నాలజీ తో ఎప్పటికప్పుడు మోడల్ లను మార్కెట్లోకి తీసుకొస్తుంటారు. అయితే ముఖ్యవిషయానికి వస్తే ఇక్కడ జులై నెలలో భారతీయులు ఎక్కువగా కొన్న టాప్ 10 కారు జాబితా ఇక్కడ వివరంగా తెలిపాము చూడండి..

జూలై 2019 నెలలో భారత్ లో టాప్ సెల్లింగ్ కార్లకు సంబంధించిన జాబితా విడుదలైంది. విడుదల చేసిన ఈ జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. గత కొద్దీ నెలలుగా చూసుకొంటే మారుతి సుజుకి కూడా క్షిణించిన అమ్మకాలను నమోదు చేసింది. అయినా కూడా ఇప్పటికీ టాప్-10 జాబితాలో 7 స్థానాలను ఆక్రమించాయి, హ్యుందాయ్ మిగిలిన మూడు స్థానాలలో నిలిచింది.

మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో క్షిణించిన అమ్మకాలను ఎదుర్కుంటోంది. ఈ బ్రాండ్ నుంచి చాలా మోడళ్లు సేల్స్ జులై నెలలో క్షీణించాయి. అయితే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ జూలై 2019 లో 15,062 యూనిట్లతో నెలవారీ అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేసింది.

జూన్ 2019 తో పోలిస్తే 10,288 యూనిట్ల అమ్మకాల తో ఐదవ స్థానం ఉంది అయితే ఇప్పుడు వ్యాగన్ ఆర్ మొదటి స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి డిజైర్ 12,293 యూనిట్ల విక్రయాలతో రెండవ స్థానంలో నిలిచింది. గత నెలలో అంటే జులై లో 12,677 యూనిట్ల అమ్మకాల తో మారుతీ సుజుకి స్విఫ్ట్ 3 వ స్థానంలో వెనుకబడి ఉంది.

ఈ రెండు మోడల్స్ నెలవారీ అమ్మకాల్లో 246 యూనిట్ల తేడాతో దగ్గరగా ఉన్నాయి. జూన్ 2019 లో డిజైర్ 14,868 యూనిట్లను నమోదు చేస్తుండగా, స్విఫ్ట్ 16,330 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసుకుంది.

జూన్ 2019 నెలలోనే ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో నిలిచిన మారుతీ సుజుకీ ఆల్టో ఈ జాబితాలో నాలుగో స్థానానికి పడిపోయింది.ఆల్టో అమ్మకాలు జూన్ 2019 లో 18,000 యూనిట్లతో పోలిస్తే జూలై 2019 లో కేవలం 11,577 యూనిట్లు నమోదు చేసుకొంది.

ఐదో, ఆరో స్థానాన్ని వరుసగా బాలెనో, ఎకో ఆక్రమించాయి. అంటే బాలెనో ఐదవ స్థానంలో 10,482 యూనిట్ల అమ్మకాలను నమోదు చేస్తుండగా, ఎకో ఆరవ స్థానంలో జులై నెలలో 9,814 యూనిట్లు అమ్మకాలను నమోదు చేసింది.
Most Read:' డ్రైవర్ లెస్ ' కారు లో సచిన్ టెండూల్కర్.. వీడియో సంచలనం

తరువాత హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్యువి గా అవతరించింది అని చెప్పవచ్చు కానీ ఇది టాప్ 5 స్థానంలో కూడా నిలువలేదు. అంటే ఈ కాంపాక్ట్-ఎస్యువి 9,585 యూనిట్ల అమ్మకాలను నమోదుచేయగా, ఈ జాబితాలో ఏడో స్థానాన్ని ఆక్రమించడం విశేషం.
Most Read:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారో భారీ ఫైన్ కట్టాల్సిందే...ఇవే కొత్త రూల్స్

అయితే ఆశ్చర్యం ఏమిటంటే, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా (హ్యుందాయ్ వెన్యూకు గట్టి పోటీగా) ఇది పూర్తిగా టాప్-10 జాబితాలో కూడా ఆక్రమించ లేక పోయినది. దీనిని బట్టి హ్యుందాయ్ వెన్యూ ఇచ్చిన పోటీ లో నిలువలేక పోయినది.
జూలై 2019 న భారతదేశంలో టాప్ సెల్లింగ్ కార్ల జాబితా ఈ క్రింది పట్టికలో చూడండి:
Rank | Model | Units |
1 | Maruti WagonR | 15,062 |
2 | Maruti Dzire | 12,923 |
3 | Maruti Swift | 12,677 |
4 | Maruti Alto | 11,577 |
5 | Maruti Baleno | 10,482 |
6 | Maruti Eeco | 9,814 |
7 | Hyundai Venue | 9,585 |
8 | Maruti Ertiga | 9,222 |
9 | Hyundai i20 | 9,012 |
10 | Hyundai Creta | 6,585 |
Most Read:హెల్మెట్ లేదని ఫైన్.. కోపంతో పోలీస్ స్టేషన్ కరెంటు పీకేసిన ఘనుడు

ఈ జాబితాలో ఎనిమిదో స్థానం మరో మారుతి సుజుకి ఉత్పత్తి నిలిచింది అదే ఎర్టిగా. ఈ ఎంపివి జూలై 2019 నెలలో 9,222 యూనిట్లు నమోదు చేసింది. విటారా బ్రెజ్జా స్థానంని ఆక్రమించిందని చెప్పవచ్చు.

తరువాత స్తానంలో దిగువ నుంచి రెండు స్థానాలను హ్యుందాయ్ వారి ఎలైట్ ఐ20 మరియు క్రెటా ఆఫరింగ్ ల ద్వారా ఆక్రమించింది. అంటే హ్యుందాయ్ ఎలైట్ ఐ20 9,012 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకోవడంతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది, అలాగే హ్యుందాయ్ క్రెటా 6,585 యూనిట్లతో 10వ స్థానాన్ని పదిలం చేసుకొంది.