దుమ్ములేపిన టయోటా గ్లాంజా సేల్స్.. బాలెనో, ఎలైట్ ఐ20 కార్ల భారీ షాక్
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లోకి సరికొత్త మోడల్ "గ్లాంజా" కారును లాంచ్ చేసింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో టయోటా విడుదల చేసిన తొలి మోడల్ గ్లాంజా టయోటా నెలవారీ విక్రయాల్లో అత్యుత్తమ ఫలితాలు కనబరుస్తోంది.

ఆగష్టు 2019 సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే టయోటా గ్లాంజా 2,322 యూనిట్ల విక్రయాలు నమోదు చేసుకుంది. దీంతో ఇండియన్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మూడవ బెస్ట్ సెల్లింగ్ కారుగా టయోటా గ్లాంజా స్థానం సంపాదించికుని వోక్స్‌వ్యాగన్ పోలో మరియు హోండా జాజ్ కార్లను వెనక్కి నెట్టింది.

ఆగస్టు 2018లో 1,899 యూనిట్ల పోలో కార్లను విక్రయించిన వోక్స్‌వ్యాగన్ ఈ ఏడాది అదే నెలలో 1,573 యూనిట్లను విక్రయించే 17.17 శాతం వృద్దిని కోల్పోయింది. ఫోర్డ్ ఫ్రీ స్టైల్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. గత ఏడాది ఆగష్టులో 2,564 కార్లను అమ్మితే.. ఈ యేడు కేవలం 647 కార్లను మాత్రమే విక్రయించే ఫోర్డ్ ఫ్రీస్టైల్ కారు 74 శాతం వృద్దిని కోల్పోయింది

| Model | August 2019
| August 2018
| Difference (%) |
| Maruti Suzuki Baleno | 11,067 | 17,713 | -37.52 |
| Hyundai Elite i20 | 7,071 | 11,475 | -38.38 |
| Toyota Glanza | 2,322 | - | - |
| Volkswagen Polo | 1,573 | 1,899 | -17.17 |
| Ford Freestyle | 647 | 2,564 | -74.77 |
| Honda Jazz | 558 | 1,119 | -50.17 |
ఆగష్టు 2019 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్ల సేల్స్ జాబితాలో హోండా జాజ్ కారు 558 యూనిట్లతో చివరి స్థానంలో నిలిచింది. గత ఏడాది 1,119 జాజ్ కార్లు అమ్ముడవ్వగా.. ఈ యేడు సగానికి పైగా విక్రయాలు కోల్పోయి 50.13 శాతం వృద్దిని కోల్పోయింది.

తొలి రెండు స్థానాల్లో మారుతి సుజుకి బాలెనో మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కార్లు సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆగష్టు 2019లో మారుతి బాలెనో 11,067 కార్లు మరియు ఎలైట్ ఐ20 మోడల్ 7,071 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఏదేమైనప్పటికీ.. ఆగష్టు 2018తో పోల్చుకుంటే మారుతి బాలెనో 37.57 శాతం మరియు హ్యుందాయ్ ఎలైట్ ఐ20 38.8 శాతం వృద్దిని కోల్పోయాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో దాదాపు అన్ని మోడళ్ల తీవ్ర స్థాయిలో నష్టాన్ని మూటగట్టుకున్నాయి. కానీ ఏడాది విడుదలైన టయోటా గ్లాంజా కంపెనీకి మంచి ఫలితాలు తెచ్చిపెట్టింది.

టయోటా గ్లాంజా నిజానికి మారుతి సుజుకి బాలెనో కారే.. మారుతి మరియు టయోటా మధ్య కుదిరిన ఉమ్మడి భాగస్వామ్యంలో భాగంగా బాలెనో కారును గ్లాంజా పేరుతో టయోటా విక్రయిస్తోంది. టయోటా గ్లాంజా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ V మరియు G అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభ్యమవుతోంది. మారుతి బాలెనో కారులో ఉండే దాదాపు అన్ని ఫీచర్లు గ్లాంజా కారులో వచ్చాయి.

సాంకేతికంగా టయోటా గ్లాంజా రెండు వేరియంట్లో పెట్రోల్ ఇంజన్ కలదు. 1.2-లీటర్ కెపాసిటీ ఉన్న కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సుజుకి-టయోటా భాగస్వామ్యంలో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తీసుకొచ్చిన మొట్టమొదటి మోడల్ టయోటా గ్లాంజా. ఆగష్టు 2019 నెలలో టయోటా గ్లాంజా మంచి సేల్స్ సాధించడంతో ఇకపై మరిన్ని మోడళ్లను రీ బ్యాడ్జ్ వెర్షన్‌లో పంచుకుని విక్రయించనున్నాయి.


Click it and Unblock the Notifications








