Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ కార్లపై 5 లక్షల వరకు పెరుగుతున్న ధరలు
టయోటా ఇండియా విభాగం దేశీయంగా అతి త్వరలో అమల్లోకి రానున్న బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తమ ఇంజన్‌లను అప్‌గ్రేడ్ చేసే పనిలో నిమగ్నమయ్యింది. ఈ బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్‌లను తొలుత పాపులర్ మరియు బెస్ట్ సెల్లింగ్ కార్లయిన ఇన్నోవా క్రిస్టా ఎంపీవీ మరియు ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలలో అందివ్వనుంది.

బిఎస్-6 ఇంజన్ అప్‌డేట్స్ కారణంగా టయోటా ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ మోడళ్ల ధరలను కూడా కంపెనీ పెంచనుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ కార్లపై సుమారుగా రూ. 5 లక్షల వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది.

టయోటా కిర్లోస్కర్ ఇండియా సంస్థ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని మోడళ్లను పెట్రోల్ వెర్షన్‌లో అప్‌డేట్ చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న డీజల్ ఇంజన్‌లను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా డెవలప్ చేసే విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుటోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా అతి త్వరలో పెట్రోల్-హైబ్రిడ్ వెర్షన్‌లో రానుందని టయోటా ఇది వరకే ప్రకటించింది. డీజల్ ఇంజన్ స్థానాన్ని ఈ హైబ్రిడ్ వెర్షన్ భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం లభిస్తున్న చాలా వరకు మోడళ్లలో ఉన్నటువంటి డీజల్ ఇంజన్‌లకు స్వస్తి పలికి వీటికి బదులుగా పెట్రోల్ మరియు హైబ్రిడ్ ఇంజన్ వేరియంట్లను పెంచుకోవాలని భావిస్తోంది.

టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రస్తుతం మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. అవి, రెండు డీజల్ మరియు ఒక పెట్రోల్. ఇందులోని 2.7-లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 160బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

డీజల్ ఇంజన్ విషయానికి వస్తే ఇది 2.4-లీటర్ మరియు 2.75-లీటర్ ఇంజన్ ఆప్షన్‌లలో డీజల్ వేరియంట్లు లభ్యమవుతున్నాయి. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే చిన్న ఇంజన్ 150బిహెచ్‌పి పవర్ మరియు 343ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, అదే విధంగా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే పెద్ద ఇంజన్ 173బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టయోటా ఫార్చ్యూనర్ ప్రీమియం ఎస్‌యూవీ విషయానికి వస్తే ఇది కూడా పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే 2.7-లీటర్ పెట్రోల్ ఇంజన్ 160బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్ పవర్ ఇస్తుంది.
Most Read: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు..

అదే విధంగా 2.75-లీటర్ కెపాసిటీ గల డీజల్ ఇంజన్ 173బిహెచ్‌పి పవర్ మరియు 420ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని కూడా అవే 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.
Most Read: 68 వేల ధరకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: పెట్రోల్ అవసరం లేదు!

టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రారంభ ధర రూ. 14.93 లక్షలు మరియు టయోటా ఫార్చ్యూనర్ ధర రూ. 27.83 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. ఈ రెండు మోడళ్లలో కూడా బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే నూతన ఇంజన్‌లను అందిస్తే వీటి ధరలు సుమారుగా రూ. 5 లక్షలు వరకు పెరిగే అవకాశం ఉంది.
Most Read: ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్లపై అదిరిపోయే ఆఫర్లు: ఇప్పుడే చెక్ చేసుకోండి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ రెండు మోడళ్లు కూడా కంపెనీ కీలకమైన ఉత్పత్తులు. ఎంపీవీ సెగ్మెంట్లో ఉన్న మహీంద్రా మరాజో మరియు మారుతి సుజుకి ఎర్టిగా మోడళ్లకు ఇన్నోవా క్రిస్టా గట్టి పోటీనిస్తోంది.
టయోటా ఫార్చ్యూనర్ విషయానికి వస్తే, ఈ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్ ఇదే. దేశవ్యాప్తంగా ఫార్చ్యూనర్ మోడల్‌కు అభిమానులు విపరీతంగా ఉన్నారు. ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా అల్టురస్ జి4 వంటి ఫుల్ సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది.
Source: Gaadiwaadi