2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

టయోటా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యబోతున్న ఎలక్ట్రిక్ వహనాల గురించి ప్రకటించింది, అందులో దాదాపుగా 10 వాహనాలు ఉంటాయని మరియు వీటిని 2025 సంవత్సరం లోపు గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది అని సమాచారం. ముఖ్యంగా వీటిలో 6 కార్ లు ఆటోమోటివ్ సిగ్మెంట్ లో ఉంటాయని తెలిసింది.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

వీటిని టయోట కొత్త బ్రాండ్ బిఈవి(బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం) ప్లాట్ఫామ్ పై నిర్మించనుంది. ప్రపంచంలో బాగా పేరున్న ఆటోమోటివ్ కంపెనీల్లో టయోటా ఒకటి అని మనకు తెలుసు. టయోటా వారి కార్లు ఎంతో విశ్వసనీయమైన యంత్రాలు మరియు స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ వాహనాలు హైబ్రిడ్స్ తో సహా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రపంచంలో అగ్ర స్థానాన్ని సంపాదిచాలని అనుకొంటోంది.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

ఎలక్ట్రిక్ వాహనాల రాక మునుపు స్థిరమైన మరియు గ్రీన్ మోబిలిటీ మార్గంలో టయోటా తన పని ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వారి వాహనాల రేటు పెరుగుతున్నది, అనేక కొత్త కంపెనీలు వచ్చినా, తమ వాహనాలలో ఏదో ఒక కొత్త సాంకేతికతలను ఉపయోగించి టయోటా తన అమ్మకాలను అబివృద్ది చేసుకొంటోంది.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రస్తుతం అమ్మకానికి ఉన్న టొయోటా ఎలక్ట్రిక్ కార్ల అతిపెద్ద లోపం ఉందని, అవి అనేక సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందాయి అందుకే వారి శిలాజాల-ఇంధన వేదికను ఉపయోగించుకొని రాబోవు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నారు.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

ఇప్పుడు అయితే పరిస్థితులు మారిపోయాయి. టయోటా ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం అభివృద్ధికి కొత్త విధానాన్ని ఉపయోగిస్తున్నారు. మొత్తం పది ఎలక్ట్రిక్ వాహనాలు ఒకే ప్లాట్ ఫారం మీద ఆధారపడి ఉంటాయి, దీని కోసం ప్రత్యేకంగా బిఈవి వేదికను అభివృద్ధి చేస్తున్నారు.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

2015లో తయారుచేసిన టయోటా ప్రియస్, టిఎన్జిఎ(టయోటా న్యూ గ్లోబల్ ఆర్కిటెక్చర్) ప్లాట్ ఫామ్ ను పోలి ఉంటుంది. ఎందుకంటే, ఇది ఆల్-వీల్-డ్రైవ్ డ్రై-ట్రైన్ ని ఉపయోగించుకొని టయోటా పది కార్లను అభివృద్ధి చేయనున్నారు.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

పదిలో కేవలం ఆరు మోడళ్లు మాత్రమే గ్లోబల్ మోడల్స్ గా ఉండగా మిగతా నాలుగు మాత్రమే కొన్ని మార్కెట్లకు మాత్రమే పరిమితం అవుతాయి. అమ్మకాల పరంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న ఆరు సెగ్మెంట్లను టయోటా లక్ష్యంగా పెట్టనుంది.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

టొయోటా యొక్క కొత్త ఈవి కాంపాక్ట్ సెగ్మెంట్లు కార్లు లలో , మీడియం క్రాసోవర్, మీడియం సెడాన్, మీడియం మినీ వ్యాన్, మీడియం ఎస్ యువి, మరియు బిగ్ ఎస్యువిలు ఉన్నాయి.ఈ కాంపాక్ట్ కార్లును ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాలలో ఉపయోగించడం కోసం రూపొందించనున్నారు.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

ఈ కార్లను సుజుకి మరియు డైహత్సు అనే సంస్థతో కూడి అభివృద్ధి చేయనుంది. ఇందులో రెండు సీట్ల చిన్న కార్లు కూడా ఉంటాయి. ఈ విధమైన ఒక కాంపాక్ట్ హ్యాచ్ బ్యాక్ భారతీయ మార్కెట్ కు రావచ్చు. కానీ పెద్ద ఎస్యూవి లు, మినీ వ్యాన్ లను అమెరికా మార్కెట్ ను టార్గెట్ చేసే అవకాశముంది.

2025 కల్లా 10 ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తుందట టయోటా.!

దేశీయ మార్కెట్లో ప్రజాధారణ పొందిన సంస్థలలో టయోటా కుడా ఒకటి, ఈవి పరిశ్రమలో వృద్ధి రేటును అందుకోనుంది, అందువలన టయోటా ఖచ్చితంగా భారత మార్కెట్లో వదులుకోలేదు. కావున ఇండియాలో కొత్త మీడియం రేంజ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 12, 2019, 12:13 [IST]
English summary
Toyota has announced its electric vehicle plans for the global market. Toyota has revealed that it would develop and launch ten new electric cars before 2025 and these cars would cover six of the most important automotive segments.
Read more on: #టయోటా #toyota
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+