వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ దీపావళి పండుగను పురస్కరించుకొని అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లు ప్రకటించింది. పండుగ సీజన్‌లో భాగంగా పోలో, అమియో మరియు వెంటో కార్లపై ఏకంగా రూ. 1,80,000 వరకు ప్రయోజనాలను ప్రకటించింది.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

పండుగ ఆఫర్లలో భాగంగా ఐదేళ్ల ఉచిత వారంటీ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ కూడా లభిస్తున్నాయి. వోక్స్‌వ్యాగన్ కార్లను టెస్ట్ డ్రైవ్ మరియు బుకింగ్ చేసే ప్రతి కస్టమర్‌కు ఖచ్చితమైన బహుమతి అందిస్తోంది. అక్టోబర్ 31 వరకు "వోక్స్‌ఫెస్ట్" పండుగ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. వివిధ మోడల్ వారీగా ఏయే కారు మీద ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి చూద్దాం రండి..

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ప్రారంభ మోడల్ పోలో హ్యాచ్‌బ్యాక్ కారు. దీపావళి పండుగ ఆఫర్లలో భాగంగా ఈ కారు మీద గరిష్టంగా రూ. 1,11,000 ప్రయోజనాలను లభిస్తున్నాయి. పోలో స్టార్టింగ్ వేరియంట్ ధర రూ. 5,44,000 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. పోలో డీజల్ వేరియంట్‌పై ఐదేళ్ల ఉచిత వారంటీ మరియు ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ లభ్యమవుతున్నాయి.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

పవర్ ఫుల్ పోలో కారు రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అవి 74.9బిహెచ్‌పి పవర్ మరియు 95ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే మూడు సిలిండర్ల 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 88.7బిహెచ్‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే నాలుగు సిలిండర్ల 1.5-లీటర్ డీజల్ ఇంజన్. రెండింటినీ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

వోక్స్‌వ్యాగన్ పోలో కారును ఇటీవల సరికొత్త GT line వెర్షన్‌లో కూడా లాంచ్ చేసింది. పోలో జిటి లైన్ బేస్ వేరియంట్లో సరికొత్త 1.2-లీటర్ టుర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు వోక్స్‌వ్యాగన్ ఇంజన్ లైనప్‌లో ఇదివరకే లభిస్తున్న 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్‌ను 7-స్పీడ్ డీజీఎస్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

వోక్స్‌వ్యాగన్ అమియో

కంపెనీ కాంపాక్ట్ సెడాన్ అమియో కారు మీద ఏకంగా రూ. 1,47,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. అమియో ప్రారంభ వేరియంట్ రూ. 5,29,000 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ) ధరతో లభిస్తోంది. అమియో డీజల్ వేరియంట్లపై ఐదేళ్ల ఉచిత వారంటీ మరియు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ లభిస్తున్నాయి.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

వోక్స్‌వ్యాగన్ అమియో కాంపాక్ట్ సెడాన్‌లో కూడా పోలో హ్యాచ్‌బ్యాక్ లోని అనే ఇంజన్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇందులోని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 74.9బిహెచ్‌పి పవర్ మరియు 95ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

అదే విధంగా 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ (DSG) డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఛాయిస్‌లో ఎంచుకోవచ్చు. 88.7బిహెచ్‌‌పి పవర్ మరియు 230ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

వోక్స్‌వ్యాగన్ వెంటో

కంపెనీ యొక్క పుల్ సైజ్ సెడాన్ కారు వెంటో. వోక్స్‌వ్యాగన్ వెంటో కారు మీద దీపావళి ఆఫర్లలో భాగంగా గరిష్టంగా రూ. 1,80,000 ప్రయోజనాలున్నాయి. వెంటో ప్రారంభ వేరియంట్ ధర రూ. 8,76,000 లుగా ఉంది. వోక్స్‌వ్యాగన్ వెంటో డీజల్ వేరియంట్ మీద ఐదేళ్ల ఉచిత వారంటీ మరియు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఆఫర్ అందుబాటులో ఉంది.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

వోక్స్‌‌వ్యాగన్ వెంటో సెడాన్ కారు మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అవి, 103.5బిహెచ్‌‌పి పవర్-153ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.6-లీటర్ పెట్రోల్ ఇంజన్, 103.5బిహెచ్‌పి పవర్-153ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ మరియు 88.7బిహెచ్‌పి పవర్-230ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.5-లీటర్ డీజల్ ఇంజన్.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

వెంటోలోని ప్రారంభ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్, 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ DSG డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ మాత్రమే లభ్యం కాగా.. డీజల్ ఇంజన్ ఆప్షన్లు మాత్రం 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

వోక్స్‌వ్యాగన్ అన్ని మోడళ్లపై '4Ever Care' కంపెనీ వారి మెయింటెనెన్స్ ప్యాకేజీ కూడా అందిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగానే నాలుగేళ్ల వారంటీ మరియు మూడేళ్ల కాంప్లిమెంటరీ సర్వీసులు మరియు నాలుగేళ్ల పాటు ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ సర్వీసులు లభిస్తాయి.

వోక్స్‌వ్యాగన్ దీపావళి ఆఫర్లు.. లక్షా 80 వేల రూపాయల భారీ డిస్కౌంట్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మోడళ్లయిన పోలో, అమియో మరియు వెంటో కార్లపై అద్భుతమైన దీపావళి ఆఫర్లు ప్రకటించింది. అన్ని మోడళ్లపై లక్షకు పైగా విలువైన ఆఫర్లు అందిస్తోంది. కస్టమర్లపై నిర్వహణ భారం పడకుండా అత్యుత్తమ సర్వీస్ ప్యాకేజీలను కూడా అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు వోక్స్‌వ్యాగన్ షోరూమ్‌లను సందర్శించి మీకు నచ్చిన మోడళ్లను ఎంచుకోండి.

More from DriveSpark

Article Published On: Monday, October 14, 2019, 12:24 [IST]
English summary
Volkswagen Diwali Discount Offers: Festive Benefits Available On Select Models. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+